Bigg Boss 9 Telugu : రోత అని కొంతమంది ఫీల్ అయినా, బుల్లితెర ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేస్తున్న రియాల్టీ షో 'బిగ్ బాస్'. ఈ షో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే షో మొదలవగానే కొంతమందిని హౌస్‌లోకి పంపుతారు. వాళ్ళను చూసి చూసి బోర్ కొట్టింది అనుకునేలోపే వైల్డ్ కార్డు ఎంట్రీస్ పేరుతో మరికొంత మంది సెలబ్రిటీలను హౌస్‌లోకి పంపించి క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అన్నది ఎప్పటినుంచో నడుస్తున్న ఈ షో ఫార్మాట్. ఎప్పటిలాగే తాజాగా దూసుకెళ్తున్న 'బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు'లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీస్ త్వరలోనే అడుగు పెట్టబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ లిస్టులో పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్ట్ ఇదేఇప్పటికే 'బిగ్ బాస్ సీజన్ 9'లో ఆరుగురు కామనర్స్, 9 మంది సెలబ్రిటీలు అడుగు పెట్టి గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. 'డబుల్ హౌజ్, డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్' అంటూ మొదటి నుంచీ షోపై బాగానే బజ్ క్రియేట్ చేశారు. అయితే హౌజ్ లో భారీగా క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు పెద్దగా లేకపోయినా... ఎమోషనల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫైర్, కామెడీ, లవ్ ట్రాక్ వరకు అన్నీ మొదలైపోయాయి. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో 6 లేదా 7 మంది సెలబ్రిటీలు ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఈ లిస్ట్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
'బిగ్ బాస్ 9 తెలుగు 2.0' వెర్షన్ లో సీరియల్ నటి సుహాసిని, 'చిన్ని' సీరియల్ హీరోయిన్ కావ్య, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దివ్వెల మాధురి, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ త్వరలో వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సన్నిహిత వర్గాల సమాచారం. అలాగే 'వారెవ్వా' చెఫ్ సంజయ్ తుమ్మ, 'సింహాద్రి' మూవీ హీరోయిన్ అంకితకు కూడా ఈ లిస్ట్ లో ఛాన్స్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ లో ఒక కమెడియన్, సీజన్ 2 నుంచి తనీష్ లేదా సీజన్ 7 నుంచి అమర్దీప్ కూడా ఇందులో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి వీళ్ళలో ఎవరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మారబోతున్నారనేది త్వరలోనే తేలనుంది.
సీక్రెట్ రూమ్ ట్విస్టు, వైల్డ్ కార్డు ఎంట్రీ ఎప్పుడు?చివరి 3 సీజన్ల నుంచి అసలు సీక్రెట్ రూమ్ ప్రస్తావనే లేదు. కానీ ఈసారి మాత్రం పక్కాగా ఈ ట్విస్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా వైల్డ్ కార్డు ఎంట్రీ అక్టోబర్ మొదటి శని, ఆదివారాలలో ఉంటుందని టాక్. మరి వీళ్ళను ఓనర్స్ గా పంపిస్తారా? లేదా టెనెంట్స్ గా ఉంటారా? అనేది చూడాలి.