బిగ్ బాస్ సీజన్ 9 డే 37 ఉదయాన్నే ఫన్ తో మొదలెట్టారు హౌస్ మేట్స్. అలా తెల్లారింది లేదో ఇలా రచ్చ మొదలెట్టాలనే ప్లాన్ వేశారు మాధురి, సంజన. కిచెన్ లో "నా స్టిక్కర్స్ కనిపించట్లేదు. బాత్రూమ్ క్లీనింగ్ ఎవరెవరు రమ్మనండి" అంటూ మొదలెట్టింది మాధురి. "సంజన నేను డస్ట్ బిన్ లో వేసాను. చాలాసేపు అక్కడే ఉంటే డిసిప్లిన్ అని పారేశాను" అని చెప్పింది. "దొంగతనం కోసం చేశారా? గుడ్డు దొంగతనం చేశారు. ఇది కూడా అలాగే చేశారా? మీకు అది ఫన్ ఏమోగానీ నాకు కాదు. మినిమం బేసిక్ సెన్స్ కూడా ఉండదు మనుషులకు. కామన్ సెన్స్ లేదు" అంటూ ప్రాంక్ పేరుతో మాటలు వదిలేసింది మాధురి. వెంటనే "కట్ కట్ కట్.... తనే చెప్పింది గొడవ పడదాం అని. ఇది ప్రాంక్" అంటూ నవ్వేసింది సంజన.
దివ్య వర్సెస్ మాధురి... లాజిక్కేది ?"ఈ హౌస్ లో అందరూ మెంటల్ గాల్లే. ప్రాంక్ చేయడం వరకు ఓకే. కానీ సంజనపై ఆమెకున్నదంతా తీర్చుకుంది" అంటూ కళ్యాణ్ తో దగ్గర కక్కేసింది దివ్య. కాసేపటికే "నన్ను అడగకుండా కర్రీని ఎందుకు వేసుకున్నారు? నేను రేషన్ మేనేజర్ ను కదా? అని దివ్వెల మాధురిని అడగడమే దివ్య తప్పయింది. "నేను అమ్మను. నాకు తెలుసు. కొంచెమే కర్రీ వేసుకున్నా. నేను అడ్జస్ట్ చేయగలను. నేనే వంట చేశాను కాబట్టి తిన్నాను. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు గొడవ పడాలని చూస్తున్నావా?" అంటూ సంబంధం లేకుండా సమాధానం చెప్పింది మాధురి. "నేను ఎందుకు గొడవ పడతా. నా పర్మిషన్ లేకుండా కామన్ ఫుడ్ తినకూడదు" అని దివ్య అంటే... "నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. అసలు తినడమే మానేస్తా. నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు. మార్చండి" అంటూ కెప్టెన్ ను ఇన్వాల్వ్ చేసింది.
"రూల్ అనేది ఒకటి ఉంది" అంటూ అంటూ కళ్యాణ్ నచ్చజెప్పబోతే... "ఎవరికి ఎంత పెట్టాలో, ఎలా షేర్ చేయాలో నాకు తెలుసు. ఒక దోశను ఇంత కర్రీతో తింటే అంత సీన్ ఎందుకు?" అంటూ అడ్డగోలుగా వాదించింది మాధురి. అంతలోనే దివ్య "నాకు మాట్లాడడం ఇష్టం లేదు అంటే... నాకు మీతో బాండింగ్ అక్కర్లేదు. కామన్ విషయాల్లో అడగాల్సిందే" అని దివ్య సమాధానం.చెప్పింది. అంతే "ఎవడికి కావాలి బాండింగ్... నాన్నా నాన్నా అంటూ ఇక్కడ బాండింగ్ కోసం కాదు, గేమ్ కోసం వచ్చాను. ఏయ్ ఏంటి గొడవ పడుతున్నావ్" అంటూ నోరేసుకుని పడిపోయింది మాధురి. అంతేకాదు "వైల్డ్ కార్డ్స్ నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు. మార్చమని అడగండి" అంటూ.ఆర్డర్ వేసింది.
మరోవైపు ఇమ్మాన్యుయేల్ అయేషా ఈ గొడవ గురించి డిస్కషన్ పెట్టారు. అంతలోనే "నాకు బోర్ కొడుతోంది ఎంటర్టైన్ చేయండి" అంటూ వచ్చింది మాధురి. "మీరు భరతనాట్యం టీచర్ కదా నేర్పండి" అనగానే... సంజన, అయేషా, ఇమ్మాన్యుయేల్, నిఖిల్, శ్రీనివాస్ కు నేర్పించింది. మరోవైపు "రేషన్ మేనేజర్ గా నేను అన్నీ పెట్టేశాను. ఆమె అంటే నేను బాధ పడే రోజు ఇంకా రాలేదు. కాన్ఫ్లిక్ట్ కు నేను కారణం కాదు కదా. మీరు చూశారా? మీకు దగ్గరైన వారితో ఏదో ఒకరకంగా పెట్టుకుంటోంది. నాతో గొడవ, తనూజను దగ్గరకు తీసుకుంటోంది" అంటూ భరణికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది దివ్య. అంతలోనే గౌరవ్ కి తెలుగు నేర్పించే టాస్క్ ను అయేషాకు అప్పగించాడు బిగ్ బాస్.
తినడానికా అమ్మడానికా ?రమ్య తనకు వచ్చిన ఫుడ్ పవర్ తో ఏకంగా ఓ పెద్ద లిస్ట్ నే అడిగింది. "గుడ్డు పెసరట్టు ఉప్మా, కాఫీ, పూరీ, మైసూర్ బజ్జి టిఫిన్ గా... లంచ్ లోకి చికెన్ జాయింట్స్, ఎగ్ బిర్యానీ... ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్ ఐస్ క్రీమ్, నైట్ వెజ్ టిక్కా పిజ్జా, మిక్చర్ ప్యాకెట్, 4 ఎగ్ ట్రేస్, బనానా చిప్స్, 2 కేజీల మోతీచూర్ లడ్డూలు, రా మ్యాంగో, నాన్ వెజ్ పికిల్స్"ను పంపమంటూ రిక్వెస్ట్ చేసింది.
రీతూ, అయేషాకి అంట్ల గొడవ మొదలైంది. మాధురి మధ్యలో దూరి కామెంట్స్ చేసింది. అయేషాకి అందరూ కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే, టార్గెట్ చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరూ కూర్చుని ఈ గొడవను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. సైలెంట్ గా వెళ్లి సంజన ఆ గిన్నెను కడిగేసింది.