Bigg Boss Telugu 9 Day 2 Promo 2 and 3 Updates : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో మొదలైంది కానీ.. కంటెస్టెంట్లు దానికి తగ్గట్లు బిహేవ్ చేయట్లేదు. అందరూ ఏదొక రకంగా కంటెంట్ ఇచ్చేందుకే ట్రై చేస్తున్నారనే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకరు బూతులు మాట్లాడుతూ.. మరికొందరు ఏడుస్తూ.. కంటెంట్ ఇస్తుంటే ఓ వ్యక్తి మాత్రం ఇవేమి పట్టనట్టు కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఆఖరికి నామినేషన్స్‌లో కూడా అతను మాట్లాడట్లేదు. ఇంతకీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఏమి జరిగిందో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ 9 డే 2లో భాగాంగా స్టార్ మా మూడు ప్రోమోలు రిలీజ్ చేసింది. మొదటి ప్రోమోలు బూతుల పురాణం ఉండగా.. రెండో ప్రోమోలో ఏడ్పులు.. మూడో ప్రోమోలో నామినేషన్స్ చూపించారు. ప్రియా సంజనా విషయంలో బూతు ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే మరో ప్రోమోలో కంటెస్టెంట్లు ఏడ్వడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు వివిధ కారణాలతో ఏడ్చేశారు. ఇది సింపతీ కోసమో.. లేక కంటెంట్ కోసమో చూడాల్సి ఉంది.
మొదలైన ఏడ్పులు
శృష్టి, రాము రాథోడ్‌తో ఫుడ్ విషయంలో ప్రియ, శ్రీజ మధ్య డిస్కషన్ జరిగింది. ఆ సమయంలో ప్రియ హర్ట్ అయి.. నేను కూడా మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఎలా మాట్లాడాలో నాకు అర్థమవుతుందంటూ ఏడ్చేసింది. తర్వాత కిచెన్‌లో హరీశ్ విషయంలో తనూజ ఏడ్చింది. తర్వాత సంజన, ఫ్లోరా సైనీకి మధ్య డిస్కషన్ జరిగింది. వాష్‌రూమ్‌లో మీకు సంబంధించిన షాంపూ కిట్ ఉండిపోయిందని చెప్పగా.. సంజనా అక్కడే ఉండనివ్వు ఉంటూ రూడ్‌గా చెప్పింది. నేను మీకు సర్వెంట్‌ని కాదంటూ ఫ్లోరా చెప్పగా డిస్కషన్ పెరిగింది.
ఫ్లోరా సైనీ బయటకు వచ్చి ఏడ్చేసింది. రీతూ, మిలటరీ కళ్యాణ్ ఆమెను ఓదార్చారు. స్నానం రూమ్‌లో స్నానం సామాను పెట్టలేదంటే తలమీద పెట్టుకోవాలా అంటూ సంజనా రియాక్ట్ అయింది. దీంతో కళ్యాణ్ మీరు వాష్‌రూమ్‌లో అవి తీసేయండి ఇన్‌ఛార్జ్‌గా చెప్తున్నాను అంటే.. ఈమె చేసిన పని వల్ల నేను మొత్తం ఆడవారిని వాష్‌రూమ్‌కి అలౌవ్ చేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
నామినేషన్ ప్రక్రియ..
ఇక ఈవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్న చూపించింది టీజరేనని.. మొత్తం సినిమా ఇప్పుడు మొదలవుతుందన్నాడు బిగ్‌బాస్. ఈ ప్రక్రియలో చాలామంది సంజనను ఎన్నుకోగా.. మరికొందరు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. ఎవరికీ సరైన రీజన్ లేక వారిద్దరినీ టార్గెట్ చేస్తున్నట్లు క్లియర్‌గా ఉంది. దానికి తగ్గట్లుగానే సంజనా రూడ్గానే మాట్లాడారు. సుమన్ శెట్టి అయితే అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్కి వెళ్లడం కష్టమే కావొచ్చు.