Bigg Boss 8 Telugu Episode 24 Day 23: బిగ్ బాస్ ఇంట్లో ‘సుత్తి’ టాస్కు, మజా ఇచ్చిన మాటల యుద్దం

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఈ రోజు సుత్తి టాస్ లో విన్ అయి నెక్ట్స్ చీఫ్‌గా నిలచింది సీత. టాస్క్ తరువాత జరిగిన యష్మీ, సోనియా మాటల యుద్దం ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది.

Continues below advertisement

Bigg Boss 8 Telugu News Updates : బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇక శక్తి క్లాన్‌కు చీఫ్ నిఖిల్ ఉన్నాడు. కానీ కాంతార టీంకు చీఫ్ లేకుండా పోయాడు. అందుకే బిగ్ బాస్ తన కంటెస్టెంట్లకు ఆఫర్ ఇచ్చాడు. నిఖిల్ మినహా మిగిలిన పది మంది కంటెస్టెంట్లకు చీఫ్ పదవికి పోటీ పడే ఛాన్స్ ఇచ్చాడు. నిఖిల్ మొదటగా సుత్తి పట్టుకుని.. పది మంది కంటెస్టెంట్లలోంచి ఓ కంటెస్టెంట్ ఫోటోను పగలగొట్టమని అన్నాడు. ఎవరికైతే చీఫ్ అయ్యే అర్హత లేదని భావిస్తారో వాళ్ల ఫోటో పగలగొట్టమని అన్నాడు. అలా పోటీ నుంచి తప్పుకున్న కంటెస్టెంట్ కూడా సుత్తిని పట్టుకునేందుకు పోరాడి.. తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు సుత్తి ఇవ్వొచ్చని చెప్పాడు.

Continues below advertisement

అలా మొదటగా నిఖిల్ సుత్తి పట్టుకుని ఆదిత్యను రేసు నుంచి తప్పించాడు. ఆ తరువాత ఆదిత్య సుత్తి పట్టుకుని.. పృథ్వీకి ఇస్తే.. మణికంఠ బొమ్మను పగలగొట్టి టాస్క్ నుంచి తప్పించాడు. అలా నెక్ట్స్ సుత్తి పట్టుకునేందుకు నిఖిల్, ఆదిత్య, మణికంఠ ట్రై చేశారు. కానీ నిఖిల్ సుత్తి పట్టుకుని సీతకు ఇస్తే.. యష్మీని తప్పించింది. ఆ తరువాత యష్మీ, నిఖిల్, మణి, ఆదిత్య సుత్తి పట్టుకునే ప్రయత్నం చేశారు. మళ్లీ నిఖిల్ సుత్తి పట్టుకుని సోనియాకు ఇచ్చాడు. ఆమె నబిల్‌ను ఆట నుంచి తప్పించింది.

Read Also: చీఫ్ టాస్క్ తో అగ్నికి ఆజ్యం పోసిన బిగ్ బాస్... కొత్త చీఫ్ ఎవరంటే?

ఆ తరువాత మళ్లీ నిఖిల్ సుత్తి పట్టుకుని నైనికకు ఇచ్చాడు. ఆమె విష్ణు ప్రియను ఆట నుంచి తప్పించింది. సోనియా వేరే టీంకు వెళ్లాలని అందుకే నీ బొమ్మను పగలగొట్టానని విష్ణు ప్రియను నైనిక కన్విన్స్ చేసింది. ఆ తరువాత విష్ణు ప్రియ సుత్తి పట్టుకుని ప్రేరణకు ఇస్తే సోనియాను ఆట నుంచి తప్పించింది. ఆ తరువాత మణి సుత్తి పట్టుకుని సీతకు ఇస్తే.. నైనికను తప్పించింది. చివరి రౌండ్ వరకు నయని ఉండటంతో.. సుత్తిని పట్టుకునే ఛాన్స్‌‌ను నేరుగా బిగ్ బాస్ ఇచ్చేశాడు. అలా చివరకు మిగిలిన ప్రేరణ, సీతలకు నైనిక బాగా ఆలోచించి సుత్తి ఇచ్చే ప్రయత్నం చేసింది. అలా చివరకు సీత చేతికి సుత్తి ఇవ్వడంతో.. నెక్ట్స్ చీఫ్‌గా సీత నిలిచింది.

ఇక ఈ టాస్కు పక్కన పెడితే.. యష్మీ, సోనియా మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. నామినేషన్ అయిన తరువాత వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. నిఖిల్, పృథ్వీలనే చూస్తూ ఉంటావ్ అని సోనియా అనడంపై యష్మీ మండి పడింది. నువ్వు మాత్రం సిస్టర్, మదర్ అని కలరింగ్ ఇస్తూ ఇష్టమొచ్చనట్టుగా ముట్టుకుంటావ్.. వాళ్లని ముందు పెట్టి ఆట ఆడుతావ్ అంటూ ఫైర్ అయింది యష్మీ. చివరకు సోనియా మాటలకు యష్మీ ఏడ్చేసింది. నిఖిల్ మాటలు మార్చి చెబుతున్నాడని సోనియా ఫీల్ అయింది. యష్మీ తరుపున నిఖిల్ మాట్లాడటంతో హర్ట్ అయింది. నా హార్ట్ బ్రేక్ చేశావ్ అంటూ నిఖిల్‌తో సోనియా చెప్పింది. 

Read Also: పృథ్వీ కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు...

బిగ్ బాస్ అంటే కేవలం ఆట కాదని, లైఫ్ లెస్సన్ నేర్పిస్తుందని, ఈ ఇంట్లో తాను ఎలా ఉండాలని అనుకుంటానో అలానే ఉంటానని, తాను మారనని, తనలో బ్యాడ్ ఉంటే మార్చుకుంటానని సోనియా చెప్పుకొచ్చింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో యష్మీ, పృథ్వీ పులిహోర ముచ్చట్లు కూడా ఎక్కువే అయ్యాయి. కేవలం పుటేజ్ కోసమే అలా చేస్తున్నారని క్లియర్‌గా అర్థం అవుతోంది. ఇలాంటి ఆర్టిఫిషియల్ ట్రాక్‌లను ఆడియెన్స్ ఎంకరేజ్ చేయరన్న సంగతి కంటెస్టెంట్లకు అర్థం కావడం లేదనిపిస్తుంది.

Continues below advertisement