Bigg Boss Telugu 9 Promo Review Wild Card Entries: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమై దాదాపు నెల రోజులకు పైగా గడిచింది. హౌస్‌లో కొత్త కొత్త టాస్కులు, ఛాలెంజెస్, గేమ్స్‌తో ప్రతీ వారం హీట్ పెంచేస్తున్నారు బిగ్ బాస్. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చాప్టర్ మొదలు కానుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా వైల్డ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ కానుండగా వారు ఎవరు అనేది? అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Continues below advertisement

హౌస్‌లోకి దివ్వెల మాధురి

చాలా రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈసారి దివ్వెల మాధురి, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్, అలేఖ్ చిట్టి పికెల్స్‌తో ఫేమస్ అయిన ఒక సిస్టర్ రమ్య మోక్ష హౌస్‌లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా దివ్వెల మాధురి, రమ్య మోక్ష ఎంటర్ అవుతారనే టాక్ వినిపించగా ఇది నిజమైంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ నెలకొనగా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌తోనే ఆ ప్రాసెస్ నిర్వహించారు బిగ్ బాస్.

Continues below advertisement

ఎలిమినేషన్ ట్విస్ట్

ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్న రీతూ, డీమాన్ పవన్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజలకు... 'స్టిక్ ఇట్ టూ విన్ ఇట్' టాస్క్ ఇచ్చారు హౌస్ట్ నాగార్జున. ఈ టాస్కులను రమ్య మోక్ష, దివ్వెర మాధురి ఆర్గనైజ్ చేశారు. ఇక రెండో టాస్కుకు వచ్చేటప్పటికి రీతూ, సంజన సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా సుమన్ శెట్టి, శ్రీజ, డీమాన్ పవన్ మళ్లీ ఆట ఆడారు. వారికి ఇచ్చిన 4 వస్తువులను ఉపయోగించి తమకు ఇచ్చిన బీకరులో ఎవరైతే ఎక్కువ స్థాయిలో ఉండేలా చూసుకుంటారో వారే విన్ అన్నట్లు టాస్క్ ఇచ్చారు.

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో కొత్త చాప్టర్ - ఈ వారం డబుల్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?... వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో శ్రీజకు షాక్!

శ్రీజ ఎలిమినేట్?

అన్నీ టాస్కులు ఆడి డేంజర్ జోన్‌లో సుమన్ శెట్టి, శ్రీజ మిగిలారు. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటెస్టెంట్స్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారంటూ నాగ్ అనౌన్స్ చేశారు. ఇద్దరి కంటెస్టెంట్స్‌‌కు బెలూన్స్ కట్టగా... తమకు నచ్చని వారి బెలూన్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంటెస్టెంట్స్ కట్ చేయాలి. ఇందులో శ్రీజ బెలూన్‌ను దివ్వెల మాధురి కట్ చేసినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యే సూచనలు కనిపిస్తుండగా హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతకు ముందు నార్మల్ ఎలిమినేషన్‌లో ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ హౌస్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంతో మొత్తం ఆరుగురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు.

'ప్రదీప్' వెరీ డేంజర్

బిగ్ బాస్ స్టేజ్‌పై 'డ్యూడ్' మూవీ టీం ప్రదీప్ రంగనాథ్, 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు సందడి చేశారు. డ్యాన్స్ చేస్తూ జోష్ పెంచారు. ఈ సందర్భంగా... 'ప్రదీప్ చాలా డేంజరస్' అంటూ మమిత ఫన్ చేయగా... 'నేనేం చేశాను?' అంటూ క్వశ్చన్ చేయగా నవ్వులు పూశాయి. ఇక నాగ్... తమిళ, కన్నడ, మలయాళ బిగ్ బాస్ హోస్ట్‌లతోనూ ముచ్చటించారు. మొత్తానికి ఈ వారం ఫన్, సీరియస్, హీట్ అన్నీ కలిపి బిగ్ బాస్ రణరంగమే అన్నట్లుగా ఉంది.