బిగ్‌బాస్ డే 74 ఎపిసోడ్ లో 'అమ్మా అమ్మా' అనే ఎమోషనల్ సాంగ్ తో కళ్యాణ్ తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఒకరినొకరు చూడగానే ఎమోషనల్ అయ్యారు. 'ఎలా ఉన్నాను ?' అని కళ్యాణ్ అడగ్గానే... "సన్నగా అయిపోయావ్. బాగా తిను. ఇంత మనసులో పెట్టుకున్నావా? దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ తీసుకో. ఎవ్వరినీ నమ్మకు. కప్పు తీసుకొని వస్తా అని ప్రామిస్ చెయ్. నువ్వు కప్పు పట్టుకుని రాకపోతే ఆయన కర్ర పట్టుకుని నిలుచుంటారు. నాన్నను పంపిద్దాం అనుకున్నాము. కానీ తాతయ్యకు కంటి ఆపరేషన్ అయ్యింది" అంటూ జాగ్రత్తలతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. తరువాత అందరినీ పరిచయం చేశాడు కళ్యాణ్. తనూజాతో స్పెషల్ గా ముచ్చటించింది కళ్యాణ్ తల్లి. 'వీడి లవ్ స్టోరీ తెలుసా?' అని అడిగింది తనూజ. "సూత్రధారి పాత్రధారి ఆవిడే. వాళ్ళే రాత్రి పగలూ మాట్లాడుకునే వాళ్ళు" అని చెప్పాడు కళ్యాణ్. "కావాలని ఆ అమ్మాయిని దూరం పెట్టలేదు" అని చెప్పింది ఆవిడ. అలాగే కళ్యాణ్ ను హాస్టల్ లో తప్పక పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. "మొన్నటి వరకు లక్ష్మణరావు, లక్ష్మీ కొడుకు కళ్యాణ్ అనేవారు. ఇప్పుడు కళ్యాణ్ తల్లిదండ్రి లక్ష్మీ, లక్ష్మణరావు" అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. తనూజా కళ్యాణ్ తల్లికి చీర పెట్టి పంపింది. "ఈ హౌస్ లో అందరికంటే ఎక్కువ నువ్వు బాగా చూసుకుంటావ్. మరో 4 వారాల తర్వాత నీ దారి నీది, నా దారి నాది. మీ అమ్మను ఇక్కడే కలిశాను కాబట్టి చీర పెట్టాను" అని చెప్పింది కళ్యాణ్ తో.
మళ్ళీ మొదలైంది
ఇక తర్వాత నన్నెందుకు దూరం పెడుతున్నారు అని భరణితో గొడవ పడింది దివ్య. రాత్రి తనూజా కాలు వాపు రావడంతో ఆమె కాలు పట్టుకుని మసాజ్ చేశాడు భరణి. "మీకే ఒకరు మసాజ్ చేయాలి. మీరు ఇంకొకరికా?" అని అడిగింది దివ్య. "చేయాలి అన్పించింది కాబట్టి చేస్తున్నా అని చెప్పొచ్చు కదా. తనెందుకు అలగాలి?" అని తనూజా ఫైర్ అయ్యింది. "కోపం ఎందుకు దివ్య" భరణి అడగ్గా... "మీకు బ్రెయిన్ లేదా? మీకు చెయ్యి నొప్పిగా లేదా? అక్కడున్న పర్సన్ ను కాదు మీ చేతిని చూస్తున్నా. అది అర్థం చేసుకునే బ్రెయిన్ ఎవ్వరికీ లేకపోతే అది నా తప్పు కాదు. ఆమె కన్వీనియెంట్ గా వచ్చి వెళ్ళడం నాకు నచ్చదు" అంటూ సమాధానం చెప్పింది దివ్య.
తరువాత రీతూ చౌదరి తల్లి పవన్, కళ్యాణ్, తనూజా, డెమోన్ ఫ్రీజ్ అంటూ హౌస్ లోకి అడుగు పెట్టింది. తల్లిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంది రీతూ. "నేను చెప్పింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి?" అంటూ చపాతీ కర్ర అడిగింది. "గేమ్ బాగా ఆడుతున్నావ్. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావ్. టాప్ 5లో ఉన్నావ్. గట్టిగా ఆడు. ఫోకస్ మొత్తం గేమ్ పై మాత్రమే పెట్టు. తనూజా నీకు బాగా సపోర్ట్ చేసింది" అంటూ రీతూకి జాగ్రత్తలు చెప్పింది. చివరగా డెమోన్ ను కలిసి వెళ్ళిపోయింది. కానీ తన గురించి ఆవిడ ఏదో అన్నదని డెమోన్ హర్ట్ అయ్యాడు.
బాండింగ్స్ పై భరణి కూతురు కామెంట్స్
సాయంత్రం భరణి కూతురు హనీ వచ్చింది. "రిబ్స్ కి తగిలింది కదా ఎలా ఉంది" అంటూ ఎమోషనల్ అయ్యింది. తనూజాను హగ్ చేసుకుని "మీ ఇద్దరి బాండ్ ను బాగా ఎంజాయ్ చేస్తాం" అని ప్రశంసలు కురిపించింది. "అందరూ బాగున్నారు. మీకు గాయం అయినప్పుడు బాగా టెన్షన్ పడ్డాము. బాగా ఆడుతున్నారు. మేము మీ కూతుర్లుగా ప్రౌడ్. మిమ్మల్ని కెప్టెన్ గా చూడాలని ఉంది. లాస్ట్ టైమ్ నామినేషన్ లో బాగా చెప్పారు. ఆ ఫైర్ కావాలి" అని చెప్పింది. తన తండ్రికి గాయం అయినప్పుడు జాగ్రత్తగా చూసుకున్నందుకు దివ్యకు థ్యాంక్స్ చెప్పింది. అయితే "ఆ కమాండింగ్ వాయిస్ తగ్గించండి" అని రిక్వెస్ట్ చేసింది. "అందరూ బాండింగ్ అంటున్నారు. కానీ మీరు ఇంట్లో ఎలా ఉంటారో మాకు తెలుసు. ఈ హౌస్ లో మమ్మల్ని చూసుకుని అలాగే ఉంటున్నారు. కొంచం కమాండ్ చేసే వాళ్లను దూరం ఉండండి" అని చెప్పి వెళ్ళిపోయింది హనీ.