Aman Masud: అమన్ మసూద్.. బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ల లిస్టుల్లో ఒకరు.  అగ్నిపరీక్ష టాస్క్‌ల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు. మెయిన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ లిస్టులో  అమన్ మసూద్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. అతడి రియల్ లైఫ్, కెరీర్, ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

Continues below advertisement

రియల్ లైఫ్ & కెరీర్

అమన్ మసూద్ మోడలింగ్, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా కెరీర్ ప్రారంభించి, సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోడలింగ్ రంగుల ప్రపంచం నుంచి చిన్నగా నటన వైపు అడుగులు వేసి ఫ్యాషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ ద్వారా డిజిటల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. పలు డిజిటల్ షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు, ఆన్‌లైన్ సిరీస్‌లలో నటించాడు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

సోషల్ మీడియా

అమన్ మసూద్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫిట్‌నెస్ వీడియోలు, ఫ్యాషన్ షూట్స్,  డే-టు-డే అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుంటాడు. యూత్ నుంచి మంచి సోషల్ మీడియా సపోర్ట్ అందుకోవడమే కాకుండా 'అగ్నిపరీక్ష 2' లో అడుగుపెట్టిన తర్వాత ఇతని ఫాలోయింగ్ మరింత పెరిగింది.

Continues below advertisement

బిగ్ బాస్ 10 తెలుగు  

బిగ్ బాస్ 10 తెలుగులో కామనర్.. డిజిటల్ కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకోవడానికి ప్రారంభమైన 'అగ్నిపరీక్ష 2' షోలో పాల్గొని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగాడు. తన టాలెంట్, ఎనర్జీ ఆధారంగా 'అగ్నిపరీక్ష 2' ఫినాలే ఓటింగ్ ట్రెండ్స్‌లో రోహిత్ నాయుడు, ఆర్జే చరణ్‌లతో పాటు టాప్ 3 రేసులో నిలిచాడు. Also read: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష కంటెస్టెంట్ ఆర్జే చరణ్ మహదేవ్.. రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ వరకు!

అగ్నిపరీక్ష పర్ఫార్మెన్స్

అగ్నిపరీక్ష షోలో ఇచ్చిన ప్రతి ఫిజికల్ టాస్క్‌ను ఎంతో పట్టుదలతో ఆడుతూ జడ్జీల దృష్టిని ఆకర్షించారు అమన్. మ్యూజికల్ చైర్స్ వంటి ఫిజికల్ అండ్ మైండ్ గేమ్స్‌లో ఆల్ అవుట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గేమ్‌లో భాగంగా సంచాలక్‌తో జరిగిన చిన్న చిన్న వాగ్వాదాలు అగ్నిపరీక్ష షోలో పెద్ద చర్చగా మారాయి. ఇవన్నీ తనను సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిపాయి.  Also read: బిగ్ బాస్ సీజన్ 10 లాంచింగ్ డేట్ - హౌస్‌లో కంటెస్టెంట్స్ ఎవరంటే?

ఆసక్తికర విషయాలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 స్టార్టింగ్ నుంచి ఊహించని రేంజ్ ఓటింగ్ సపోర్ట్‌ను దక్కించుకున్న కంటెస్టెంట్లలో ఒకరు అమన్.  తన అగ్రెసివ్ గేమ్‌ప్లే, కాన్ఫిడెన్స్ వల్ల జడ్జీలు, ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించి బిగ్ బాస్ మెయిన్ హౌస్‌లోకి వెళ్లేందుకు బలమైన పోటీదారుగా నిలిచాడు. 

Also read: ఇంజినీరింగ్ నుంచి బుల్లితెర క్రేజ్ వరకు.. సౌందర్య రెడ్డి రియల్ లైఫ్, బిగ్ బాస్ తెలుగు ఎంట్రీ విశేషాలు!