బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రా సాధించుకున్న వారు మాత్రమే కంటెస్టెంట్స్‌గా ఫిక్స్ అవుతారు అని బిగ్ బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  అప్పటి నుంచి పవర్ అస్త్రా కోసం పోటీ ఎక్కవయ్యింది. ఇప్పటికే పవర్ అస్త్రా సాధించుకున్న వారిపై ఫోకస్ కూడా ఎక్కువయ్యింది. అయితే, అమర్ దీప్ చేసిన పనికి టేస్టీ తేజ.. అనుకోకుండా శివాజీకి టార్గెట్ అయ్యాడు.


పవర్ అస్త్రా చోరీ


బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో మొదటి వారంలో పవర్ అస్త్రాను సందీప్ సంపాదించుకోగా.. రెండో వారంలో శివాజీ సాధించుకున్నాడు. శివాజీ పవర్ అస్త్రాను దొంగతనం చేస్తే.. తన పవర్ తగ్గిపోతుంది అని భావించిన అమర్‌దీప్.. దానిని దొంగిలించాడు. అసలు ఈ పని ఎవరు చేశారో ఐడియా లేని శివాజీ నిన్నటి నుంచి అందరు కంటెస్టెంట్స్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా తనను ఎవరు ఏం చేయలేరని, పవర్ అస్త్రా దొంగిలిస్తే భయపడేది లేదని గట్టిగా చెప్పాడు. కాసేపు అసలు ఆ పవర్ అస్త్రాను ఎవరు దొంగిలించి ఉంటారని చర్చ కూడా చేశాడు. కానీ రెండు రోజులు అవుతున్నా కూడా అసలు తన పవర్ అస్త్రాను ఎవరు దొంగిలించారు అనే విషయం శివాజీకి తెలియలేదు. అప్పుడే సందీప్ సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు.


తేజను ఇరికించిన సందీప్


మొదటి వారంలో పవర్ అస్త్రాను సందీప్ గెలుచుకున్న తర్వాత కూడా దానిని శుభశ్రీ దొంగిలించింది. ఇప్పుడు శివాజీ పవర్ అస్త్రా విషయంలో కూడా అదే జరిగింది. దీంతో సందీప్‌కు ఈ విషయం గురించి ఏమైనా ఐడియా ఉంటుందేమో అని తనతో డిస్కషన్ మొదలుపెట్టాడు. సందీప్‌కు శివాజీ పవర్ అస్త్రాను ఎవరు దొంగిలించారో తెలుసు అని చెప్పాడు. చెప్పొద్దు అని మాట తీసుకున్నాడని కూడా అన్నాడు. కానీ తాను ఎవరితో ఈ మాట గురించి చెప్పను అంటూ శివాజీ అడిగాడు. దీంతో సందీప్.. తేజ పేరు చెప్పాడు. అప్పటినుంచి తేజను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు శివాజీ. ఈ విషయంలో తేజను ఇరికించినట్టుగా తనకు వెళ్లి చెప్పాడు సందీప్. కానీ అమర్‌దీపే ఆ అస్త్రాన్ని దొంగిలించిన విషయం తేజకు కూడా తెలియదు.


క్యారెక్టర్ లేదు..


తేజనే తన పవర్ అస్త్రాను దొంగిలించాడు అనుకున్న శివాజీ.. ‘‘వాడికి క్యారెక్టర్ లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా అది తన వెంట్రుకతో సమానం అంటూ కామెంట్ చేశాడు. క్యారెక్టర్ అనేది ముఖ్యమని, అడుక్కుతిని ఈ వీక్‌లో సేవ్ అయ్యాడని, ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడకూడదు, మగాడిలాగా ఆడాలి అంటూ తేజను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌తో ఈ విషయం గురించి మాట్లాడిన శివాజీ.. తేజ బుద్ధి కుక్కతోకలాంటిది అని, అందుకే తను ఎదగడం లేదు అని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. తేజకు కూడా శివాజీ తననే టార్గెట్ చేస్తున్నట్టు తెలిసినా.. పెద్దగా స్పందించకుండా అలాగే ఉండిపోయాడు.


Also Read: అలా చేసిందని నటిపై బ్యాన్, మూడేళ్లు సినిమాలు చేయకూడదంటూ ఆంక్షలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial