బిగ్ బాస్ ఓటీటీ తెలుగు మరో మూడు వారాల్లో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం హౌస్ లో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేట్ కావడానికి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. నిజానికి ఈ వారం హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపించారు. వీకెండ్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ను, మరికొందరి పేరెంట్స్ ను, బంధువులను స్టేజ్ మీదకు తీసుకొచ్చారు.


దీంతో షో కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. హౌస్ మేట్స్ సన్నిహితులు స్టేజ్ పైకి వస్తూ.. అందరికీ సలహాలు ఇవ్వడంతో పాటు నామినేషన్స్ ఉన్నవారి సేవ్ చేస్తూ వచ్చారు. అఖిల్ కోసం సోహైల్ స్టేజ్ పైకి వచ్చి.. తన ఫ్రెండ్ ను తెగ పొగిడేశాడు. ఆ తరువాత షణ్ముఖ్.. యాంకర్ శివ కోసం స్టేజ్ పైకి వచ్చాడు. షణ్ముఖ్ ని చూసిన హోస్ట్ నాగార్జున 'బిగ్ బాస్ తరువాత ఎక్కడా కనిపించలేదేంటి..? బ్రేకప్ తో బిజీగా ఉన్నావా..?' అని ప్రశ్నించడంతో నవ్వేసి ఊరుకున్నాడు షణ్ముఖ్. అనంతరం సిరిని స్టేజ్ పై చూసి ఎమోషనల్ అయింది మిత్రాశర్మ. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. మిత్రా మంచి ఫ్రెండ్స్. అనిల్ కోసం అతడి తండ్రి, అరియనా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి స్టేజ్ పైకి వచ్చారు. షో కోసం వచ్చిన గెస్ట్ లను టాప్ 5లో ఎవరు ఉంటారో చెప్పమని గేమ్ ఆడించారు నాగార్జున. 


నామినేషన్స్ లో ముందుగా మిత్రాశర్మను సేవ్ చేశారు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్, శివ, మిత్రాశర్మ , బాబా భాస్కర్, అనిల్ ఇలా ఒక్కొక్కరినీ సేవ్ చేశారు. ఫైనల్ గా అరియనా, హమీదలను నామినేషన్స్ లో ఉంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. 


ఫైనల్ గా హమీద ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె కొంచెం ఎమోషనల్ అయింది. అనంతరం స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చింది. అయితే ఈ వారం హమీద ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. వేరే కంటెస్టెంట్ కి బదులుగా ఆమెని ఎలిమినేట్ చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Also Read: రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'సమ్మతమే' టీజర్


Also Read: బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు