Bigg Boss Nonstop Live: ‘బిగ్ బాస్ ఓటీటీ’ లైవ్ అప్‌డేట్స్: ‘నాన్ స్టాప్’ చివరి కంటెస్టెంట్‌గా సీజన్-4 రన్నర్ అఖిల్ సార్ధక్
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి, మిస్ కాకుండా చూసేయండి మరి.
ABP DesamLast Updated: 26 Feb 2022 08:38 PM

Background
‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైపోయింది. మరికొన్ని నిమిషాల్లోనే ‘బిగ్ బాస్’ నిర్విరామ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్-నాన్ స్టాప్‌పై అవగాహన కలిగిస్తే అదిరిపోయే ప్రోమోతో ముందుకొచ్చారు. మునుపెన్నడూ లేనంత...More
‘బిగ్ బాస్ ఓటీటీ’ నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైపోయింది. మరికొన్ని నిమిషాల్లోనే ‘బిగ్ బాస్’ నిర్విరామ కార్యక్రమం మొదలు కానుంది. ఇప్పటికే హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్-నాన్ స్టాప్‌పై అవగాహన కలిగిస్తే అదిరిపోయే ప్రోమోతో ముందుకొచ్చారు. మునుపెన్నడూ లేనంత అందంగా మురిసిపోతున్న బిగ్ బాస్ హౌస్‌ను చూసి.. తనకు కూడా అక్కడి నుంచే హోస్టింగ్ చేయాలని అనిపిస్తోందని నాగ్ చెప్పడంతో.. బిగ్ బాస్ ఒప్పుకోలేదు. ‘‘నాగార్జున, ఇది నా అడ్డా’’ అంటూ ఫన్ క్రియేట్ చేశారు. ఇన్నాళ్లూ బిగ్ బాస్ కేవలం గంట మాత్రమే ప్రసారమయ్యేది. తాజా షో మాత్రం 24 గంటలూ ప్రసారం కానుంది. ఇకపై కంటెస్టెంట్లను 24 గంటలూ కనిపెట్టవచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. గత సీజన్లలో కనిపించిన పాత కంటెస్టెంట్స్‌తో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే క్వారెంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు కాసేపట్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నారు.తాజా ప్రోమోలో దుమ్ముదులిపే పెర్ఫార్మెన్స్‌తో కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్‌కానున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లతో నాగ్ ముచ్చడించడాన్ని ప్రోమోలో చూడవచ్చు. వారి మాటలను బట్టి.. ఎవరు హౌస్‌లోకి ఎంటర్ అవుతున్నారో చెప్పేయొచ్చు. మరి ఎవరు హౌస్‌లోకి వెళ్తున్నో ముందే తెలుసుకొనే బదులు.. ‘ప్రత్యక్షం’గా చూస్తేనేగా కిక్ ఉంటుంది. కాబట్టి, మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్’ నాన్ స్టాస్ ఓటీటీ లైవ్‌ను మిస్ కాకుండా చూడండి. ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి షో ‘లైవ్’ టెలికాస్ట్ కానుంది. షోలో అప్‌డేట్ కోసం ఎప్పటికప్పుడు మా Bigg Boss Nonstop Live Updates పేజీని కూడా రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
చివరి కంటెస్టెంట్‌గా అఖిల్ సార్ధక్
‘బిగ్ బాస్ హౌస్’లో 17వ కంటెస్టెంట్‌గా అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ‘సీజన్-4’లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ ఈ సారి ట్రోపీ గెలుచుకుంటాడో లేదో చూడాలి.