నాలుగో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రి ఇచ్చేసింది 'కృష్ణ ముకుంద మురారీ' ఫేం ప్రేరణ వచ్చేసింది. చూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ అంటూ ఎంట్రీ ఇచ్చేసింది. కృష్ణ ముకుంద మురారీ సీరియల్లో తనదైన నటన, అమాయకపు ఎక్స్‌ప్రేషన్స్‌తో ఆకట్టుకున్న ప్రేరణ బయట మాత్రం రౌడీ బేబీలా ఉంటుంది. బెసిగ్గా స్పోర్ట్స్‌ పర్సన్‌ అయిన ప్రేరణ హౌజ్‌లో తన ఆటలతో కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపిస్తానంటుంది. తన స్పీడ్‌, ఆటను తట్టుకోలేక హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ ఏమైపోతారో అనే భయంగా ఉందంటూ తనతో జాగ్రత్త అంటూ హెచ్చరించింది. తన బడ్డీగా విష్ణుతో హౌజ్‌కి అడుగుపెట్టింది. 


ప్రేరణ వచ్చిరాగానే మీరు అసలైన మన్మథుడు అంటూ హౌస్ట్‌ నాగ్‌కు కితాబిచ్చింది. తన చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాననని, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారంటూ చెప్పింది. ఇక తాను హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పింది. ఇద్రదు కలిసి ఓ రాత్రి చేసిన హంగామా గురించి రివీల్‌ చేసింది. ఇక ఇటవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లయి ఎనిమిది నెలలే అవుతున్నా భర్తను సింగిల్‌గా వదిలేసి బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో అడుగుపెట్టింది. మరి సీరియల్‌లో తనే గెలిచినట్లు ఇక్కడ కూడా గెలుపు దిశగా అడుగులు వేస్తుందేమో చూడాలి!