బిగ్ బాస్ 9 తెలుగు డే 63లో 'పెద్ది' మూవీ సాంగ్ 'చికిరి చికిరి'తో గ్రెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. 'సిట్యుయేషన్ ఎలా ఉన్నా హాయిగా నవ్వుతూ... నీకు తగ్గట్టుగా అన్నీ మార్చుకుంటావ్" అంటూ సంజనపై ఎపిసోడ్ మొదట్లోనే ప్రశంసలు కురిపించారు. అలాగే పాలు దొంగతనం చేసిన సుమన్ పాలతోనే సేవ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు? ఎగ్జిట్ కు దగ్గరగా ఎవరు వెళ్తున్నారు ? రీజన్ తో సహా చెప్పమని నాగ్ అడిగారు. సుమన్ శెట్టి ముందుగా వచ్చి ఇమ్మాన్యుయేల్ ను టాప్ లో, సాయికి ఆడే ఛాన్స్ రాకపోవడం వల్ల ఎగ్జిట్ అవుతాడేమో అని చెప్పారు. తరువాత సుమన్ శెట్టి దొంగతనం వీడియో వేసి అందరినీ నవ్వించారు.
కళ్యాణ్ ను బకరా చేసిన దివ్య"నిన్ను నీ టీమ్ తీసేసినా, రెబల్స్ ఎవరో తెలిసినా... ఇచ్చినమాట కోసం వాళ్లను బయట పెట్టకుండా కంటెండర్స్ ను చేశావ్ చూడు... టీం స్పిరిట్ అంటే అది. అద్భుతంగా ఆడావు" అంటూ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేశారు నాగ్. "కానీ ఫైనల్ కంటెండర్ లిస్ట్ లో తీసేశారు కదా. ఎలా అన్పించింది?" అని కళ్యాణ్ ను అడిగారు. "తనూజాను తియ్యను అని చెప్పింది. కానీ తీయడం బాధగా అన్పించింది" అని చెప్పాడు. దీంతో దివ్య కెప్టెన్సీ టాస్క్ మొదటి నుంచి తనూజాను తీసేయమని అందరికీ చెప్పిన వీడియోను ప్లే చేశారు. "ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి, ఓటమి కోసం కాదు" అంటూ భరణిని కాకుండా కళ్యాణ్ ను కావాలనే కెప్టెన్సీ టాస్క్ నుంచి దివ్య తొలగించిన వీడియోను చూపించారు. "బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి?" అంటూ అసలేం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. "నీ పేరు ఎందుకు చెప్పలేదు?" అంటూ భరణిని అడిగారు డైరెక్ట్ గా. "నువ్వు అక్కడ కంఫర్ట్ గా కూర్చున్నావు. నువ్వు ఎలాగూ స్టాండ్ తీసుకోవు కూర్చో" అంటూ కౌంటర్ వేశారు భరణిపై. "నీ మాట, ఆట, నిబద్ధత నచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా మన పక్షాన నిలబడతాడు అన్న భరోసాను వాళ్ళకి ఇవ్వు" అంటూ కళ్యాణ్ కు బూస్ట్ ఇచ్చారు నాగ్. కాగా కళ్యాణ్ తనూజాకు ట్రోఫీ - భరణికి ఎగ్జిట్ ఇచ్చాడు.
దివ్యకి నాగార్జున క్లాస్ భరణి వచ్చి ఇమ్మాన్యుయేల్ ను టాప్ లో, సాయిని ఎగ్జిట్ లో పెట్టాడు. "ఒరిజినాలిటీ దాచుకోకు. ఇది సెకండ్ గోల్డెన్ ఛాన్స్" అంటూ భరణికి సలహా ఇచ్చారు నాగ్. ఇక ఆ తరువాత సాయి వచ్చి తనూజాను టాప్ లో, భరణిని ఎగ్జిట్ లో - సంజన వచ్చి డెమోన్ ను టాప్ లో, గౌరవ్ ను ఎగ్జిట్ లో - ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ ను టాప్ లో, సాయిని ఎగ్జిట్ లో - రీతూ తనూజాను టాప్ లో, నిఖిల్ ను ఎగ్జిట్ లో - డెమోన్ ఎగ్జిట్ లో సాయి, ఇమ్మాన్యుయేల్ ను టాప్ లో - నిఖిల్ తనూజాకు టాప్, సాయికి ఎగ్జిట్ -గౌరవ్ టాప్ తనూజాకు, ఎగ్జిట్ లో సంజనకు ఇచ్చారు.
దివ్య వచ్చి ఇమ్మూనీ టాప్ లో, గౌరవ్ ను ఎగ్జిట్ లో పెట్టింది. "నువ్వు వచ్చినప్పుడు భరణిని టాప్ లో, ఇప్పుడు ఇమ్మూను టాప్ లో పెట్టావ్. రీజన్ ఏంటి?" అని దివ్యను అడిగారు నాగార్జున. "ఆయన శాక్రిఫైజ్ ఎక్కువ చేస్తారు. తనకు తాను స్టాండ్ తీసుకోరు" అంటూ చెప్పింది. ఆ తరువాత తనవైపు నుంచి అన్నింటికీ స్ట్రాటజీ అంటూ వివరణ ఇచ్చింది. అయితే "భరణిని తీస్తేనే ఇంకా ఎవ్వరికీ డౌట్ రాదు కదా? నీకోసం నిలబడ్డ మనిషికి మాట ఇచ్చి తప్పావు. నీ మూలంగానే కెప్టెన్ అయ్యాడు అనుకుంటున్నావా? నీ క్రెడిబిలిటినే పోతుంది. తనూజాకు తీయమని ఎందుకు గౌరవ్ కి చెప్పావ్?" అంటూ ఆమె ఆట తీరు గురించి హౌస్ మేట్స్ ను ఒపీనియన్ అడిగారు నాగార్జున. చివరికి "తనకు సపోర్ట్ చేయమని అడగడం కరెక్టా, లేక అవతలి వాళ్ళను తీయడం కరెక్టా? అనేది ఆమె ఆలోచించుకోవాలి. ఇంకొకరు ఓడిపోవాలని ప్రయత్నిస్తే నువ్వు ఎక్స్పోజ్ అవుతావు" అని చెప్పేశాడు.
తనూజా ఎగ్జిట్ లో భరణిని, టాప్ లో ఇమ్మాన్యుయేల్ ను పెట్టింది. ట్రోఫీ దగ్గరగా ఇమ్మూ 5, తనూజాకు 5 ఓట్లు రాగా... భరణి, సాయి ఎగ్జిట్ కు దగ్గరగా ఉన్నారు. "రామూ చేతిమీద ఎవరిని నామినేట్ చేయాలో రాసి చూపించడం కరెక్టా? అది మ్యానిపులేషన్" అంటూ తనూజాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. సాయి, భరణి టీం లీడర్లుగా ఓ ఫన్ టాస్క్ పెట్టారు. అందులో సాయి టీం విన్ అయ్యింది. ఎపిసోడ్ చివర్లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. గోల్డెన్ బజర్ పవర్ ను తనూజా ఇద్దరికీ వాడలేదు. సాయి వెళ్తూ డెమోన్, సుమన్ శెట్టి కరెక్ట్... భరణి, రీతూ, దివ్య రాంగ్ అని చెప్పాడు.