బిగ్ బాస్ రియాలిటీ షోలకు ఇండియాలో పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం హిందీ వర్షనే. ముందుగా హిందీలో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. ఆ తర్వాతే సౌత్ భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హిందీ వర్షన్ అనేది 17వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సీజన్‌లో కపుల్ కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయ్యారు అంకితా లోఖండే, విక్కీ జైన్. తాజాగా ఈ జంటకు సంబంధించి ఒక సంచలన విషయం బయటపడింది. అది కూడా బిగ్ బాస్ హౌస్‌లో కెమెరాల ముందే అంకితా ఒప్పుకుంది.
వేర్వేరు సెక్షన్స్‌లో భార్యాభర్తలు
బిగ్ బాస్ సీజన్ 17 హిందీలో దిల్ సెక్షన్, దిమాగ్ సెక్షన్ అని రెండు వేర్వేరు సెక్షన్స్ ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం వరకు అంకితా, విక్కీ ఇద్దరూ దిల్ సెక్షన్‌లోనే కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. కానీ తాజాగా బిగ్ బాస్ హౌస్‌లో షఫిల్ చేయగా.. అంకితా దిల్ సెక్షన్‌లో ఉండిపోయింది. విక్కీ మాత్రం దిమాగ్ సెక్షన్‌కు వెళ్లిపోయాడు. ఇది అంకితాను బాగా బాధపెట్టింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అంకితా, విక్కీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు సెక్షన్స్‌లో ఉన్నందుకు ఈ గొడవలు మరింత పెరిగాయి. అదే క్రమంలో అంకితా చెప్పిన ఒక విషయం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.
పెళ్లి చేసుకొని జీవితం నాశనం
ఇద్దరు వేర్వేరు సెక్షన్స్‌లో ఉన్నా కూడా విక్కీ చాలా సంతోషంగా ఉన్నాడంటూ అంకితా తనపై ఆరోపణలు చేస్తూ.. తనతో గొడవపెట్టుకోవడం మొదలుపెట్టింది. పెళ్లి అయిన విషయం మర్చిపోమని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి జీవితం నాశనం అయిపోయిందని అంకితా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా గేమ్ విషయంలో తనను విక్కీ ఉపయోగించుకున్నాడని అంకితా ఆరోపించింది. అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఉందని వాపోయింది. అంకితా.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కొన్నిసార్లు ఎంటర్‌టైన్మెంట్ అందించినా.. ఎక్కువసార్లు తన భర్తతో గొడవపడుతూనే కనిపిస్తుందని ప్రేక్షకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అంకితా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
పుల్లగా తినాలనిపిస్తోంది
తనకు ఆరోగ్యం అసలు బాలేదని, లోపల అదోలా అనిపిస్తుందని భర్త విక్కీతో చెప్పుకొచ్చింది అంకితా. తనకు పీరియడ్స్ రాలేదని, ఇంటికి వెళ్లిపోవాలని అనిపిస్తుందని కూడా తెలిపింది. తను ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడం కోసం డాక్టర్లు తనకు బ్లడ్ టెస్ట్‌తో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేశారని బయటపెట్టింది. తన ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండడం లేదని కూడా అంకితా చెప్పింది. అంతే కాకుండా తన తోటి కంటెస్టెంట్స్ అయిన రింకూ, జిగ్నాతో కూడా తనకు ఏదైనా పుల్లగా తినాలని ఉందంటూ తెలిపింది. దీంతో వారు కూడా అంకితా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా కూడా భర్త విక్కీ.. తనకు టైమ్ ఇవ్వడం లేదని ఆరోపించడం మాత్రం ఆపలేదు అంకితా.
Also Read: శివాజీకి ఎదురు మాట్లాడిన పల్లవి ప్రశాంత్ - శోభాశెట్టిపై ఫైర్, ఓటమికి వాళ్లే కారణమా?