Bigg Boss 8 Telugu Episode 16 Day 15 Nomintaion Process: బిగ్ బాస్ ఇంట్లో మూడో వారం నామినేషన్ ప్రక్రియ మంచి రసవత్తరంగా సాగింది. సోమవారం నాటి ఎపిసోడ్ ఇలా సాగింది... తనను రెడ్ కేటగిరీలో ఎందుకు పెట్టాలని అనిపించింది అంటూ యష్మీని సోనియా అడిగింది. సోనియాతో కలవలేకపోతోన్నాను అంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది. వేరే వాళ్లు ఆమెతో ఎలా కనెక్ట్ అవుతున్నారా? అని ఆలోచిస్తున్నానని విష్ణు ప్రియ తన గ్యాంగ్‌తో ముచ్చట్లు పెట్టింది. ఉన్న ఐదు గుడ్లలో రెండు గుడ్లు తిందని విష్ణు ప్రియ మీద ప్రేరణ ఫైర్ అయింది. ఆ తరువాత బిగ్ బాస్ మూడో వారం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు.


ఇక క్రమంలో ముందుగా వచ్చిన సీత... యష్మీని నామినేట్ చేసింది. క్లాన్ ఫెయిల్ అయిందని, చీఫ్‌గా ఫెయిల్ అయిందని అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఆ తరువాత పృథ్వీ ఆటల్లో అగ్రెస్సివ్‌గా ఉంటున్నాడని, ఆట ఆడే విధానం నచ్చడం లేదని, బూతులు మాట్లాడుతున్నాడని అంది. ఆ తరువాత విష్ణు ప్రియ వంతు వచ్చింది. ఆమె ప్రేరణను నామినేట్ చేసింది. సంచాలక్‌గా ఫెయిల్ అయిందని చెప్పింది. ఇక యష్మీని నామినేట్ చేస్తూ ఫెయిర్ గేమ్ ఆడాలని హితవు పలికింది.


Read also: శ్రీముఖి, రాహుల్ బాటలో మణికంఠ, యష్మి గౌడ... బిగ్ బాస్ చరిత్రను రిపీట్ చేయబోతున్నారా?


యష్మీ గౌడ ప్రతీ దాంట్లో దూరుతోందని, ఓ క్లారిటీ ఉండదంటూ నాగ మణికంఠ నామినేట్ చేశాడు. 'డ్రామాలు ఆడుతున్నావ్.. ఫేక్' అంటూ మణికంఠ మీద యష్మీ ఫైర్ అయింది. 'ఫ్రెండ్ అని చెప్పి నాటకాలు ఆడతావ్' అని పరువు తీసింది. 'దమ్ము లేదా? బొక్క' అంటూ ఇలా పిచ్చి పిచ్చిగా వాగేసింది. 'ఈ ఇంట్లో టాస్కులు వేరు.. ఫ్రెండ్ షిప్ వేరు' అని మణికంఠ చెప్పుకొచ్చాడు. పృథ్వీ క్షణికావేశంలో ఏదేదో చేస్తున్నాడంటూ అతడ్ని నామినేట్ చేశాడు మణికంఠ.


సీత ఎమోషనల్‌గా వీక్ అవుతోందని ప్రేరణ నామినేట్ చేసింది. 'రాత్రి పూట రెండు ఎగ్స్ ఎలా తింటావ్.. ఎందుకు తిన్నావ్?' అంటూ విష్ణు ప్రియని ప్రేరణ నామినేట్ చేసింది. మింగిల్ అవ్వడం లేదని నాకు బ్లాక్ లిక్విడ్ పోయడం నచ్చలేదంటూ విష్ణ ప్రియని ఆదిత్య నామినేట్ చేశాడు. మణికంఠ విక్టిమ్ కార్డ్ వాడుతున్నాడని చెప్పి నామినేట్ చేశాడు. స్ట్రాంగ్‌గా ఉంటుందని, ఆటలు బాగా ఆడుతుందని అనుకున్నా.. కానీ ఇంత వరకు ఏమీ ఆడలేదని సోనియాని నయనిక నామినేట్ చేసింది. సంచాలక్‌గా ప్రేరణ ఫెయిల్ అయిందని నామినేట్ చేసింది.


