Bigg Boss Telugu 9 Latest Sunday Funday Promo : బిగ్​బాస్​ సీజన్ 9లో సన్​ఫన్​ డే ఎపిసోడ్ మొదలైంది. దానికి సంబంధించిన ప్రోమోలు స్టార్ మా విడుదల చేసింది. నిన్న అంతా హీట్​గా, హాట్​గా ఉన్న హోజ్.. ఇప్పుడు ఫన్​తో నిండిపోయింది. కంటెస్టెంట్లకు వివిధ టాస్కులు పెట్టి నాగార్జున ఫన్ క్రియేట్ చేశారు. అటు కంటెస్టెంట్లతో పాటు.. నాగ్​ కూడా బాగా ఎంజాయ్ చేశారు. దీనిలో భాగంగా నడుము గిల్లడం నుంచి.. ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయాలనే టాస్కులతో ఈ సన్​డేని ఫన్​డే మార్చేశారు. మరి ప్రోమోల్లో ఏమున్నాయో చూసేద్దాం. 

Continues below advertisement


బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. 


గోల్డెన్ స్టార్ ఇమ్మాన్యుయేల్ అని పిలిచిన నాగ్.. మొన్న టాస్కుల్లో నీ నడుము ఎవరో గిల్లారు కదా అంటూ స్టార్ట్ చేశారు. దానికి ఇమ్మూ అవును సార్. ఇంత లావు వాచిపోయిందంటూ ఫన్నీగా కంప్లైంయింట్ ఇచ్చాడు. ఇంతకీ నీ నడుము గిల్లింది ఎవరు అంటూ.. ఇప్పటికైనా తెలిసిందా.. అంటే నాకు ఒకరిపై డౌట్ ఉందిసార్ అనిచెప్పాడు. ఎవరు అని అడగ్గా తనూజా సార్ అని చెప్పాడు. దీంతో నాగ్ తనూజ నిజమేనా? అంటే అవును సార్ అని చెప్తుంది. అలాగే ఇమ్మూ నిన్ను బ్రేక్​లో ఎవరో పిల్లోతో కొట్టారు అంటే.. తనూజానే సార్.. ఏమి చేసినా కొడుతుంది.. ఏమి చేయకున్నా కొడుతుంది సార్ అంటూ కామెడి చేశాడు ఇమ్మూ. 



ట్రయాంగిల్ లవ్ స్టోరీ..


పవన్, కళ్యాణ్​ని పిలిచి.. రెండు ఫోటోలు ఇచ్చి వాటిలో డిఫరెన్స్ ఏంటో కనుక్కోమని చెప్పాడు. దీంతో పవన్ కంగారుగా 4 గుర్తించి.. 5 అయిపోయాయి సార్ అని చెప్పాడు. కానీ కళ్యాణ్ కూడా 4 గుర్తించి.. నాగ్ అడగ్గా 5వది కూడా గుర్తించాడు. దీంతో నాగ్.. వారిద్దరి ఆలోచన ఒకేలా ఉందంటూ.. ఒకేలా ఉంటారు కాబట్టే రీతూని చూస్తున్నట్లు ట్రయాంగిల్ లవ్ స్టోరి గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. దీంతో మొదటి ప్రోమో ముగిసింది.


బిగ్​బాస్ సన్​డే, ఫన్​డే ప్రోమో..


రెండో ప్రోమోలో నాగ్ అందరినీ ఇతరుల్లోని నెగిటివ్ లక్షణాల గురించి చెప్పమన్నారు. దీనిలో భాగంగా సుమన్ శెట్టి, రాముని ఎంచుకున్నారు. సుమన్ శెట్టి భరణిని ఉద్దేశిస్తూ.. సేఫ్​గా ఆడుతున్నారని అనిపిస్తుంది సార్.. అదే నెగిటివ్ లక్షణం అంటూ చెప్పారు. దీంతో నాగ్ సేఫ్​గా ఆడడం అనిపించడమేంటి.. సేఫ్​గానే ఆడుతున్నారంటూ చెప్పాడు. రీతూ నాతో ఎక్కువగా ఉండేది. అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేది కానీ ఇప్పుడు తగ్గించేసింది అంటే.. ఈ అన్నయ్యే నన్ను రీజన్ లేకుండా నామినేట్ చేశాడు సార్ అంటూ రిప్లై ఇచ్చింది. రాము శ్రీజని ఉద్దేశిస్తూ.. ఏదైనా పాయింట్​ని ఎక్కువగా ప్రోలాంగ్ చేస్తుందని చెప్పాడు. సంజనను ఉద్దేశిస్తూ.. ఎవరైనా ఏదైనా చెప్తే వినదు. గుడ్లు విషయంలో కూడా హర్ట్ అయ్యాయని చెప్పాడు రామ్. తనూజ ఊరికే ఏడుస్తుందని సుమన్ శెట్టి చెప్పాడు. 



నెక్ట్స్ టాస్క్​లో శ్రీజ, దివ్య మధ్య అని పిలవగా వారు ఇద్దరూ గార్డెన్​లోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. నేను పిలిస్తే గార్డెన్​లోకి రమ్మని అర్థమా అంటూ నాగ్ నవ్వేశారు. అలాగే వారిద్దరూ వేరే కంటెస్టెంట్ల నేమ్స్ మెడలో వేసుకుని.. వారిని ఇమిటేట్ చేయాలని అంటాడు. దీనిలో భాగంగా దివ్య రీతూ క్యారెక్టర్ చేయగా.. శ్రీజ పవన్ క్యారెక్ట్ రీక్రియేట్ చేస్తారు. దీంతో ప్రోమో ముగిసింది. పూర్తి ఫన్​కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సింది.