ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ 8 తెలుగు గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఈ రియాలిటీ షోకు వెల్‌కమ్ చెప్పేశారు. నేచర్, యానిమల్ థీమ్, ఫ్లవర్ డెకరేషన్ ఆకర్షణియంగా ఉంది. ఈసారి హౌజ్ గోల్డెన్ హౌజ్, లయన్ హౌజ్, పికాక్ హౌజ్ అంటూ లగ్జరీగా ముస్తాబైంది. మొదటి కంటెస్టెంట్స్‌ని సస్పెన్స్‌లో ఉంచిన ఈ షో తొలి కంటెస్టెంట్‌గా 'కృష్ణ ముకుంద మురారి' ఫేం యష్మీ గౌడ వచ్చింది. ఐయామ్ ఏ నాటి నాటి గర్ల్ అంటూ ఆమె గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
వచ్చిరాగానే రోజ్ ఇచ్చి హోస్ట్ నాగ్‌ని పడేసింది. ఆయన స్టైల్‌కి, లుక్‌కి, యాంకరింగ్‌కి ఒక్కొక్కొ రోజ్ ఇస్తూ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పానంటూ ఆనందంగా చెప్పింది. తలనొప్పి ఎందుకని వదిలేసానంటూ వెల్లడించింది. ఇక కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. అసలు పెళ్‌లే చేసుకోనని చెప్పి షాకిచ్చింది. పెళంటే రిస్క్ అంటూ ఊహించన కామెంట్స్. ఇక వంట పెద్దగా రాదని చెప్పింది. తన ఫేవరేట్ ఫుడ్ బిర్యానీ అని చెప్పిన బిర్యానీ లేకుండ అసలు ఉండేలేనని చెప్పింది.
హౌజ్‌లో నా స్ట్రటజీ అదే
ఇక తనని బాగా టిగ్గర్ చేసేఅంశం కూడా బిర్యానీనే అంది. బిర్యానీ తినకపోతే అసలుతన మూడ్ బాగోదని, తినేవరకు నా బ్రయిన్ అంతా డిస్ట్రర్బ్‌గా ఉంటుందంది. ఇక హౌజ్‌లోకి వెళుతూ ఆగమన్న హోస్ట్ నాగ్ పార్ట్‌నర్‌తోనే వెళ్లాలంటూ షాకిచ్చాడు. తనకు నచ్చిన కలర్ సెలక్ట్ చేసుకోమనా.. నేను డేంజర్ కాబట్టి బ్లాక్ అంటూ షాకిచ్చింది. హోస్ట్ నాగ్ హౌజ్‌లో తన స్ట్రాటజీ ఏంటని అడగ్గా.. అసలు తనకు అలాంటి ఆలోచనే లేదంది. బ్లాంక్ మైండ్‌తో వెళుతున్నాని, పరిస్థితులను బట్టి ముందుకు వెళ్తానంది. అసలు తనకు స్ట్రాటజీ అంటేనే తెలియదు అని చెప్పింది. ప్రస్తుతం యష్మీ గౌడ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.