మణికంఠ చాలా డేంజర్.. ఫేక్ అంటూ యష్మీ నామినేట్ చేసింది. నయనిక చీఫ్‌గా ఫెయిల్ అయిందంటూ నామినేట్ చేసింది యష్మీ. ఆ తరువాత నబిల్ వచ్చి చీఫ్‌గా ఫెయిల్ అయిందని యష్మీని నామినేట్ చేశాడు. 'సంచాలక్‌గా ఎప్పుడూ రూల్స్ మారుస్తూనే ఉన్నావ్' అంటూ ప్రేరణని నామినేట్ చేశాడు. ఇక ఈ నామినేషన్ ప్రాసెస్‌లో ఇద్దరూ కామెడీ చేశారు. ఒకరినొకరు ఇమిటేట్ చేసుకుంటూ నామినేషన్ ప్రాసెస్‌ను కామెడీ చేశారు. నబిల్, ప్రేరణల నామినేషన్ ప్రాసెస్ కాస్త ఫన్నీగానే అనిపించింది.


Read Also: లూజర్ నీ వల్లే నాకు సమస్యలంటూ దూరమై బాంబ్ పేల్చిన ఆడపులి... నసగాడిలా మారిన నిఖిల్‌కు గడ్డి పెట్టిన యష్మి


'సీత ఎమోషనల్..ఈ ఇంటికి అర్హురాలు కాదు' అని పృథ్వీ నామినేట్ చేశాడు. చీఫ్‌గా ఫెయిల్ అంటూ నయనికని నామినేట్ చేశాడు. చివరగా సోనియా వచ్చి.. చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని, తెలియకపోతే అడిగి తెలుసుకోవాలంటూ నైనికను నామినేట్ చేసింది. యష్మీని నామినేట్ చేస్తూ... 'చీఫ్‌గా లక్‌లో అయినా అని అన్నావ్.. అన్నింట్లో దూరుతావ్.. నెగెటివ్‌గా ఆలోచించడం మానేయ్.. పాజిటివ్‌గా ఆలోచించు' అంటూ యష్మీకి కౌంటర్లు వేసింది. ఇక సోనియాకు తిరిగి కౌంటర్లు వేసింది యష్మీ. నీకు అభయ్, నిఖిల్, పృథ్వీ తప్ప ఎవ్వరి మీద దృష్టి పెట్టలేదు.. క్లాన్ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.. సోనియాని స్ట్రాంగ్ అని తీసుకున్నా.. ఒపీనియన్ చెబుతుంది.. అనుకున్నా.. ఎక్కడా మాట్లాడలేదు.. ఎక్కడా నీ నిర్ణయం గురించి చెప్పలేదు అంటూ ఇలా సోనియా గురించి అసలు రంగు అంతా బయటపెట్టేసింది. ఇక ఛాన్స్ ఉంటే సోనియాని నామినేట్ చేస్తానని తెగ ఏడ్చేసింది యష్మీ. సోనియా చాలా ఫేక్ అని చెబుతూ కన్నీరు పెట్టుకుంది.


క్లాన్స్‌ చీఫ్‌లో ఎవరో ఒకరు సేఫ్.. ఒకరు నామినేట్ అవ్వాలని..  మీలో మీరే డిసైడ్ చేసుకోండి.. అని అన్నాడు బిగ్ బాస్. నిఖిల్ ఇది వరకు రెండు సార్లు నామినేషన్లోకి వెళ్లాడని, తాను తన బలం ఏంటో తెలుసుకునేందుకు నామినేట్ అవుతున్నాను అని అభయ్ అన్నాడు. ఇక అలా ఈ మూడో వారంలో ప్రేరణ, నయనిక, పృథ్వీ, మణి, విష్ణు, సీత, యష్మీ, అభయ్ ఇలా నామినేషన్లోకి వచ్చారు. మరి వీరిలో ఇంటి నుంచి బయటకు ఎవరు వెళ్తారో చూడాలి.