‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఒక్కొక్క ఎపిసోడ్.. ఒక్కొక్క విధంగా సాగుతోంది. అరె.. ఈ ఎపిసోడ్ చాలా బోరింగ్‌గా గడిచిందే అనుకునేలోపే.. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి దానిని ఎంటర్‌టైనింగ్‌గా చేస్తున్నాడు ‘బిగ్ బాస్’. వీకెండ్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుతూ, మనస్పర్థలు తొలగిపోయినట్టుగా ప్రవర్తించారు. దీంతో అసలు ఎపిసోడ్స్‌లో మజా లేదు అనుకున్నారు ప్రేక్షకులు. ఇంతలోనే నామినేషన్స్ ద్వారా ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్‌కు కావాల్సినంత స్టఫ్ దొరికింది. ఇక గతవారం నామినేషన్స్‌తో పోలిస్తే.. ఈవారం నామినేషన్స్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ కొత్తగా యాడ్ అయ్యారు.
శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌తో మజా..
మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రారంభమయ్యింది. ఇప్పటికే ఈ షో ప్రారంభమయ్యి వారం రోజులు అవుతుండడంతో మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ‘బిగ్ బాస్’ సీజన్ 7లోని మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌కు అసలు తెలుగు రాదు అనే కారణంతో చాలామంది కంటెస్టెంట్స్ తనను నామినేట్ చేశారు. ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కూడా కిరణ్ కాస్త వెనుకబడి ఉండడంతో.. ప్రేక్షకులు తనను బయటికి పంపించేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ చాలా హీట్‌గా సాగాయి. సోమవారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కేవలం సగం వరకు నామినేషన్స్ మాత్రమే చూపించింది ‘బిగ్ బాస్’ టీమ్. ఆ ఎపిసోడ్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. చాలా రసవత్తరంగా సాగాయి.
శోభా, శివాజీ మాటల యుద్ధం..
మిగతా నామినేషన్స్ నేడు (సెప్టెంబర్ 12న) ప్రసారం కానున్నాయి. ఈ ఎపిసోడ్‌లో శోభా శెట్టిని శివాజీ నామినేట్ చేయగా.. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా ప్రోమోలో చూపించారు. ఇక రతికను గౌతమ్ కృష్ణ నామినేట్ చేసిన సమయంలో వారిద్దరి మధ్య కూడా వాగ్వాదం జరిగింది. గొడవలకు దూరంగా ఉండే గౌతమ్ కృష్ణ.. మొదటిసారి రతికపై గొంతెత్తాడు. ఇక శోభా శెట్టి.. శివాజీని నామినేట్ చేసినందుకు శివాజీ కూడా శోభాను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. కానీ ఇదే విషయంపై వీరిద్దరి మధ్య చాలాసేపు మాటల యుద్దం జరిగినట్టు తెలుస్తోంది. గతవారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా ఈవారం మరో ముగ్గురు కొత్తగా యాడ్ అయ్యారు.
కొత్తగా నామినేషన్స్‌లో ఉన్నది వీరే..
శివాజీ, అమర్‌దీప్, టేస్టీ తేజ.. ఈ ముగ్గురు గతవారం నామినేషన్స్‌లో లేరు. కానీ ఈవారం ఉన్నారు. శివాజీపై ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్‌లో నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆయన కొంతమందినే సపోర్ట్ చేస్తున్నారని, ఫన్ కోసం ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కారణాలతో పలువురు కంటెస్టెంట్స్ ఆయనను నామినేట్ చేశారు. ఇక టేస్టీ తేజ ఫన్‌ను ఇన్నాళ్లు ఎంజాయ్ చేసిన కంటెస్టెంట్స్.. తనపై కూడా నెగిటివ్‌గా మారారు. ముఖ్యంగా పలువురు లేడీ కంటెస్టెంట్స్‌తో తేజకు మనస్ఫర్థలు ఎక్కువయిపోయాయి. అమర్‌దీప్ కూడా ఆట సరిగా ఆడడం లేదంటూ కొందరు కంటెస్టెంట్స్ తనను నామినేట్ చేశారు. మరి ఈ వారం ‘బిగ్ బాస్’ హౌజ్‌ను వదిలి వెళ్లే పరిస్థితి ఏ కంటెస్టెంట్‌కు వస్తుందో చూడాలి.
Also Read: గట్టి ఫిట్టింగే పెట్టావ్ ‘‘బిగ్ బాస్’’ - మాయాస్త్రం కోసం యుద్ధం, ఒకే జట్టులో శివాజీ, అమర్‌దీప్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial