Nikhil And Gautham Big Fight And Gangavva as Worst Sanchalak: బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం మెగా చీఫ్ కోసం టాస్క్ మొదలైంది. ఈ టాస్కులో కొట్టుకోవడం మాత్రమే తక్కువైంది. నిఖిల్ కంట్రోల్ తప్పి పోయాడు. ఆడవాళ్లను బొమ్మల్లా లాగి పాడేశాడు. ఇక నిఖిల్, గౌతమ మధ్య కొట్టుకునే వరకు వెళ్లింది. రా, బే అంటూ ఇద్దరికిద్దరూ హద్దులు దాటేశారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్‌లో గంగవ్వను సంచాలక్‌గా పెట్టిన బిగ్ బాస్‌కు బుద్ది లేదనిపిస్తుంది. ఇక ఏ కంటెస్టెంట్ అందుబాటులో లేడని ఆమెను పెట్టాడేమో కానీ అది కూడా వరెస్ట్ నిర్ణయమే. ఇక ఈ వారం ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.


నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. నేను బాధపడుతూ ఉంటే నాకు సపోర్ట్ చేయలేదంటూ పృథ్వీ గురించి విష్ణు ప్రియ హర్ట్ అయింది. విష్ణు కాస్త లో ఉంది.. ఆమెకు మోరల్ సపోర్ట్ ఇవ్వాలని నిఖిల్ అన్నాడు. ఇక ఉదయం పూట చపాతీల గురించి గౌతమ్‌తో నయని వాగ్వాదానికి దిగింది. అక్కా అని ఎలా పిలుస్తాడు.. క్రష్ అని నా దగ్గరకు వచ్చాడు.. మళ్లీ అక్కా అని అంటాడు అంటూ గౌతమ్ గురించి ప్రేరణ వద్ద యష్మీ చెప్పుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ సూపర్ మార్కెట్‌లోకి విష్ణు ప్రియ రేషన్ తెచ్చింది. మధ్యలో యష్మీ, ప్రేరణలు దొంగతనంగా పట్టుకొస్తే.. వాటిని లోపల పెట్టేయమని బిగ్ బాస్ ఆదేశించాడు.


అనంతరం ఎగ్ దోశ గురించి గొడవ జరిగింది. ఎగ్ దోశ ప్రేరణ వేయలేనని చెప్పడంతో నిఖిల్ హర్ట్ అయ్యాడు. నిఖిల్ కోసం యష్మీ ఎగ్ దోశ వేసిచ్చింది. అయినా మొండిగా తినకుండా ఉండిపోయాడు. అనంతరం బిగ్ బాస్ ఓ ప్రకటన చేశాడు. ఇక ఇంట్లో రాయల్, ఓజీ క్లాన్స్ ఉండవని, అంతా ఒకే క్లాన్ అని.. అది కూడా బీబీ క్లాన్ అని అన్నాడు. ఈ వారం మెగా చీఫ్ అయ్యేందుకు బీబీ ఇంటికి దారేది? అనే టాస్క్ ఆడాల్సి ఉంటుందని అన్నాడు. చాలెంజ్లో గెలిచి.. డైస్ రోల్ చేసి.. ఇంటికి దగ్గర్లో లేదా ఇంట్లోకి వెళ్లిన కంటెస్టెంట్‌కు మెగా చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అన్నాడు.ఇక ప్రతీ ఛాలెంజ్‌లో గెలిచిన తరువాత ఓడిన టీంకు ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. అలా ఒక టీంకు రెండు ఎల్లో కార్డులు వస్తే.. అందులోంచి లీడర్ నిర్ణయం తీసుకుని ఓ కంటెస్టెంట్‌ను తీసేయాల్సి ఉంటుందని చెప్పాడు.


