Telugu Bigg Boss Season 9 Emmanuel vs Thanuja: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 9లో భరణి ఎలిమినేషన్ తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాగార్జున ఇచ్చిన ఎలాంటి ఇన్‌పుట్స్‌ పెద్దగా గేమ్‌లో మార్పు రాలేదు. కానీ హైపర్ ఆది ఇచ్చిన ఇన్‌పుట్స్ మాత్రం అనేక మార్పులు తీసుకురాబోతున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడుతూ, అందర్నీ నవ్విస్తూ నామినేషన్‌లోకి రాకుండా జాగ్రత్తపడుతున్న ఇమాన్యూయెల్‌ ఒక విధంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లాడు. ఆదివారం వచ్చిన హైపర్ ఆది మాత్రం వాటినే స్ట్రేస్ చేసి చెప్పాడు. సేఫ్ గేమ్‌ ముసుగు తీసి ఆడాలని సూచించాడు. అదే టైంలో లేడీ విన్నర్ అయ్యే అవకాశం ఉందని కూడా తనూజకు చెప్పాడు. ఈ రెండింటిని మనసులో పెట్టుకున్న ఇమ్ము సోమవారం నుంచి తన స్టైల్ గేమ్‌ను ప్లే చేస్తున్నాడు. 

Continues below advertisement

సోమవారం జరిగిన నామినేషన్లలో తనూజాను ఇమాన్యుయెల్ టార్గెట్ చేసుకున్నాడు. అందుకే ఆమెను నామినేట్ చేస్తామని చెప్పిన ఇద్దరికి నామినేషన్ టికెట్స్‌ ఇచ్చాడు. అందులో రమ్య ఒకరైతే, రెండో వ్యక్తి కల్యాణ్. ఈ ప్లాన్‌తో తన వద్ద ఒకటి ఉంచుకుంటే గేమ్‌ను మార్చవచ్చనే పాయింట్‌ను ఇమ్మూ మర్చిపోయాడు. అందుకే తన వద్ద ఉన్న టికెట్స్ అన్నింటినీ వేరే వాళ్లకు ఇచ్చేశాడు. కానీ ఆఖరిలో కల్యాణ్‌ మాత్రం తనకు వచ్చిన టికెట్‌తో తనూజను కాకుండా సంజనను నామినేట్ చేశాడు. ఇది ఇమాన్యుయెల్‌కు నచ్చలేదు. తాను తనూజను టార్గెట్ చేయమంటే సంజనను నామినేట్ చేయడం ఏంటని ప్రశ్నించాడు. 

ఎప్పుడూ తనూజ వెంట ఉండే కల్యాణ్‌ ఆమెను నామినేట్ చేస్తే జనాల్లోకి నెగటివిటీ బాగా వెళ్తుందని ఇమాన్యుయెల్ అనుకున్నాడు. కానీ అక్కడ కల్యాణ్ మాత్రం సంజనను నామినేట్ చేయడంతో ఇమాన్యుయెల్ కంగుతిన్నాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు కల్యాణ్ నామినేట్ చేస్తే ఒకవైపు తనూజను దెబ్బకొట్టొచ్చని, రెండోవైపు వారిద్దరి మధ్య విభేదాలు తీసుకురావచ్చని ప్లాన్ చేశాడు. దీంతో తనూజ ఒంటరి అవుతుందని స్కెచ్ వేశాడు. ఇప్పటి వరకు భరణి, కల్యాణ్ సపోర్ట్‌తో నెట్టుకుంటూ వచ్చిందని ఇప్పుడు భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఇకపై కల్యాణ్ సపోర్ట్ సిస్టమ్‌ కూడా తీసేస్తే తాను సేఫ్ అనుకున్నాడు ఇమాన్యుయెల్. 

Continues below advertisement

నామినేషన్ టైంలోనే తనూజకు గట్టి ఎలివేషన్ వచ్చింది. అంతే కాకుండా కల్యాణ్‌ను పిలిచి తనపై చేయి వేయాలని, తలపై చేయి వేయాలని కూడా చెప్పింది. వారిద్దరి మధ్య అంతలా అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు కల్యాణ్ నామినేషన్ వేస్తే తనూజ ఎమోషన్ అవుతుందని దాన్ని చూపి గేమ్‌ను తనవైపు తిప్పుకోవాలని భావించాడు. కానీ కల్యాణ్ పొడిచిన వెన్నుపోటుతో షాక్ అయ్యాడు. అక్కడ సంజనాను ఎందుకు నామినేషన్ చేస్తున్నావని కల్యాణ్‌ను ప్రశ్నించాడు. తనకు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావని అడిగాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేంటని నిలదీశాడు. సంజనా తరఫున స్టాండ్ తీసుకున్నాడు. కానీ ఇదే పని రీతు చేసినా రాము తరఫున మాత్రం ఇమాన్యుయెల్ స్టాండ్ తీసుకోలేదు. దీన్నే ప్రేక్షకులు సేఫ్ గేమ్ అంటున్నారు. 

