దీపావళి కానుకగా హౌస్ మేట్స్ కి స్వీట్స్ పంపించారు నాగార్జున. బిగ్ బాస్ షో మొదలై 60 రోజులు కావడంతో ఆ జర్నీను హౌస్ మేట్స్ కి వీడియో రూపంలో చూపించారు నాగ్. అలానే నామినేషన్ ప్రాసెస్ లో లెటర్స్ ను త్యాగం చేసిన హౌస్ మేట్స్ కి ఆ లెటర్స్ ను ఇచ్చారు నాగార్జున. షణ్ముఖ్ లెటర్ ని సిరి చదవగా.. షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. అలానే మానస్, రవి కూడా తమ లెటర్స్ ను చదివి వినిపించగా.. కన్నీళ్లు పెట్టుకున్నారు. రవి అయితే చాలా సేపటివరకు ఏడుస్తూనే ఉన్నాడు. పెళ్లి తరువాత తన లైఫ్ చాలా మారిపోయిందని.. నిత్య(రవి వైఫ్) తనకు సపోర్ట్ సిస్టంలా మారిందని చెప్పాడు. ఇకపై తనేంటో గేమ్ లో చూపిస్తానని చెప్పాడు రవి.
అనంతరం లోబో తనకొచ్చిన లెటర్ చదువుకొని ఎమోషనల్ అయ్యాడు. అలానే సిరి లెటర్ ను షణ్ముఖ్ చదవగా.. ఆ లెటర్ ఎంతో రొమాంటిక్ అండ్ స్వీట్ గా ఉందని షణ్ముఖ్ అన్నాడు. అలానే నాగార్జున ముప్పై ఏళ్ల క్రితం అమల తనకిచ్చిన లెటర్ ని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నానని చెప్పారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు.
బెస్ట్ జోడీ ఆఫ్ ది హౌస్ :
ఈ టాస్క్ లో భాగంగా స్వీట్ అండ్ ది స్పూన్ అనే గేమ్ ఆడించారు. ఇందులో రవి-జెస్సీ టీమ్ విజేతగా నిలిచారు.
మానస్ సేఫ్..
నామినేషన్ ఉన్న ఆరుగురిలో ముందుగా మానస్ ని సేవ్ అయినట్లుగా అనౌన్స్ చేశారు.
ఆ తరువాత స్టేజ్ పైకి యాంకర్ సుమని ఇన్వైట్ చేశారు నాగార్జున. ఎప్పటిలానే తన మాటలతో నాగార్జునపై కౌంటర్లు వేసింది. ఆ తరువాత హౌస్ లోకి వెళ్లింది సుమ. గ్లాస్ కేజ్ లో నుంచి హౌస్ మేట్స్ తో మాట్లాడిన సుమ.. కాసేపు ఫన్ చేసింది. అలానే హౌస్ లో జరిగిన కొన్ని విషయాల గురించి కంటెస్టెంట్స్ ను అడిగింది. ఇదే సమయంలో షణ్ముఖ్-సిరిల ముద్దు టాపిక్ తీసుకొచ్చింది. కాసేపు వారిద్దరినీ ఏడిపించింది. అలానే కాజల్ ని తన మాటలతో ఆడేసుకుంది.
దీపికా.. పాచికా..
పాచిక ఏ నంబర్ పడితే అన్ని దీపాలు పక్క వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆట అయిపోయేసరికి ఎవరి దగ్గర ఎక్కువ దీపాలు ఉంటాయో వాళ్లే విజేతలని చెప్పారు. ఈ టాస్క్ లో షణ్ముఖ్-సిరి విజేతలుగా నిలిచారు.
షణ్ముఖ్ సేఫ్..
నామినేషన్ లో మిగిలిన ఐదుగురిలో.. ఎవరి కుటుంబసభ్యుల వాయిస్ అయితే వినిపిస్తుందో వాళ్లే సేఫ్ అని చెప్పగా.. షణ్ముఖ్ మదర్ వాయిస్ వినిపించడంతో ఆయన సేవ్ అయినట్లుగా ప్రకటించారు.
ఆ తరువాత స్టేజ్ పైకి విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వచ్చారు. రాగానే విజయ్.. నాగార్జున ఫిట్ నెస్ సీక్రెట్ అడగ్గా.. ఏం జరిగినా.. అది మైండ్ లోకి తీసుకోనని.. పడుకుంటే 30 సెకన్లలో నిద్రపట్టాలని.. అది తన తండ్రి దగ్గర నేర్చుకున్నట్లు చెప్పారు నాగార్జున.
