గతంలో ఏ సీజన్లోనూ లేనన్ని సర్ప్రైజులన్నీ బిగ్ బాస్ సీజన్ 9లో వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వైల్డ్ కార్డు ఎంట్రీలు, సీక్రెట్ రూమ్, డబుల్ ఎలిమినేషన్ వంటి ఆయుధాలన్నీ వాడేశారు బిగ్ బాస్. కానీ సీజన్ 9 మాత్రం చాలా చప్పగా సాగుతోంది. ఈ వారమైతే బిగ్ బాస్ పెట్టిన వాటర్, చెప్పులు, టీ, పానీ పూరీ టాస్కులపై నెగెటివ్ కామెంట్స్ విన్పిస్తున్నాయి. వైల్డ్ ఫైర్ అంటూ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి మొదట్లో శివంగిలా కన్పించింది. కానీ ఇప్పుడు మాత్రం తనూజాతో బాండింగ్ అంటూ చల్లబడింది. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలలో మంచి కంటెంట్ కట్ అవుట్ అని ఆశించిన కంటెస్టెంట్స్ లో రమ్య మోక్ష, అయేషా ఉన్నారు. కానీ ఈ వీక్ ఎపిసోడ్ లలో మాత్రం వాళ్లిద్దరూ కన్పించలేదు. దీంతో షో జోష్ పెంచడానికి మరో అస్త్రాన్ని సంధించడానికి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఇక ఈ వారం మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అందులో ఓటింగ్ పరంగా చూసుకుంటే టాప్ లో కళ్యాణ్, తనూజ ఉన్నారు. కానీ రామూ రాథోడ్, రమ్య మోక్ష డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటుందని సమాచారం. రామూ రాథోడ్ లేదా శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా, లీస్ట్ ఓటింగ్ తో రమ్య కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు అయేషా డెంగ్యూ. టైఫాయిడ్ తో మిడ్ వీక్ బయటకు వచ్చేసింది. ఈ వారం మొత్తం ఆమె అనారోగ్యంగా ఉంది. హెల్త్ సెట్ అయ్యాక ఆమె హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తుందని సమాచారం. కానీ ఆమె రీఎంట్రీపై బిగ్ బాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
ఎక్స్ కంటెస్టెంట్స్ రీ-ఎంట్రీ ఇప్పటికే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 7 వారాలు పూర్తి కావస్తోంది. అందులో ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అందులోనూ ఈ సీజన్ లో ఫైర్ బ్రాండ్స్ గా పేరు తెచ్చుకున్న ప్రియా శెట్టి, శ్రీజ దమ్ము రీఎంట్రీ కోసం వాళ్ళ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే హౌస్ లో ఉన్నప్పుడు రోజుకో గొడవతో హైలెట్ అయిన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ రీఎంట్రీ గురించి కూడా టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం... కామనర్స్ నలుగురిలో నుంచి ఇద్దరు హౌస్ లోనే ఉండి, గేమ్స్ ఆడతారని తెలుస్తోంది. ఈ నలుగురు వారమంతా హౌస్ మేట్స్ తో ఆడి పాడి, హౌస్ మేట్స్ ను డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ తో మరోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఫైర్ ను పెంచబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బిగ్ బాస్ టీం నుంచి ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ కు లగేజ్ కూడా తెచ్చుకోమన్నట్టు సమాచారం. కానీ భరణి - ఫ్లోరా సైనీలకు మాత్రం లగేజ్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదట. అంటే ఆ ఇద్దరికీ హౌస్ లో ఉండే ఛాన్స్ లేదన్న మాట. అంతేకాదు మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే సెలెబ్రెటీగా ఈ సీజన్ లో అడుగు పెట్టిన శ్రేష్టి వర్మ రీఎంట్రీ లేనట్టేనని తెలుస్తోంది.