సండే ఫన్ డే ఎపిసోడ్ ను ఎప్పటిలాగే అందమైన చిరునవ్వుతో షురూ చేశారు నాగార్జున. రాగానే నామినేషన్ లో ఉన్నవాళ్ళకి లెక్కల బోర్డులు ఇచ్చి, వాటి సమాధానంతో ఎవరు సేఫ్ అనేది చెప్తానన్నారు నాగ్. ట్రయాంగిల్ ఈజ్ సేఫ్ అంటూ ఆమె పట్టుకున్న బోర్డులో ఉన్న 50/2 అనే ప్రశ్నకు 25 ఆన్సర్ ను చూపించారు. "బిగ్ బాస్ స్పెషల్ గా లెక్కల వీడియో తయారు చేశారు" అంటూ ఫన్ గా ఎడిట్ చేసిన రీతూ లెక్కల టాస్క్ వీడియోను ప్లే చేసి నవ్వించారు.
కళ్యాణ్ టీంకు హయ్యెస్ట్ పాయింట్స్ హౌస్ మేట్స్ ను భరణి, కళ్యాణ్ టీం అంటూ సినిమా పేరును గెస్ చేసే టాస్క్ పెట్టారు. మనసంతా నువ్వే, భరత్ అనే.నేను సినిమాల క్లిప్ ను కళ్యాణ్ గెస్ చేయగా, డెమోన్ మర్యాద రామన్న, మిర్చి... కళ్యాణ్ మగధీర, హృదయ కాలేయం... రీతూకి మన్మథుడు, పోకిరి... ఇమ్మూ బాహుబలి 2, అందరివాడు... కళ్యాణ్ దూకుడు, పోకిరి క్లిప్స్ చెప్పారు. ఈ టాస్క్ లో 70 పాయింట్స్ తో కళ్యాణ్ టీం విన్ అయ్యింది. 80-10 ఎంత ? అని అడిగి... రీతూ సమాధానంతో "ఇమ్మూ నువ్వు చెప్పింది నిజమే. లెక్కల్లో మాత్రం పక్కా ఉంది" అంటూ పంచ్ వేశారు నాగ్. బోర్డులపై పెయింట్ వేయించి డెమోన్ ను సేఫ్ చేశారు.
పనిష్మెంట్ టాస్క్ "బోర్డులో ఉన్న ఒక పనిష్మెంట్ ను ఎవరికి ఇవ్వాలో చూజ్ చేసుకుని, 2 సార్లు బాల్స్ ను గ్లాస్ లో వేయాలి. పడిందా అవతలి వాళ్లకు, లేదా మీకే పనిష్మెంట్" అని చెప్పారు నాగ్. సుమన్ కు 3 బిట్టర్ షాట్స్ ఇచ్చి, బాల్స్ వేయడంలో ఫెయిల్ అయ్యింది సంజన. దీంతో వాటిని తానే తాగాల్సి వచ్చింది. ఇమ్మూ సక్సెస్ ఫుల్ గా రీతూకి మీసం అంటించాడు. కళ్యాణ్ తానే 5 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడ్డాడు. తనూజా ఇమ్మూకి లిప్ స్టిక్ వేస్తే, సుమన్ లెమన్ తిన్నాడు. రీతూ ఫెయిల్ అయ్యి కళ్యాణ్ కు బదులు డెమోన్ కు వ్యాక్సింగ్ చేసింది. డెమోన్ వచ్చి బాల్ వేయలేకపోవడంతో సంజనాను తిరిగి పొగడాల్సి వచ్చింది. హౌస్ లో మంచి బాండ్ ఆవిడ ఒక్కతే అన్నావ్ కదా అని ఇరికించారు నాగ్. రోప్ లాగే టాస్క్ ఇచ్చి భరణిని సేఫ్ చేశారు.
రీతూ ఎలిమినేషన్ "మూడింట్లో రైట్ స్టేట్మెంట్ గెస్ చేయాలి. లేదంటే ఫోమ్ రాసుకోవాలి" అని చెప్పారు నాగ్. సంజనాకు రీతూ ఇచ్చిన "సెల్ఫ్ డబ్బా వీకెండ్ ఓవర్ యాక్షన్" అనే స్టేట్మెంట్ కరెక్ట్. గెస్ చేయలేకపోయినా సంజన ఫోమ్ పూసుకుంది. అలాగే అందరూ రాంగ్ గా గెస్ చేశారు. కెప్టెన్ కళ్యాణ్ చేతుల మీదుగా సుమన్ శెట్టిని సేవ్ చేశారు. తర్వాత నామినేషన్లలో మిగిలిన సంజన, రీతూలతో బాంబు కట్ చేయించారు. ఎవరి చేతుల్లో పేలితే వాళ్ళే ఎలిమినేట్. ఇందులో రీతూ ఎలిమినేట్ అయ్యి, ఎమోషనల్ అయ్యింది.
"మిస్ యూ" అంటూ తనూజా - రీతూ ఒకరిని పట్టుకుని మరొకరు ఏడ్చారు. డెమోన్ కన్నీరు మున్నీరు అయ్యాడు. అలాగే కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కూడా ఏడ్చారు. "ఓడిపోయాను, టాప్ 5లో ఉండలేకపోయా" అంటూ కుళాయి తిప్పేసింది రీతూ. వెళ్తూ "పవన్ ను అందరూ జాగ్రత్తగా చూసుకోండి, మాట్లాడండి. కళ్యాణ్ నువ్వే పవన్ తో మాట్లాడట్లేదు అని వాడు ఫీల్ అవుతున్నాడు. బిగ్ బాస్ నన్ను ముందే పంపిస్తున్నారు. ఇంకా మీరు నన్ను పొగిడి, నా గురించి చాలా పొగుడుతారు అనుకున్నా" అంటూ బై చెప్పేసింది. జర్నీ చూసుకుని ఎమోషనల్ అయిన రీతూ... భరణిని టాప్ 7లో, సుమన్ ను 6లో, సంజనకు 5లో, తరువాత స్థానాల్లో కళ్యాణ్, తనూజా, ఇమ్మూని, నెంబర్ 1లో డెమోన్ ను పెట్టింది.