బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం నుండి మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరిగింది. మొత్తం ఆరుగురు హౌస్ మేట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇదిలా ఉండగా.. నిన్నటి షోలో బిగ్ బాస్ పవర్ రూమ్ యాక్సెస్ కి సంబంధించి ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఎవరైతే ఎక్కువ సార్లు పవర్ రూమ్ లోకి వెళ్తారో వాళ్లకి కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ టైమ్ పవర్ స్కాన్ చేసే ఛాన్స్ మానస్ కి నిన్నటి ఎపిసోడ్ లో వచ్చింది. ఆయనకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. హౌస్ మేట్ రాత్రి అందరూ పడుకున్న తరువాతే కాజల్ పడుకోవాలి. మధ్యలో ఎవరైనా లేస్తే మళ్లీ వాళ్లు పడుకునే వరకు కాజల్ మేల్కొనే ఉండాలి.


మానస్ ని నమ్మని హౌస్ మేట్స్.. 


హౌస్ మేట్స్ అంతా పడుకుంటే పడుకుందామని వెయిట్ చేస్తుంది కాజల్. కానీ వాళ్లంతా మాత్రం మానస్ కి సీక్రెట్ టాక్ ఇచ్చారని.. మనం పడుకుంటే అతడు విన్ అవుతాడని చాలా మంది మేల్కొనే ఉన్నారు. మానస్ ఎంతగా చెబుతున్నా.. హౌస్ మేట్స్ వినకపోవడంతో 'అమ్మ మీదొట్టు' అని తను నిజమే చెబుతున్నానని.. సీక్రెట్ టాస్క్ కాదని చెప్పినా.. ఎవరూ నమ్మలేదు. దీంతో కాజల్ పడుకుండిపోయింది. ఆమె పడుకోవడంతో బజర్లు రెండు సార్లు మోగాయి. 


నేటి ఎపిసోడ్ హైలైట్స్.. 


ఉదయాన్నే 'ఇరగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ' అనే పాటకి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. అనంతరం సరయుకి హెయిర్ స్టైల్ చేస్తోన్న హమీద దగ్గరకు వెళ్లి లహరి ఏదో అడగబోయింది. దానికి హమీద సరిగ్గా ఆన్సర్ చేయకపోవడంతో.. సరిగ్గా ఆన్సర్ చేయమని లహరి అడిగింది. నేనెలా మాట్లాడాలో నువ్ చెప్పొద్దూ అంటూ హమీద సీరియస్ అయింది. దీంతో లహరి మరింత ఫైర్ అవుతూ కొన్ని డైలాగ్స్ వేసింది. అనంతరం ఇద్దరూ తమ మధ్య ఉన్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. ఒకరితో మరొకరు మాట్లాడుకొని కూల్ అయ్యారు. 


హమీదతో శ్రీరామ్ చంద్ర కబుర్లు.. 


హమీద.. శ్రీరామ్ చంద్రతో కలిసి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టింది. ''నీకు ఫీలింగ్స్ లేవా? నువ్వు ఏడ్వవా అని నా ఫ్రెండ్స్ అంటారు. ఎవరూ మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు'' అని శ్రీరామ చంద్రతో చెప్పింది. శ్రీరామ్ స్పందిస్తూ.. ''హ్యాపీనెస్ అయినా.. సాడ్‌నెస్ అయినా ఇంకొకరికి చెప్పుకోవడం నీకు అలవాటు. ఇక్కడ నీకు తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. అది తెలుసుకుని నీ లోపల ఉన్న స్పేస్‌ను పెంచుకో. ఇది వరకు 10 జీబీ ఉంటే.. ఇప్పుడు 100 జీబీ ఉండాలి లోపల'' అని తెలపడంతో హమీద నవ్వేసింది. అనంతరం శ్రీరామ్ చంద్ర దగ్గరకు కాజల్ వెళ్లి.. ''నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం?'' అని అడిగింది. ఇందుకు.. ''జోవియల్‌గా.. బబ్లీగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం'' అని శ్రీరామ చంద్ర తెలిపాడు. 


