Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఎట్టకేలకు ముగిసింది. మరికొద్ది సేపటిలో బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ ఎవరో తేలిపోనుంది.

ABP Desam Last Updated: 21 May 2022 09:37 PM
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

బిగ్ బాస్ నాస్ స్టాప్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచింది. ట్రోపీని సొంతం చేసుకుంది. 

నాగ్ ఆఫర్‌ను తిరస్కరించిన బిందు, అఖిల్

‘బిగ్ బాస్’ ఓటీటీ తుది దశకు చేరింది. ఇప్పుడు హౌస్‌లో బిందు, అఖిల్ మాత్రమే ఉన్నారు. దీంతో హోస్ట్ నాగార్జున గోల్డెన్ బ్రీఫ్‌కేస్‌తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అఖిల్, బిందులకు ప్రైజ్ మనీ ఆఫర్ చేశారు. అయితే, ఇద్దరూ ప్రైజ్ మనీ తీసుకోడానికి తిరస్కరించారు. దీంతో నాగ్ కాసేపు ఇద్దరితో కూర్చొని కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా నాగ్ ప్రోమోను ప్రదర్శించారు. 

బిగ్ బాస్ ఇంటి నుంచి టాప్-3 కంటెస్టెంట్‌గా శివ ఔట్

బిగ్ బాస్ హౌస్ నుంచి శివ ఎలిమినేట్ అయ్యాడు. టాప్ కంటెస్టెంట్‌గా బయటకు వెళ్లాడు. ఇప్పుడు పోటీ అఖిల్, బిందు మధ్య నెలకొంది. 

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి F3 టీమ్‌ ఎంట్రీ, డబ్బుతో బయటకొచ్చేసిన అరియానా!

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి, సునీల్.. డబ్బులు ఆఫర్ ఇచ్చారు. చివరికి అరియానా డబ్బు తీసుకోడానికి అంగీకరించింది. దీంతో అరియానా హ్యాపీగా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. 

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి F3 టీమ్‌ ఎంట్రీ

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి F3 టీమ్‌ ఎంట్రీ ఇచ్చారు. సునీల్, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి సందడి చేశారు. 

బిగ్ బాస్ హౌస్ నుంచి మిత్రా ఔట్

బిగ్ బాస్ హౌస్ నుంచి మిత్ర ఎలిమినేట్ అయ్యింది. టాప్-5 వరకు చేరుకున్న మిత్రా.. 5వ కంటెస్టెంట్‌గా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇంట్లో అరియానా, శివ, అఖిల్, బిందు ఉన్నారు. 

6వ కంటెస్టెంట్‌గా బాబా మాస్టర్ ఔట్

బిగ్ బాస్ హౌస్ నుంచి బాబా మాస్టర్ 6వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయ్యారు. హీరో సత్యదేవ్ హౌస్‌లోకి వెళ్లి పిస్తోల్ ద్వారా బాబా మాస్టర్‌ను ఎలిమినేట్ చేసి.. బయటకు తీసుకొచ్చాడు. 

6వ కంటెస్టెంట్‌గా ఎలిమినేటైన అనిల్

6వ కంటెస్టెంట్‌గా ఎలిమినేటైన అనిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. 

మొదలైన ‘బిగ్ బాస్’ ఫినాలే సందడి

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఫినాలే మొదలైంది. ఇంటి నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్లతోపాటు టాప్-7లో ఉన్న కంటెస్టెంట్ల తల్లిదండ్రులు, స్నేహితుల కుటుంబికులు హాజరయ్యారు. మరికొద్ది సేపట్లో విజేతను ప్రకటించనున్నారు. 


Background

బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫైనల్ కి వచ్చేసింది. ఈరోజు విన్నర్ ని అనౌన్స్ చేయడంతో షో ముగిసిపోతుంది. ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఏడుగురి ఫైనలిస్ట్ ల ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా కనిపించారు. మిత్రా ఫ్రెండ్ ను కాసేపు ఆటపట్టించారు నాగార్జున. 'మేజర్' సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్ స్టేజ్ పైకి వచ్చారు. 


అలానే నటుడు సత్యదేవ్ కూడా వచ్చారు. 'ఎఫ్3' టీమ్ హౌస్ లో సందడి చేసింది. మెహ్రీన్ స్టేజ్ పై డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అనిల్ రావిపూడి, సునీల్ లను డబ్బులున్న సూట్ కేస్ తో హౌస్ లోకి పంపించారు బిగ్ బాస్. అలానే అప్సరా రాణి, దక్షా నగార్కర్ ల డాన్స్ పెర్ఫార్మన్స్ ను ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. 


నిజానికి ఈరోజు ఫినాలే ఉంటుందనే విషయాన్ని కూడా పెద్దగా ప్రమోట్ చేయలేదు బిగ్ బాస్ టీమ్. షో ఫ్లాప్ కావడంతో గ్రాండ్ ఫినాలేకి కూడా పెద్దగా బజ్ రాలేదు. ఇక ఈ షోలో విన్నర్ గా బిందు మాధవి నిలుస్తుందని.. అఖిల్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సమాచారం. అదే నిజమైతే తొలిసారి బిగ్ బాస్ తెలుగు సీజన్లలో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచినట్లు అవుతుంది. మరేం జరుగుతుందో ఈరోజు ఎపిసోడ్ తో తేలిపోతుంది! 


ఫిబ్రవరి 26న మొదలైన ‘బిగ్ బాస్’లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. వీరిలో కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు నాగార్జున. ఈసారి గేమ్ వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ మధ్య జరుగుతుందని చెప్పారు. వారియర్స్ అంటే పాత కంటెస్టెంట్స్ అని.. కొత్తవాళ్లను ఛాలెంజర్స్ అని చెప్పారు నాగ్. ఆ ప్రకారం వారియర్స్ అండ్ ఛాలెంజర్స్‌లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దామా. (రెడ్/బోల్డ్ లెటర్స్‌లో ఉన్న పేర్లు టాప్-7‌లో ఉన్న కంటెస్టెంట్లు). 

 

వారియర్స్: 

1. అషురెడ్డి (సీజన్ 3)

2. మహేష్ విట్టా (సీజన్ 3)

3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)

4. అరియనా (సీజన్ 4)

5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)

6. తేజస్వి మదివాడ (సీజన్ 2)

7. సరయు (సీజన్ 5)

8. హమీద (సీజన్ 5) 

9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)

10. బాబా మాస్టర్ (సీజన్ 3)

 

ఛాలెంజర్స్:

1. ఆర్జే చైతు 

2. అజయ్ కతుర్వర్

3. స్రవంతి చొక్కారపు 

4. శ్రీరాపాక 

5. అనిల్ రాథోడ్ 

6. మిత్రా శర్మ 

7. యాంకర్ శివ 

8. బిందు మాధవి 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.