ఇక ఈ ఆట కోసం నాలుగు టీంలను డివైడ్ చేశాడు. అందులో ఒకరు లీడర్.. ఇద్దరు ఫాలోవర్లుగా ఉంటాడని చెప్పాడు. దీంతో రెడ్ టీంలో యష్మీ లీడర్‌గా.. ప్రేరణ, గౌతమ్‌లు ఉన్నారు. బ్లూ టీంలో హరితేజ లీడర్‌గా.. నిఖిల్, అవినాష్ ఫాలోవర్లుగా ఉన్నారు. ఎల్లో టీంలో పృథ్వీ లీడర్‌గా రోహిణి, నయనిలు ఫాలోవర్లుగా ఉన్నారు. ఇక గ్రీన్ టీంలో నబిల్ లీడర్‌గా.. విష్ణు, టేస్టీ తేజలున్నారు. ఇక మొదటి ఛాలెంజ్ మంచు మనిషి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో బ్లూ టీం విన్ అయింది. డైస్ రోల్స్ చేయగా.. 6, 3 పడ్డాయి. ఆరు హరితేజ తీసుకుంది. 3 అవినాష్‌కు ఇచ్చింది. ఇక ఎల్లో కార్డుని రెడ్ టీంకు ఇచ్చింది.


అనంతరం రెండో ఛాలెంజ్‌లో పానిపట్టు యుద్దం అని టాస్క్ ఇచ్చాడు. ఇందులో గంగవ్వను సంచాలక్‌గా పెట్టాడు. గంగవ్వ నిర్ణయాలతో అంతా గందరగోళంగా మారింది. అసలు ఆమెను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చారు? అన్నది అర్థం కాదు. ఇక ఈ ఆటలో ఇద్దరు కంటెస్టెంట్లు వారి ట్యాంకులోని నీళ్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వారు బజర్ మోగిన ప్రతీ సారి అక్కడ గీసిన ఆరెంజ్ లైన్‌ను ముందుగా దాటి.. వాటర్‌ను తగ్గించేందుకు ప్రయత్నించుకోవచ్చు. అయితే ఈ లైన్‌ను ముందుగా దాటిన ఇద్దరు మాత్రమే వాటర్ ట్యాంక్‌లోని నీళ్లను తగ్గించేందుకు వెళ్లాల్సి ఉంటుంది.


Also Read: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 58 రివ్యూ: విష్ణుప్రియని ఇంకెన్నాళ్లు భరించాలో... ట్విస్టుల మీద ట్విస్టులు... గంగవ్వ వాగుడు



కానీ ఇక్కడ గంగవ్వ సంచాలక్.. ఆమెకు ఏ విషయం సరిగ్గా తెలియదు.. అసలు ఎవరు ముందుగా గీత దాటారో చూసుకోలేకపోతోంది. దీంతో పృథ్వీకి మండిపోయింది. సంచాలక్‌ను మార్చేయండని ఫైర్ అయ్యాడు. ఇక రెండు బజర్‌ల తరువాత బ్లూ టీం తప్పుకోవాల్సి వచ్చింది. నీటి మట్టం తక్కువ అవ్వడంతో హరితేజ టీం బయటకు వచ్చింది. దీంతో హరితేజను సంచాలక్‌గా పెట్టేశాడు. ఆ టైంలో నిఖిల్, నబిల్ గీత దాటి ముందుకు వచ్చాడు. ఇక నిఖిల్ అంతకు ముందు గౌతమ్‌తో జరిగిన గొడవతో.. వాళ్ల టీంను టార్గెట్ చేశాడు.


యష్మీ, ప్రేరణను నిఖిల్ లాక్కుపోయాడు. వాళ్ల వాటర్‌ లెవెల్‌ను తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ వాటర్ ట్యాంక్‌ని గానీ, మనుషుల్ని గానీ అలా పట్టుకోకూడదు. కానీ నిఖిల్ అక్కడ కంట్రోల్ తప్పాడు. దీంతో నిఖిల్ దాడికి యష్మీ, ప్రేరణలు కన్నీరు పెట్టేసుకున్నారు. గౌతమ్, నిఖిల్ మధ్య కొట్టుకునేస్థాయికి వాగ్వాదం వెళ్లింది. రా, బే అంటూ తిట్టుకున్నారు. కాసేపు ఉంటే కొట్టేసుకునేలానే అనిపించింది. మరి మున్ముందు ఈ టాస్కు ఇంకెంత ఫిజికల్‌గా మారుతుందో చూడాలి.


Also Read: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ 57 రివ్యూ: పృథ్వీ గురించి అందరూ పడి చస్తున్నారా?.. కంటెస్టెంట్లను రోస్ట్ చేసిన సమీరా భరద్వాజ్