డే 74 రాత్రి 7 గంటలకు ఇమ్మాన్యుయేల్ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. తల్లిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు ఇమ్మూ. అందరినీ ఆవిడ ప్రేమగా పలకరించారు. "ఆదమ్మకు నేనే గాజులు కొనిచ్చా" అంటూ హౌస్ లోకి తీసుకొచ్చాడు. తన కొడుకుని చూసుకున్నందుకు సంజనాకు థ్యాంక్స్ చెప్పింది ఇమ్మూ తల్లి. "రచిత వస్తుందేమో అనుకున్నా" అని ఇమ్మాన్యుయేల్ అడిగితే... "నీ గేమ్ నువ్వు ఆడు. ఆమె వెయిట్ చేస్తుందిలే. దిగులు పడకు. గేమ్స్ కు సెల్యూట్ కొడుతున్నారు. ఏ బంగారాన్ని వద్దు అనుకున్నానో ఆ బంగారమే రెండు రాష్ట్రాల్లో పేరు తెస్తోంది. ముద్దుబిడ్డ కప్పు పట్టుకుని రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కమెడియన్ గా వచ్ఛావబ్బా. హీరోగా బయటకు రావాలి. మీ నాన్న ఎంత మురుస్తున్నాడో. 35 ఏండ్ల తరువాత నా కోరికను తీర్చావు" అంటూ కొడుకుని ఆకాశానికెత్తేసింది.చివరకు "సువ్వి సువ్వాలమ్మా" అనే పాటను పాడి తన తల్లికి అంకితం చేశాడు ఇమ్మూ. అలాగే రీతూ కోసం మటన్ బిర్యానీ తీసుకొచ్చింది. "నా కొడుకుని అందరూ నామినేట్ చేయండి" అని చెప్పి వెళ్లిపోయారావిడ.
ఇమ్మాన్యుయేల్ కు గుడ్ న్యూస్ అలాగే ఇమ్మూ కోసం స్పెషల్ గా ఫోటో, రింగ్ పంపించారు. అందులో తాము ఆరేళ్లుగా కన్న కలలకు ఒక సొల్యూషన్ దొరికిందనే గుడ్ న్యూస్ ఉంది. "నేను ఒక్కదాన్నే అందరినీ ఒప్పించాను. నువ్వు గెలిచి వచ్చాక అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం".అని ఇమ్మూ లవర్ ఆ లెటర్ లో రాసింది. "ఈ వారం మీరు మీ ఫ్యామిలీని కలిసి రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. నేనివ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు కెప్టెన్ అవుతారు. హౌస్ మేట్స్ అందులో భాగంగా రెండు టీమ్ లుగా విడిపోవాలి. మీలో ఎవరికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో చెప్పండి" అని ఆదేశించారు బిగ్ బాస్.
దివ్య లేచి " నా పాయింట్ ఆఫ్ వ్యూలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నీకు ఆల్రెడీ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ అయితే 13వ వారం కూడా వస్తుంది" అంటూ తన రీజన్ చెప్పింది. "ప్రతిదానికి నన్ను లాగకు" అని తనూజా కోప్పడడంతో... "నువ్వు అనవసరంగా పోట్రే చేయకు. ఈ వీక్ ఎవరు కెప్టెన్ అయినా ఇదే చేస్తా. గేమ్ పరంగానే చెప్పాను" అని దివ్య చెప్పింది. "కానీ నీ బిహేవియర్ ను బట్టే చెబుతున్నా. ప్రతిదానికి నీకు నేనే కనిపిస్తున్నానా?" అని ఇంతెత్తున లేచింది తనూజా. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. రీజన్ పర్ఫెక్ట్ గా చెప్పాను. పో అని చెప్పకు. నచ్చినప్పుడు నిలుచుంట కూర్చుంట. నా లిమిట్ లో నేనుంటా. నీలాగా బయట సింపతీ కోసం స్టోరీలు అల్లి చెప్పట్లేదు. నీకంటే బాగా మాట్లాడగలను నేను. నీలాగా ఫేక్ గా ఉండడం రాదు. యాటిట్యూడ్, ఇదే నీ ఒరిజినాలిటీ" అని ఫైర్ అయ్యింది దివ్య. "ఫస్ట్ వచ్చి ఒకరు ఒకరి పేరు చెబితే... అందరూ అదే చేస్తారు" అని తనూజా అనడంతో.... "నువ్వెందుకు రాలేదు. దిష్టిబొమ్మలా కూర్చున్నావు" అని దివ్య ఘాటుగా సమాధానం చెప్పింది. "నీ దిష్టే తగిలింది. నా మీద పడి ఏడుస్తున్నారు. ఏదైనా గేమ్ వస్తే ఒక్క గేమ్ చక్కగా ఆడదు. సింపతీ స్టార్" అని తనూజ అంటే... "నేను నీ మీదే డ్యాన్స్ చేసి గెలిచాను. రెండు స్టెప్పులు చాలు నీమీద గెలవడానికి. అందరూ తనూజా తనూజా అంటూ భజన చేయాలి. నేను అందరి దగ్గరకెళ్లి నీలా ఎడవను. నువ్వు సీరియల్ యాక్టర్" అని దివ్య సమాధానం చెప్పింది. వీళ్లిద్దరి గొడవ తారాస్థాయికి వెళ్ళింది.
కూతుర్ల గొడవలో భరణి ఎస్కెప్
ఈ గొడవలో ఇద్దరూ భరణిని తీసుకురావడంతో "మధ్యలో మీరు గొడవ పడితే నన్ను ఎందుకు లాగుతారు. మీకు ముందు కూడా చెప్పాను" అని భరణి ఎస్కేప్ అయ్యాడు. దివ్యను డెమోన్, తనూజాను ఇమ్ము ఆపారు. "బిగ్ బాస్ హౌస్ కి గేమ్ ఆడదానికి కాదు నన్ను ఎక్స్పోజ్ చేయడానికొచ్చింది అంటా" అని తనూజా ఫైర్ అయ్యింది. మిగతా అందరూ సేమ్ రీజన్ చెప్పారు. రీతూ మాత్రం ఇమ్మూ పేరు, కళ్యాణ్ డెమోన్ పేరు చెప్పుకున్నారు. ఈక్రమంలో ఇమ్మూ వర్సెస్ తనూజా, దివ్య వర్సెస్ రీతూ ఫైట్స్ జరిగాయి. ఇక రెండు టీంలుగా హౌస్ మేట్స్ ను విడగొట్టే బాధ్యతను బిగ్ బాస్ తనూజాకు అప్పజెప్పారు. బ్లూ టీం డెమోన్, రీతూ, కళ్యాణ్, సుమన్... రెడ్ టీం భరణి, దివ్య, ఇమ్మాన్యుయేల్, సంజన పేర్లు చెప్పింది తనూజా. 'హంగ్రీ మాన్స్టర్' అనే ఈ టాస్క్ లో మాన్స్టర్ కడుపులో ఉన్న లివర్ ఏ కలర్ లోకి మారితే వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ నుంచి వెళ్ళిపోతారు. ఈ టాస్క్ లో చివరికి రీతూ - సుమన్ శెట్టి మిగిలారు.