‘బిగ్ బాస్’ సీజన్ 7లో రచ్చ మొదలయ్యింది. అప్పటివరకు కంటెస్టెంట్స్ అంతా ఎంత అన్యూయంగా ఉన్నా.. వారు కచ్చితంగా గొడవపడే సందర్భం.. నామినేషన్స్. ‘బిగ్ బాస్’ అనే రియాలిటీ షో ముందుకు కొనసాగుతూ.. ఒకరు విన్నర్‌గా నిలవాలంటే.. కచ్చితంగా ప్రతీవారం ఒకరు బయటికి వెళ్లిపోవాల్సిందే. అందుకే ఇతర కంటెస్టెంట్స్ హౌజ్‌లో నుంచి ఎవరిని బయటికి పంపాలని అనుకుంటున్నారో వారి పేరును నామినేట్ చేస్తారు. అది కచ్చితంగా నామినేట్ అయిన వ్యక్తికి నచ్చదు.. అలా గొడవలు మొదలవుతాయి. నిన్న కాక మొన్న ప్రారంభమయిన ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కూడా నామినేషన్స్ వల్లే హౌజ్‌లో వాతావరణం అంతా మారిపోయింది. తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తుంటే ఆ గొడవలు ఏ రేంజ్‌కు వెళ్లనున్నాయో అర్థమవుతోంది.


నామినేషన్స్ కంటిన్యూ..
‘బిగ్ బాస్’ సీజన్ 7లో మొదటి నామినేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న (సెప్టెంబర్ 4న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో శివాజీ, ప్రియాంక జైన్.. తమ తమ నామినేషన్స్ గురించి చెప్పారు. దాని ద్వారా నామినేట్ చేసిన కంటెస్టెంట్స్‌కు, నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయి. ఇక మిగతా నామినేషన్స్ అన్నీ ఈరోజు ఎపిసోడ్‌లో ప్రసారం కానున్నాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ముందుగా శోభా శెట్టి.. కిరణ్ రాథోడ్‌ను నామినేట్ చేయడంతో ప్రోమో మొదలయ్యింది. భాషకు సంబంధించి కిరణ్ రాథోడ్‌కు ఇబ్బందులు ఉన్నాయని నామినేట్ చేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది శోభా. తనతో పాటు గౌతమ్ కృష్ణను కూడా నామినేట్ చేసింది.


దామిని, శోభా శెట్టి మాటల యుద్ధం..
శోభా శెట్టి తర్వాత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయడానికి వచ్చింది దామిని భట్ల. హౌజ్‌లో ఉన్న 14 మందిలో తను చివరిస్థానంలో శోభా శెట్టి ఉంటుందని భావిస్తున్నానని చెప్తూ శోభాను నామినేట్ చేసింది దామిని. ఆ తర్వాత యావర్.. నువ్వు కింగా అంటూ ప్రశ్నించిన టోన్ నాకు నచ్చలేదు అంటూ ఒకరిని నామినేట్ చేశాడు. కానీ ఆ నామినేట్ చేసింది ఎవరినో ప్రోమోలో చూపించలేదు. ఆ తర్వాత షకీలా వచ్చి నేను ఊరికే మీ డాడీ కింగా అని అడిగాను అంటూ యావర్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ యావర్‌ను నామినేట్ చేసింది. 


గొడవకు రెడీ అంటున్న శోభా శెట్టి..
దామిని చేతిలో నామినేట్ అయిన శోభా శెట్టి.. వెళ్లి తనతో వాగ్వాదానికి దిగింది. నామినేషన్స్ అనేవి హౌజ్ నుంచి బయటికి పంపే ప్రక్రియ అని, దానికి అలాంటి కారణం చెప్పడం తనకు నచ్చలేదని వాదించింది శోభా. నేను తప్పు అయ్యిండొచ్చు అని దామిని చెప్తుండగానే.. తప్పే అంటూ మధ్యలో అరిచింది. ఇక ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ అందరూ వేర్వేరు వాతావరణాల నుంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి.. చిన్న చిన్న విషయాలలో వారికి గొడవలు మొదలయ్యాయి. సందీప్ - రతిక, దామిని - శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ - శోభా శెట్టి మధ్య జరిగిన వాగ్వాదాలతో ‘బిగ్ బాస్’ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమో నిండిపోయింది. ముఖ్యంగా శోభా శెట్టి ఎవరితో పెద్దగా కలవకుండా అందరితో గొడవపడే మనస్థత్వం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుందని ప్రోమో చూసి ప్రేక్షకులు డిసైడ్ చేస్తున్నారు.



Also Read: షకీలాకు ఇది రెండో ‘‘బిగ్ బాస్’’ - ఆ షోలో ఎన్ని రోజులు హౌస్‌లో ఉందా తెలుసా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial