'బిగ్ బాస్' ఈ షో ఏ భాషలో అయినా అందరిని ఆకట్టుకుంటుంది. తమిళనాట కూడా బిగ్ బాస్ షో మొదలైంది. నటుడు కమల్ హాసన్ ఈ బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షో రసవత్తరంగా సాగుతోంది. ఈ షో నుంచి మొదట ఎలిమినేట్ అయిన శాంతి గత ఆదివారం నుంచి వెళ్లిపోయింది. అలాగే జీపీ ముత్తు కూడా వ్యక్తిగత కారణాల వలన తప్పుకోవడంతో ఇప్పుడు 19 మంది కంటెస్టెంట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇచ్చిన బొమ్మ టాస్క్ బిగ్ బాస్ షో లో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 


ఇప్పటికే రెండు వారాలు పూర్తయిన బిగ్ బాస్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ బిగ్ బాస్ సీజన్ 6 మూడో వారంలో పోటీ అభిమానుల ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. విజయ్ టీవీలో బిగ్ బాస్ సీజన్ 6 అక్టోబర్ 9న ప్రారంభమైంది. ఈ సీజన్‌లో జీపీ ముత్తు, రాబర్ట్ మాస్టర్, రచిత, విక్రమన్, అయేషా, అముదావనన్, గాయని ఏటీకే, మైనా నందిని, జనని, అషిమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.  అయితే అజీమ్, అయేషా మధ్య జరిగిన పోరు రెండవ వారంలో అలజడి సృష్టించింది. అక్కడ పోటీదారులు స్టాండింగ్‌లలో తమను తాము ర్యాంక్ చేసుకున్నారు. అజీమ్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ కమల్ షో లో అందరికి క్షమాపణలు చెప్పాడు అజీమ్.


ఈ నేపథ్యంలో మూడవ వారం ప్రారంభంలో, పోటీదారులకు బొమ్మ టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ గేమ్‌లో కొంతమంది పోటీదారులు మినహా మిగతా అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు.  అజీమ్, అయేషా, మహేశ్వరి, అసల్, సెరెనా, నివా తదితరులు ఒక టీమ్‌గా ఏర్పడగా, జనని, ధనలక్ష్మి, అముదావనన్, రాబర్ట్ మాస్టర్, రచిత ఒక టీమ్‌గా ఏర్పడి ఈ గేమ్ కు రెడీ అయ్యారు. ఆ తరువాత జరిగిన గేమ్ లో అజీమ్, సెరెనా, అయేషా టీమ్ బొమ్మ రూమ్ వైపు పరుగున వచ్చింది, అదే సమయంలో  థనలక్ష్మి టీమ్ వారిని అడ్డుకుంది. అప్పుడు ఊహించని విధంగా సెరెనా, నివా కింద పడిపోయారు వారికి స్వల్ప గాయాలయ్యాయి కూడా.


దీంతో అజీమ్, ధనలక్ష్మి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్లీ బొమ్మల పోటీ కొనసాగనుంది. అందుకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది బిగ్ బాస్. ప్రోమోలో అజీమ్ కు అడ్డుగా నిలబడిన ధనలక్ష్మి ను తోసేసిన దృశ్యాలు ప్రోమో లో కనిపిస్తున్నాయి.  దీనిపై ధనలక్ష్మి అజీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. "అతను నన్ను ఎక్కడ తాకాడో తెలుసా, అతన్ని నేను వెళ్ళనివ్వను" అని ధనలక్ష్మి అరుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విక్రమ్ ధనలక్ష్మి కు సపోర్ట్ గా అజీమ్ తో వాదిస్తున్నట్లు దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తానికి ఈ వారం బొమ్మ టాస్క్ ప్రేక్షకులకు మంచి కిక్ నే ఇచ్చేలా ఉంది. దీంతో ఈ ప్రోమో పై అభిమానులు విభిన్నంగా స్పందిస్తూ పూర్తి షో కోసం ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఫాలోవర్స్.


Also Read: ఎట్టకేలకు శ్రీహాన్ కెప్టెన్? గీతూ అనుకున్నట్టే అయింది అంతా, ఇక బిగ్‌బాస్ ఎందుకు?