చిటికెలో చెప్పు..
హౌస్ మేట్స్ తో మాట్లాడిన విజయ్ దేవరకొండ, నాగార్జున వారికొక క్విజ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రవి-జెస్సీ టీమ్ విజేతలుగా నిలిచారు.
సిరి సేఫ్..
నామినేషన్ లో మిగిలిన నలుగురిలో ఒకరిని సేవ్ చేయడానికి.. విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో బాంబ్ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో సిరి సేవ్ అయింది. దీంతో సిరి.. 'ఆనంద్ ఐలవ్యూ' అంటూ చాలా సేపు అరుస్తూ చెప్పింది.
ఆ తరువాత స్టేజ్ పై డాన్స్ పెర్ఫార్మన్స్ చేసిన అవికా గోర్ ని పిలిచి మాట్లాడారు నాగార్జున. ఆమెతో నామినేషన్ లో మిగిలిన ముగ్గురిలో ఒకరిని సేవ్ చేయించారు. ఆ కంటెస్టెంట్ ఎవరంటే.. శ్రీరామచంద్ర. అనంతరం అవికా కోసం ఓ పాట పాడాడు శ్రీరామ్. ఇక అవికా.. వెళ్లిపోతూ షణ్ముఖ్ తనకు బాగా నచ్చాడని చెప్పింది.
ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ముక్కు అవినాష్, బాబా భాస్కర్ మాస్టర్ వెళ్లారు. గ్లాస్ కేజ్ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా ప్రియాంకను ఇమిటేట్ చేసి ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు అవినాష్, బాబా మాస్టర్. ఆ తరువాత సిరి-షణ్ముఖ్, సన్నీ-శ్రీరామ్ లను ఇమిటేట్ చేసి చూపించారు. దీంతో హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వుకున్నారు.
అనంతరం స్టేజ్ పైకి సింగర్ కల్పనను ఇన్వైట్ చేసిన నాగార్జున.. ఆమెతో హౌస్ మేట్స్ కి డెడికేట్ చేస్తూ కొన్ని పాటలు పాడించారు. ఈ క్రమంలో ఆమె షణ్ముఖ్ గురించి పాడిన స్పెషల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. 'రెచ్చిపోదాం బ్రదర్' అంటూ సన్నీ కోసం పాడి.. 'మిస్టర్ పెర్ఫెక్ట్' అంటూ మానస్ కోసం పాడింది కల్పన. ఇంకా ఒక్కొక్కరికీ వాళ్ల క్యారెక్టర్స్ ని బట్టి సాంగ్స్ పాడింది.
ఆ తరువాత హౌస్ లోకి సోహెల్, అరియనా ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ తో వీరిద్దరూ కలిసి గేమ్ ఆడించారు. గేమ్ తరువాత హౌస్ మేట్స్ కి వాళ్లింటి దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ లను ఇచ్చారు.
సడెన్ గా బిగ్ బాస్ స్టేజ్ పై సంతోష్ శోభన్, మెహ్రీన్ డాన్స్ వేస్తూ కనిపించారు. వెంటనే నాగ్ రాగా.. ఆయన్ను పలకరించారు. ఆ తరువాత నాగార్జున.. దర్శకుడు మారుతిని స్టేజ్ పైకి పిలిచారు. అలా వచ్చిన మారుతి 'మంచిరోజులు వచ్చాయి' సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఈ టాస్క్ లో షణ్ముఖ్-సిరిలు గెలిచారు. ఆ తరువాత స్టేజ్ పైకి శ్రియను ఇన్వైట్ చేశారు నాగార్జున. ఆమెని చూసి హౌస్ మేట్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. హౌస్ మేట్స్ తో డాన్స్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఇందులో రవి-జెస్సీ ల పోల్ డాన్స్ కి శ్రియ ఫిదా అవ్వడంతో.. వాళ్లను విజేతలుగా ప్రకటించారు.
ఫైనల్ గా బెస్ట్ జోడీ ఆఫ్ ది హౌస్ గా జెస్సీ-రవిలు నిలిచారు.
నామినేషన్ లో ఉన్న రవి, లోబోలను నుంచోమని చెప్పిన నాగార్జున చిచ్చుబుడ్డి టాస్క్ తో రవి సేవ్ అయినట్లుగా ప్రకటించారు. దీంతో లోబో ఎలిమినేట్ అయ్యాడు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి