బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ జరగనుండగా ఈ వారం ఎవరెవరు హౌస్ లో ఉంటారు ? ఎవరెవరు బయటకెళ్తారు ? అనే విషయంపై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. అందులో భాగంగానే హౌస్ నుంచి శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ తాజా సమాచారం ప్రకారం శేఖర్ బాషా ఎలిమినేట్ కాలేదని, ఓ బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని అంటున్నారు. మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకుందాం పదండి. 


శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ 
మొదటి వారం అంతా తెగ సందడి చేసిన శేఖర్ బాషా అందరినీ తన జోకులతో దాదాపు ఏడిపించాడు. ఈవారం ఏమైందో తెలియదు గానీ అసలు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. దీంతో అతను పర్ఫార్మ్ చేయట్లేదేమో అందుకే బిగ్ బాస్ పెద్దగా స్క్రీన్ పై స్కోప్ ఇవ్వట్లేదని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్లో తెలిసింది ఏంటంటే ఆయన భార్య గర్భవతిగా ఉంది. పైగా డెలివరీ డేట్ ఆ రోజే కావడంతో ఆయన వారం ముందు నుంచే టెన్షన్ పడుతూ దేనిపై ఫోకస్ చేయలేకపోయారు. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ మొదలవగానే నాగార్జున అతనికి గుడ్ న్యూస్ చెప్పారు. అతని భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది అని, తల్లి, బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి శేఖర్ బాషాకు ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ చెప్పేశాడు. ఆ తర్వాత శేఖర్ బాషా బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయనను బుజ్జగించే క్రమంలో ఆదిత్య కూడా ఏడ్చాడు. 


Read Also : Bigg Boss 8 Telugu Episode 14 Day 13: తెల్లమొహం వేసిన కంటెస్టెంట్లు, యష్మీ అసలు రంగు బయటపెట్టిన నాగ్, సోనియా పరువుతీసిన హోస్ట్


ఎలిమినేషన్ కాదు బిగ్ ట్విస్ట్ 
ఈ నేపథ్యంలోనే శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ వీక్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆదిత్య ఓం, పృథ్వి చిట్ట చివరగా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. ముఖ్యంగా ఈ వీకెండ్ ఫుటేజ్ లో శేఖర్ బాషాకన్నా అతి తక్కువగా కనిపించింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదిత్యనే. ఆయనను ఈ వీక్ ఎలిమినేట్ చేసే ఆలోచనలో ఉన్న బిగ్ బాస్ అతని ఫుటేజ్ ని చూపించలేదని టాక్ నడిచింది. కానీ తాజా సమాచారం ప్రకారం హౌస్ నుంచి శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యాడు అని తెలుస్తోంది. దీంతో అందరూ ఆయన భార్య డెలివరీ అయింది కాబట్టి కొడుకుని చూడడం కోసం అతన్ని హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నారని అనుకున్నారు. కానీ ఆయన ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇలాంటి టైంలో ఓ బిగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. దాని ప్రకారం శేఖర్ బాషా హౌస్ లో నుంచి వెళ్లేది ఇంటికి కాదు అని తెలుస్తోంది. ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ బిగ్ బాస్ అతన్ని ఇంటికి కాకుండా నేరుగా సీక్రెట్ రూమ్ లోకి పంపుతాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ సండే ఫండే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.


Read Also : Mathu Vadalara 2 Day 1 Collection: మత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్... సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన శ్రీ సింహా, సత్య - ఎన్ని కోట్లంటే?