Bigg Boss Telugu 8 Day 27 Promo: మణికంఠ జీరో... నిఖిల్‌కు గడ్డి పెట్టిన నాగ్.. సోనియాతో యవ్వారంపై షాకింగ్ రియాక్షన్ 

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలోకి వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన వీకెండ్ ప్రోమోలో నిఖిల్‌ను సోనియా గురించి, నబిల్‌ను టాస్క్ నుంచి తప్పించడం గురించి నాగార్జున ప్రశ్నించారు.

Continues below advertisement

Bigg Boss Telugu 8 Latest Episode: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే నెల రోజులు పూర్తి కావస్తోంది. తాజాగా మరో హౌస్ మేట్ బయటకు వెళ్లే టైం వచ్చేసింది. ఈ వీకెండ్ ఏం జరగబోతోంది అనే ఆసక్తి నెలకొనగా, తాజాగా రిలీజ్ చేసిన వీకెండ్ ప్రోమో లో నాగార్జున నిఖిల్, సోనియాల వ్యవహారంపై ఇచ్చిన రియాక్షన్ చర్చనీయాంశంగా మారింది. అసలు వీరిద్దరి గురించి నాగార్జున ఏమన్నారు? ప్రోమోలో ఏముంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి. 

Continues below advertisement

నాగ మణికంఠపై జీరో ముద్ర వేసిన హౌస్ మేట్స్ 
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగార్జున 'హౌస్ లో హీరో ఎవరు వాళ్లకి క్రౌన్ పెట్టి, జీరో ఎవరో వాళ్ళ మొహంపై స్టాంప్ వేయాలి' అని చెప్పారు. మొదటగా మణికంఠ.. కిరాక్ సీత కు ఆ క్రౌన్ ఇవ్వగా, 'తను కింగ్ ఆఫ్ ది హౌస్ అని నేను కూడా అంగీకరిస్తున్నాను' అంటూ సీతకు నాగ్ కితాబునిచ్చారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ గంపగుత్తగా మణికంఠ మొహంపై జీరో అంటూ గుద్ది పారేశారు. అబద్ధం చెప్తాడు, ఫ్రెండ్స్ అయిన వాళ్ళని బయటకు పంపించాలని చూస్తాడు అంటూ అందరూ తమ తమ రీజన్స్ చెప్పారు. ఇక నాగార్జున 'ఎందుకు అంత ఓవర్ థింకింగ్ చేస్తున్నావు?' అని ప్రశ్నించగా, మణికంఠ 'నాకదే అర్థమయ్యి చావట్లేదు సార్' అంటూ రిప్లై ఇచ్చాడు. 'నీకే అర్థం కావట్లేదా ?' అంటూ నాగార్జున చేతులెత్తేశారు. ఇక మణికంఠ జీరో అంటూ నైనికను నామినేట్ చేయగా, 'కరెక్ట్ గా చెప్పావు' అంటూ నాగార్జున సపోర్ట్ చేశారు. 

Read Also : Bigg Boss 8 Nominations: షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్... ఈ వీక్ కూడా బయటకు వెళ్ళేది అబ్బాయే - డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

ఆ తర్వాత ప్రేరణ జీరో అంటూ నిఖిల్ మొహంపై స్టాంప్ వేసింది. 'వైల్డ్ కార్డు ఎంట్రీలు రాకుండా ఉండాలంటే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆడాలిరా అన్న నిఖిల్.. నబిల్ ను సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ నుంచి తప్పించి, క్లాన్ ను ఫస్ట్ పెట్టి హౌస్ ని పడగొట్టాడు' అంటూ కంప్లైంట్ చేసింది. 'నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది' అంటూ నాగార్జున ఆమెకు వత్తాసు పలికారు. అంతేకాకుండా నిఖిల్ ని 'టాస్క్ పేరు ఏంటో చెప్పు' అని అడిగారు. నిఖిల్ 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' చెప్పగా, 'మరి నువ్వు ఎవరిని తీసావు?' అని ప్రశ్నించారు. ఆ తర్వాత నిఖిల్ 'నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టుంది' అంటూ తను చేసిన తప్పును ఒప్పుకోగా, 'మిస్ బాలన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం ?' అంటూ ఇన్ డైరెక్ట్ గా సోనియా గురించి ప్రస్తావించారు. 'నువ్వు క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ కి రావడానికి ఇష్టపడలేదు హౌస్ మొత్తం. దానికి కారణం ఏంటి?' అని నాగార్జున ప్రశ్నించగా, నిఖిల్ స్పందిస్తూ 'ఏం చేసినా మీ ముగ్గురమే కలిసి చేసుకుంటున్నామని హౌస్ మేట్స్ అనుకుంటున్నారు' అని సమాధానం ఇచ్చాడు. 'దీనికి మీరేమంటారు హౌస్ మేట్స్' అని నాగార్జున అడగ్గా అందరూ యూనానిమస్ గా అవును అని చెప్పారు.

Read Also : Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 

Continues below advertisement
Sponsored Links by Taboola