Bigg Boss Telugu 9 Recnet Promo : బిగ్​బాస్​లో రెండో వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. నిన్నటివరకు ఏడుస్తూ.. సీరియస్​గా ఉన్న కంటెస్టెంట్ల మొహాల్లో కాస్త నవ్వు కనిపించింది. దానికి పూర్తి క్రెడిట్ ఎంటర్​టైనర్ ఇమ్మూకే ఇవ్వొచ్చు. వీకెండ్ ఎపిసోడ్​లో కూడా ఇమ్మాన్యూయేల్​ కామెడీకి మంచి మార్కులే పడ్డాయి. అతని జోక్స్​ని నాగ్​ సైతం ఎంజాయ్ చేశాడు. అలాగే అతను మాటల్లో ఎలాంటి తప్పులు లేవని కూడా నిరూపించారు. అది ఇమ్మూకి అడ్వాంటేజ్​గా మారాయి. దాంతో అతను ఇంట్లో మరింత ఎంటర్​టైన్మెంట్ అందిస్తున్నాడు. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముందంటే.. 

బిగ్​బాస్ సీజన్ 9 తెలుగు డే 10కి చెందిన మొదటి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. దీంట్లో కంటెస్టెంట్లు.. ముఖ్యంగా సెలబ్రెటీలు మస్తు నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం ఇమ్మాన్యూయేల్. అతనికి తనూజ సపోర్ట్ ఇస్తూ చేస్తోన్న కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్వుకునేలా చేసింది. ప్రోమోలో.. సంజనా ఇమ్మూని ఉద్దేశిస్తూ.. ఫ్రిడ్జ్​లో ఇంకా థంబ్స్​ అప్, ఫిజ్ ఉన్నాయి. నువ్వు ఏమైనా చేసి దక్కించుకో అని చెప్తుంది. దీంతో ఇమ్మూ తనదైన శైలిలో ఎంటర్​టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. 

Continues below advertisement

ఇమ్మూ.. తనూజ.. గర్ల్​ఫ్రెండ్, బాయ్​ ఫ్రెండ్

తనూజ అబ్బాయిగా.. ఇమ్మూ అమ్మాయిగా స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు. దూరంగా ఉండే ఇద్దరు ప్రేమికుల ఫీలింగ్స్​ని ఫన్నీగా చేశాడు ఇమ్మూ. తనూజ్ ఫోన్ చేయగానే ముద్దుల వర్షం కురిపించేస్తాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేస్తుంది. మరోసారి ఫోన్ చేయగా కూడా ఇమ్మూ మళ్లీ ముద్దులు ఇచ్చేస్తాడు. దీంతో నేను చేయను నీకు కాల్ అంటే.. నేను నిన్న మిస్​ అవుతున్నాను అంటూ ఇమ్మూ చెప్పుకొస్తాడు. మరోసారి తనూజ కాల్ చేయగా.. ఏమి చేస్తున్నావే అంటే.. ఏమి చేయట్లేదు రమేశ్ అంటూ రిప్లై ఇస్తాడు ఇమ్మూ. హా అంటే.. అయ్యో నువ్వు రమేశ్ కాదా అని ఫోన్ పెట్టేస్తాడు. దీంతో అందరూ తెగ నవ్వేస్తారు. దీంతో ప్రోమో కూడా ఎండ్ అయింది. 

అయితే నామినేషన్​లో సీరియస్​గా ఉండేవారి మొహాలు చూసి రిలీఫ్ దొరికిందని ఈ ప్రోమో కింద ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఎంటర్​టైన్​మెంట్ కావాలని.. ఆ కామనర్స్ వద్దని పెడుతున్నారు. అయితే లైవ్​లో కామనర్స్​ కూడా ఇమ్మూ కామెడీని ఎంజాయ్ చేస్తుండగా.. హరీశ్ మాత్రం పక్కకెళ్లి కూర్చొంటాడు. బిగ్​బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చేవరకు ఇంట్లో ఇమ్మూ కాస్త రిలీఫ్ ఇస్తోంది. బిగ్​బాస్ ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్లు కూడా ఆయన కామెడీని మెచ్చుకుంటున్నారు.