బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి...More
బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది స్టార్స్ అతిథులుగా రాబోతున్నారు. అంతేకాదు.. శ్రియ లాంటి హీరోయిన్లతో డాన్స్ పెర్ఫార్మన్స్ లు ప్లాన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో విన్నర్ ను అనౌన్స్ చేస్తుండడంతో ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో చివరికి ఐదుగురు ఫైనలిస్ట్ లు మిగిలారు. వారు శ్రీరామ్, సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరి. ట్రోఫీ సన్నీకి వస్తుందని కొందరు.. కాదు, కాదు శ్రీరామ్ కే ఆ హక్కు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది. సోషల్ మీడియాలో చేపట్టిన పోలింగ్ బట్టి చూస్తుంటే మాత్రం సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పలేం. మెజారిటీ ఆడియన్స్ మాత్రం సన్నీ విన్నర్ అని ఫిక్సయిపోయారు.నిజానికి హౌస్‌లో ఉన్న సభ్యులు ఎవరికి వారే స్ట్రాంగ్. చెప్పాలంటే.. మానస్, సన్నీలకు మొదట్లో పెద్దగా అభిమానులు లేరు. దీంతో వారు ఎన్నివారాలు ఉంటారనేది కూడా డౌట్‌గా ఉండేది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్‌గా మారిన సిరి, షన్నులకు యూత్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక శ్రీరామ చంద్రకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు తక్కువే. ఇండియన్ ఐడల్‌లో పాల్గొనడం వల్ల జాతీయస్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే, వారు కూడా అతడిని ఆదుకుంటారనే గ్యారంటీ మొదట్లో లేదు. వీరంతా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాతే అభిమానులను పొందారు. షన్ను, సిరిలు మొదటి నుంచి కలిసే ఆడటం.. అభిమానులకు కూడా నచ్చట్లేదని తెలుస్తోంది. అయినా సరే.. వారిని ఫ్యాన్స్ ఏ రోజు నిరాశ పరచలేదు. సిరి టాస్కుల్లో ప్రాణం పెడుతూ.. గెలవడానికి కష్టపడేది. దీంతో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసేవారు. ఆఖరి రోజు వారంలో కాజల్.. శ్రీరామ్‌తో గొడవ పడి ఉండకపోతే.. తప్పకుండా టాప్-5లో ఉండేదని అంచనా. అంతా సాఫీగా సాగుతుందనే సమయానికి.. బిగ్ బాస్ ఇంట్లో ఫన్ క్రియేట్ చేస్తున్న సన్నీతో సిరి గొడవ పెట్టుకుంది. ఆమెకు షన్ముఖ్ సపోర్ట్ చేశాడు. పైగా.. చివరి రోజు ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సిరిని బయటకు పంపడం కూడా ఆ జంటకు మైనస్ అయ్యింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలామందికి సహన పరీక్ష పెట్టింది. ఆ ప్రభావం.. సన్నీ, శ్రీరామ్‌లకు ఓట్ల వర్షం కురిపించినట్లు తెలిసింది.