నామినేషన్‌లో తాను అనుకున్నది జరగకపోయే సరికి నేరుగా తనూజను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఇమాన్యుయెల్. దివ్యతో తనూజ మాట్లాడుతూ అసలు తనను నామినేట్ చేయడానికి వారి వద్ద ఉన్న పాయింట్స్ ఏంటని , వాటి గురించి తన వద్దే చెప్పొచ్చు కదా అనికామెటం్స్ చేసింది. ఇది విన్న ఇమాన్యుయెల్‌ సేప్‌ గేమ్ ఆడుతున్నావని అంటాడు. వైల్డ్ కార్డ్స్‌వచ్చిన తర్వాత మొదటి వారం నామినేట్ చేసిన ఆయేషతో నిమిషాల వ్యవధిలోనే క్లోజ్ అయిపోవడం, ఆమె వద్ద ఉన్న పవర్‌ను కూడా ఉంచుకునే అర్హత ఉందని చెప్పడం అన్నీ కూడా సేఫ్‌లా ఉన్నాయని కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు తనతో క్లోజ్‌గా ఉంటు సడెన్‌గా మార్పు ఎందుకొచ్చిందని తనూజ గట్టిగా నిలదీసింది. ఈ మధ్య అసలు తనకు నచ్చడం లేదని ఓవరాక్షన్ చేస్తున్నావనేలా ఇమాన్యుయెల్ మాట్లాడాడు. 

ఇమాన్యుయెల్ మాటలకు రెచ్చిపోయిన తనూజ ఈ హౌస్‌లో సేఫ్‌ గేమ్‌ ఎవరైనా ఆడుతున్నారంటే అది కేవలం నీవేనంటూ కౌంటర్ ఇచ్చింది. భరణి ఉన్నన్ని రోజులు ఆయనతో వెనకాలే తిరిగావని, ఆయన వెళ్లిపోయేలా చేశావని అంటుంది. దీనిపై ఘాటుగా స్పందిస్తాడు ఇమాన్యుయెల్, అసలు భరణి అక్కడి వరకు రావడానికి నీవే కారణమని, నీ కోసం ఆయన తన గేమ్ ఆడటం మానేశాడని అందుకే వెళ్లిపోయాడని అంటాడు. దీనికి తనకు ఎవరూ సపోర్ట్ చేయలేదని అంటుంది. కౌంటర్‌గా తాను సపోర్ట్ చేసిన టాస్క్‌లు గురించి చెప్పి ఆమెను కార్నర్ చేస్తాడు.

మొత్తానికి భరణి వెళ్లిపోయేందుకు తనూజ కారణం అనేలా అందరి మైండ్‌లో ఉన్న విషయాన్ని మరింతగా ఎక్‌ప్లోర్ చేస్తాడు ఇమాన్యుయెల్. అంతే కాకుండా ఇప్పటి వరకు నెంబర్‌వన్ అని భావిస్తున్న భరణి వెళ్లిపోవడంతో, ఇప్పుడు అదే కారణంతో తనూజను కూడా డౌన్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తగ్గట్టుగానే సోమవారం నుంచి పావులు కదుపుతున్నాడు. ఇది తెలుసుకున్న తనూజ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అయితే తాను సేఫ్ కాదని చెప్పుకునేందుకు ఆడుతున్న ఇమాన్యుయెల్‌, అదే టికెట్లు తన వద్ద ఉంచుకొని కొందర్ని నామినేట్ చేసి ఉంటే గేమ్‌లో మరింత మజా వచ్చేది. కానీ అలా చేయకుండా కల్యాణ్, రీతు, రమ్య భుజాలపై తుపాకులు పెట్టి కాల్చాలని చూశాడు. దీన్నే సేఫ్ గేమ్ అంటున్నారు ప్రేక్షకులు. విన్నర్ ఎప్పుడైనా రణరంగంలోకి దిగి ఢీ కొడితే తప్ప విజేత కాలేడని అంటున్నారు. 

ఏడు వారాలుగా నామినేషన్లోకి రాకుండా జాగ్రత్తపడ్డ ఇమాన్యుయెల్ డేంజర్ జోన్‌లో పడుతున్నాడు. నామినేషన్‌లోకి వచ్చినప్పుడే ఒక ఆటగాడికి ఓటు బ్యాంకు పెరుగుతుంది. మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో తనకు అనూకూలంగా ఓట్లు వచ్చాయని భావిస్తున్నాడే తప్ప నిజమైన ఓటర్లు తనవైపు లేరని గ్రహించలేకపోతున్నాడు. గత సీజన్‌లలో చాలా మంది కమెడియన్‌లు ఇలానే ఆఖరి వరకు నామినేషన్‌లోకి రాలేదు. ఏదో వారం పూర్తి నెగటివిటీతో వచ్చిన వెంటనే ఓట్లు పడకపోవడంతో ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇమాన్యుయెల్‌ది అదే పరిస్థితి. కామెడీతో నవ్విస్తూ అందరితో మంచిగా ఉంటున్నాడు. సేఫ్‌ గేమ్ కారణంగా ఎవరూ నామినేట్ చేయడంలేదు. అందుకే రేపు సభ్యులు తగ్గే కొద్ది కచ్చితంగా నామినేషన్‌లోకి రావాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఓటు బ్యాంకు లేని కారణంగా నామినేట్ అయ్యే ప్రమాదం ఉంది.