Bigg Boss 8 Telugu Episode 26 Day 25 written Review: బిగ్ బాస్ ఇంట్లో రూల్స్ గురించి కంటెస్టెంట్లు మాట్లాడాలి, ఎదురించే అవకాశం ఉండదు. కానీ ఆడియెన్స్‌కు మాత్రం అలాంటి రూల్స్ ఉండదు. బిగ్ బాస్‌ను తిట్టే వాళ్లు తిడతారు.. పొగిడే వాళ్లు పొగుడుతారు. అయితే బిగ్ బాస్‌ను బండ బూతులు తిట్టి బయటకు వచ్చేశాడు అభయ్. బిగ్ బాస్ కాదు బయాస్డ్ బాస్ అని అన్నాడు. అది నిజమే అని గురువారం నాటి ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. శక్లి క్లాన్ ఓడిపోతే.. అందులోంచి ఓ సభ్యుడ్ని పక్కన పెట్టేసే అధికారాన్ని శక్తి క్లాన్‌కు ఇచ్చాడు బిగ్ బాస్.


అదే కాంతార టీం ఓడిపోతే... ఓ సభ్యుడ్ని తీసేస అధికారాన్ని కాంతార టీంకు కాకుండా శక్తి క్లాన్‌కు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నిర్ణయం తీసుకోవడంతో నిఖిల్ శక్తి క్లాన్ తమ స్ట్రాటజీని వాడింది. ఫస్ట్ టాస్క్ ఓడిన తరువాత వీక్ అని చెప్పి మణికంఠను లేపేశారు. సోనియా, యష్మీ, పృథ్వీ అందరూ కూడా మణిని తీసేద్దామని అన్నారు. అదే కాంతార టీంకు వచ్చే సరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నబిల్‌ను పక్కన పెట్టేశారు. అక్కడే నిఖిల్ క్లాన్ రెండు నాల్కల ధోరణి కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ పక్షపాత ధోరణి కూడా అక్కడే కనిపిస్తోంది.


బేబీ ట్యూన్ అనే టాస్కులో సోనియా టైంకి రాకపోయినా వచ్చిందని నిఖిల్ చెప్పాడు. అప్పుడు కూడా బిగ్ బాస్ లైట్ తీసుకున్నాడు. ఇక మణికంఠ సంచాలక్‌గా ఉన్న టాస్కులో కూడా పృథ్వీ బెలూన్ పగిలిపోయింది. నబిల్ ముందుగా వదిలేసినా.. బెలూన్ మాత్రం పగలేదు. ఆ టాస్కులో బెలూన్ పగిలితే ఓడినట్టుగా రూల్ ఉంది. కానీ ఆ బెలూన్ పగిలే రూల్‌ను కంటెస్టెంట్లు కూడా పట్టించుకోలేదనిపిస్తుంది. దీనిపై నాగ్ ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.


Also Read: గ్లామర్ పెంచుతున్న బిగ్ బాస్... వైల్డ్ కార్డు ఎంట్రీలో నలుగురు అందాల భామలు, హౌస్‌లోకి వచ్చేది ఆ రోజేనా?



కాంతార టీం నుంచి నబిల్‌ను తీసే నిర్ణయాన్ని శక్లి క్లాన్ చీఫ్ నిఖిల్ చెప్పడంతో కాంతార టీం షాక్ అయింది. 'అనర్హుడిని పక్కన పెట్టేయమంటే... టాస్కులు ఆడే వాడ్ని పక్కన పెడతారా? ఇదెక్కడి న్యాయం' అని సీత, కాంతార టీం సభ్యులు అడిగారు. 'మీ టీం నుంచి మణికంఠను తీస్తారు. అదే మా టీంకు వచ్చే సరికి నబిల్‌ను తీస్తారా? అదెలా?' అంటూ నిఖిల్‌ను సీత నిలదీసింది. 'మణిని మేం తీయలేదు... అతడే త్యాగం చేశాడు' అని శక్తి క్లాన్ చెప్పింది. దానికి 'నో నో' అంటూ మణికంఠ వివరణ ఇవ్వబోయాడు.


దీంతో పృథ్వీ, యష్మీ, సోనియా అంతా కలిసి మణికంఠను బ్రెయిన్ వాష్ చేశారు. ఏడ్పించారు. 'నువ్వే కదా త్యాగం చేశావ్... నువ్వు నీ పాయింట్లు చెప్పి పోరాడితే క్లాన్ నిర్ణయం మార్చుకునేదేమో' అని సోనియా మాట మార్చింది. కానీ మణికంఠ వీక్ అని చెప్పి తీసేద్దామని సోనియా, యష్మీ, పృథ్వీ, నిఖిల్ ఫిక్స్ అయ్యారు. కానీ చివరకు మణికంఠను టార్గెట్ చేశారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజిలో భాగంగా శక్తి క్లాన్ రెండు టాస్కులు గెలిచి రెండు వైల్డ్ కార్డులను ఆపగలిగింది. కాంతార టీం ఒక టాస్క్ గెలిచి ఒక వైల్డ్ కార్డుని ఆపగలిగింది. దీంతో ఈ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ముగిసిందని బిగ్ బాస్ తెలిపాడు. అంటే ఇంట్లో 9 వైల్డ్ కార్డులుంటాయని అర్థం అవుతోంది. మరి వీరిని ఎప్పుడు ఇంట్లోకి ప్రవేశ పెడతారో చూడాలి.


Also Read: మణికంఠ సాఫ్ట్ టార్గెట్? మగాడిగా లెక్కేయడం లేదే... ఆ ముగ్గురికి అంతా వ్యతిరేకం - బిగ్ బాస్ ఎపిసోడ్ 25 రివ్యూ