Bigg Boss Telugu 9 Day 37 Nominations Promo : బిగ్​బాస్​లో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. సీజన్ 9 తెలుగులో డే 37కి సంబంధించిన రెండో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అయేషానే హైలెట్ అయింది. తన గేమ్ ప్లాన్​తో తనూజపై ఫైర్ అయింది. వైల్డ్ కార్డ్స్ బాలు పట్టుకొని కంటెస్టెంట్లకు ఇవ్వాల్సిన ఈ గేమ్​లో బాలు దక్కించుకోకపోయినా.. అడిగి మరీ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అసలు ఏమి జరిగింది.. ప్రోమోలో ఏమి చూపించారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement


బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో డే 37


బిగ్​బాస్ డే 37కి సంబంధించి రెండో ప్రోమోను విడుదల చేశారు. అందరూ లోపల ఉండగా బిగ్​బాస్ బాల్​కి సంబంధించిన బజర్ ప్లే చేశారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే బాల్ తనకి వదిలేయమంటూ అయేషా అడుగుతుంది. వేరే కంటెస్టెంట్​ పట్టుకోగా.. తనకి బాల్ ఇవ్వమంటూ అడుగుతుంది. ఈ బాల్ తీసుకెళ్లి అయేషా సుమన్​ శెట్టికి ఇస్తుంది. సుమన్ ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరిని అయేషా నామినేట్ చేయాలి. 



ముందే ప్లాన్ వేసుకుందా?


అయేషా బాలు ఇవ్వగా.. సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేశాడు. మీరు ఎవరైనా గొడవపడుతుంటే చాలా సంతోషపడిపోతున్నారని.. అది తనకి నచ్చట్లేదని నామినేట్ చేశాడు. సంజనను ఇమిటేట్ చేసే సమయంలో ఇంట్లోని సభ్యులు అంతా నవ్వారు. మీరు ఇలా చేస్తే నాకు నవ్వు వస్తుందని సంజనా చెప్పినా.. సీరియస్​గానే నామినేట్ చేస్తున్నాను అంటాడు. అలాగే తనూజను కూడా సుమన్ శెట్టి నామినేట్ చేస్తాడు. నువ్వు చాలా ఎమోషనల్ అంటూ నామినేట్ చేయగా.. వావ్ సుమన్ అన్నా.. మీ ట్రూ కలర్స్ ఇక్కడ తెలుస్తున్నాయని చెప్తాడు. ఇప్పుడు అసలైన టర్న్ అయేషాది. 


అయేషా సంజన, తనూజలో.. తనూజను నామినేట్ చేస్తుంది. నీ ఫేవరిజం వల్ల ఈ హౌజ్​లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని చెప్తుంది. భరణి గారి గేమ్ నీవల్ల పాడైపోతుందని అంటుంది. ఆల్రేడి స్టార్​ మాలో చాలా మంచి సీరియల్స్ వస్తున్నాయి.. ఇక్కడ మరో సీరియల్ వద్దు అంటూ చెప్తోంది అయేషా. ప్రతిసారి భరణి సార్ వచ్చి నాకు సపోర్ట్ చేశారా అంటూ తనూజ అడగ్గా.. నీకు ఏ ప్రాబ్లమ్ అయినా నాన్న ఎందుకు అవసరం వస్తున్నారు నీకు అంటూ నిలదీస్తుంది. ఇక్కడ ఓ బాయ్ ఫ్రెండో, నాన్నో ఉంటే సీజన్ పూర్తి చేసేయవచ్చు అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి అంటూ ఫైర్ అయింది అయేషా. దీంతో ప్రోమో ముగిసింది.