సేవకుడిగా మారిన లోబో.. 


ఈసారి పవర్ స్కాన్ సిరి చేయడంతో ఆమెకి పవర్ రూమ్ యాక్సెస్ దక్కింది. పవర్ రూమ్ లోకి వెళ్లిన సిరికి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దాని ప్రకారం షణ్ముఖ్ కి లోబో సేవకుడిగా మారాల్సి వచ్చింది. షణ్ముఖ్ కి సంబంధించిన పనులన్నీ కూడా లోబో చేయాల్సి ఉంటుంది. దీంతో అతడు షణ్ముఖ్ కి మసాజ్ లు చేస్తూ.. అతడి బట్టలు ఉతుకుతూ కనిపించారు. హౌస్ మేట్స్ అందరినీ ఇమిటేట్ చేయమని షణ్ముఖ్.. లోబోని అడగ్గా.. ఆయన యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్ లను ఇమిటేట్ చేసి నవ్వించారు. ఆ తరువాత సిరిని పవర్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్.. ''టాస్క్ ఇచ్చే హౌస్ మేట్స్ పవర్ కి తగ్గట్లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది మీకు బిగ్ బాస్ మీకిచ్చే మొదటి హెచ్చరిక'' అంటూ వార్నింగ్ ఇచ్చారు.  


ఎమోషనల్ అయిన ప్రియా..


తన కూతురు క్యాన్సర్ తో చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియా. కోవిడ్ సమయంలో తన కూతురు కోసం స్మశానం మాట్లాడాల్సి వచ్చిందని.. అప్పటికి ఇంకా తన కూతురు బతికే ఉందని చెప్పింది. స్మశానం మాట్లాడి ఇంటికి వచ్చి.. నవ్వుతున్న కూతుర్ని చూస్తుంటే.. ఆ సమయంలో కడుపులో ఎవరో చేయి పెట్టి నలిపేస్తున్నట్లు అనిపించేదని ఏడ్చేసింది. తన కూతురు చాలా బాధను అనుభవించిందని.. మరణంతో తన బాధ నుండి విముక్తి పొందిందని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో బాధ పడకూడదని అనుకుంటున్నట్లు ప్రియా తెలిపింది. 



రవి బయట యాంకర్.. ఇక్కడ కాదు.. 


హౌస్ లో మానస్ ని ఎక్కువగా ప్రియాంక సింగ్ పేరు పెట్టి ఆటపట్టిస్తున్నారు. ఈ విషయంలో మానస్ హర్ట్ అవుతున్నట్లు ఉన్నాడు. ఇదే విషయాన్ని కాజల్ ప్రస్తావించగా.. ఒక వ్యక్తిగా ప్రియాంక సింగ్ మీద గౌరవం ఉందని చెప్పిన మానస్.. ఫన్ అనేది కొంతవరకు బాగుంటుందని.. కానీ ఎక్స్ట్రీమ్ అవుతుందని అన్నాడు. ముఖ్యంగా రవి ఈ విషయాన్ని కావాలనే హైలైట్ చేస్తున్నాడని తన అభిప్రాయాన్ని చెప్పాడు. రవి బయట యాంకర్ కానీ హౌస్ లో కాదని ఫైర్ అయ్యాడు. 'మా మమ్మీ వచ్చి రవి బ్రోని వేసుకుంటే అప్పుడు ఆయనకి తెలుస్తాదని' అన్నాడు.



ఆలూ కూర తెచ్చిన గొడవ.. 


ఉమా దేవికి ఆలూ కూర పెట్టలేదని పెద్ద రచ్చే చేసింది. తింటున్నప్పుడు ఆలూ కూర అడిగితే లేదని అన్నారని.. కానీ ఫ్రిడ్జ్ లో మాత్రం దాచుకున్నారని మండిపడింది. ఈ విషయంలో యానీ మాస్టర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అప్పుడు ఆమె కూల్ అయింది.