Bigg Boss OTT: బిగ్ బాస్ రియాలిటీ షో.. దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. హిందీ, తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో ఈ షోలు కొనసాగుతున్నాయి. కరోనా తర్వాత బిగ్ బాస్ ఓటీటీ షోలు కూడా ప్రసారం అవుతున్నాయి. తాజాగా హిందీ బిగ్ బాస్ షోలో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోనే ఆ పని చేయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


కెమెరాల ముందే అర్మాన్ మాలిక్ రొమాన్స్


బిగ్ బాస్ ఓటీటీ షోలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అర్మాన్ మాలిక్ తో పాటు ఆయన ఇద్దరు భార్యలు పాయల్ మాలిక్, కృతికను హౌస్ లోకి పంపించారు. మొగుడూ పెళ్లాలను హౌస్ లోకి పంపించడం ఏంటంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కొద్ది రోజుల్లోనే పాయల్ మాలిక్ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం అర్మాన్, కృతికా షోలో ఉన్నారు. వీరిద్దరు షోలో మితిమీరిన రొమాన్స్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా అర్మాన్, కృతిక ఒకే బెడ్ మీద పడుకొని, ఆ.. పని చేయడం కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ విజువల్స్ కాస్త బయటకు రావడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే ఈ షోపై నెగెటివ్ ఒపీనియన్ ఉండగా.. ఈ సంఘటనలో అది మరింత ముదిరింది. బిగ్ బాస్ షో నిర్వాహకులు దిగజారుడు తనానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏం అవసరం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.     






తెలుగు బిగ్ బాస్ పైనా తీవ్ర విమర్శలు


బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోపైనా పలు విమర్శలు వచ్చాయి. సీపీఐ నారాయణ అప్పట్లో నాగార్జునను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలతో ఆ పని చేయించడానికే ఈ షో నిర్వహిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి నాగార్జున కూడా కౌంటర్ ఇవ్వడం సంచలనం కలిగించింది. మరికొంత మంది ఈ షోపైన కేసులు కూడా పెట్టారు. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ షోలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలుగులో ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి అయ్యాయి. జూ. ఎన్టీఆర్, నాని, నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. త్వరలోనే 8వ సీజన్ మొదలుకాబోతున్నది. ఇప్పటికే కంటెస్టెంట్ల సెలెక్షన్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అటు హిందీలోనూ ఈ షో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్టుగా ఈ షో కొనసాగుతోంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కు మాత్రం అనిల్ కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు మరింత క్రేజ్ తీసుకొచ్చేందుకు నిర్వాహకులు హాట్ బ్యూటీస్ ను తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే అర్మాన్, అతడి భార్యలను షోలోకి తీసుకొచ్చారు.



Read Also: ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొన్నా- విడాకులపై సమంత షాకింగ్ కామెంట్స్