Mouneesha Chowdary: సోషల్ మీడియాలో 'స్నో అక్క' గా పాపులర్ అయిన మౌనీషా చౌదరి.. పేరు ఈసారి బిగ్ బాస్ 10 తెలుగు ప్రొబబుల్స్ లిస్ట్‌లో వినిపిస్తుంది. ఆమె రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
రియల్ లైఫ్
మౌనీషా చౌదరి హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. పెళ్లి తర్వాత అమెరికాలోని ఉటా ప్రాంతంలో స్థిరపడింది. ఈమె ఐటీ జాబ్ చేస్తూ.. మోడలింగ్, యాక్టింగ్, బిజినెస్, కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తుంది.
కెరీర్
దాదాపు 8 ఏళ్లకు పైగా అమెరికన్ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేసింది మౌనీషా. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయడమే కాకుండా, విదేశాల్లో బిల్‌బోర్డ్స్‌పై కూడా కనిపించింది. 2016లో 'మిస్ ఉటా' కిరీటాన్ని గెలుచుకుంది. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో ఎదురైన హరాస్‌మెంట్స్, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు, బాడీ షేమింగ్ సవాళ్లపై బహిరంగంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది. Also Read: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
సోషల్ మీడియా
అమెరికాలోని మంచు కురిసే వీధుల్లో ఉంటూ తనదైన హ్యూమర్‌తో రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది మౌనీషా. డల్లాస్‌పురం యూత్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి అభిమానుల నుండి 'స్నో అక్క' అనే పేరు సంపాదించుకుంది. క్యాన్సర్ అవగాహన, మానసిక ఆరోగ్యం, ప్రసవానంతర సవాళ్లపై సోషల్ మీడియా వేదికగా అవగాహన కల్పిస్తుంటుంది మౌనీషా.
Also Read: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
ఆసక్తికర విషయాలు
మౌనీషాకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, అలాగే నటి శ్రీలీలతో ఉన్న పోలికల గురించి సరదాగా మాట్లాడుతుంటుంది. ఆన్‌లైన్ ట్రోల్స్, నెగెటివిటీని ఏమాత్రం లెక్కచేయకుండా స్ట్రెయిట్‌ఫార్వర్డ్‌గా సమాధానాలు చెప్పడం ఈమె స్పెషల్.
బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ వివరాలు
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలలో తన బిగ్ బాస్ తెలుగు ఎంట్రీపై హింట్ ఇచ్చింది మౌనీషా. బిగ్ బాస్ నుంచి పిలుపు వస్తే హౌస్‌లోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నానని స్పష్టం చేయడంతో, ఆమె అభిమానులు, నెటిజన్లు ఆమె బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
