Amardeep Chowdary's Sumathi Satakam Telugu Review: 'జానకి కలగనలేదు'తో పాటు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి పాపులారిటీ సొంతం చేసుకున్న నటుడు అమర్‌దీప్ చౌదరి. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 7 రన్నరప్ కూడా. పలు రియాలిటీ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 'ఐరావతం', 'అభిలాష', 'ప్రేమదేశం' సినిమాలతో హీరో అయ్యాడు. అమర్‌దీప్ చౌదరి హీరోగా నటించిన తాజా సినిమా 'సుమతీ శతకం'. ఇందులో శైలి చౌదరి హీరోయిన్. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

కథ (Sumathi Satakam Movie Story): కిరాణా కొట్టు కృష్ణ (అమర్‌దీప్ చౌదరి) లక్ష్యం ఒక్కటే... ఊరిలోని గుడిలో జాతరకు పెళ్లి చేసుకోవాలని. తూర్పు గోదావరి జిల్లాలోని అతని సొంతూరు వైకుంఠపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మాయిలెవరూ అతన్ని చేసుకోవడానికి ముందుకు రారు. అటువంటి పరిస్థితుల్లో గుడిలో ఓ అమ్మాయి సుమతి (శైలి చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. కష్టపడి ఆమె ఆచూకీ కనిపెడతాడు. అంగన్ వాడి టీచర్ ఉద్యోగం చేస్తుందని తెలుసుకుని సుమతితో పరిచయం పెంచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు. చివరకు ప్రపోజ్ చేస్తాడు. 

సుమతికి ప్రపోజ్ చేసిన తర్వాత కృష్ణకు ఆమె గురించి ఓ నిజం తెలుస్తుంది. అది ఏమిటి? సుమతి ఊరి గుడిలో అమ్మవారి విగ్రహం మాయం కావడానికి, కృష్ణతో పెళ్లి వద్దని ఊరంతా చెప్పడానికి కారణం ఏమిటి? తన ప్రేమ, పెళ్లికి ఎదురైన సమస్యల నుంచి కృష్ణ ఎలా బయట పడ్డాడు? సుమతిని దక్కించుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Continues below advertisement

విశ్లేషణ (Sumathi Satakam Telugu Review): ప్రతి సినిమాకు దర్శక నిర్మాతలు - హీరో నమ్మడానికి బలమైన కారణం ఒకటి ఉంటుంది. సుమతి శతకానికి విశ్రాంతి ముందు వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ కారణమని చెప్పాలి. విశ్రాంతి వరకు ఇదొక సగటు ప్రేమకథగా కనిపిస్తుంది. అయితే... ఇంటర్వెల్ ట్విస్ట్ చిన్నపాటి షాక్ ఇస్తుంది. ఆ తర్వాత జరగబోయే కథపై నమ్మకం కలిగిస్తుంది. పతాక సన్నివేశాల్లో అమ్మవారు ఆవహించే అమ్మాయిలు - గణాచారులు గురించి చెప్పే విషయం బావుంది. కానీ ఆ అంశాలపై కథను నడపకుండా రొటీన్ కామెడీ మీద దర్శకుడు ఎంఎం నాయుడు ఆధారపడ్డారు.

వైసీపీ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్ఫూర్తితో ఊరి సర్పంచ్ రోల్ రాశారని అర్థమవుతోంది. రీల్స్, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం మహేష్ విట్టా చేసే ప్రయత్నాలు, నాటు కామెడీ మాస్ జనాన్ని మెప్పిస్తాయి. అయితే హీరోతో 'అన్నా' అంటూ టేస్టీ తేజ చేసే కామెడీ వర్కవుట్ కాలేదు. హీరో కథ కంటే మధ్యలో ఊరి సమస్యను ఎక్కువ సేపు చూపించడం సినిమాకు మైనస్. ఆ పోర్షన్స్ లెంగ్త్‌ పెంచాయి. అవి తీసేసి అమ్మవారు, దైవానుగ్రహం అంశాలపై కాన్సంట్రేట్ చేసి ఉంటే బావుండేది. కామెడీ సీన్స్ రాసే విషయంలో ఎంఎం నాయుడు సక్సెస్ కాలేదు. రొటీన్ టెంప్లేట్ ఫాలో అయ్యారు. దాంతో 'రోలర్ కోస్టర్ రైడ్'గా మారిందీ 'సుమతీ శతకం'. ఎమోషన్స్ వరకు చక్కగా క్యాప్చర్ చేశారు. పాటలు, ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను కెమెరా వర్క్ చూపించింది.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

టీవీకి, సినిమాకు వేరియేషన్ చూపించారు అమర్‌దీప్ చౌదరి. రియాలిటీ షోల్లో చూపించిన అగ్రేషన్ 'సుమతి శతకం'లో లేదు. పాత్రకు తగ్గట్టు నటించగలనని చూపించారు. యాక్షన్ చేయగలనని హింట్ ఇచ్చారు. అతనిలో కామెడీ టైమింగ్ వాడుకోవడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా చూపించారు. శైలి చౌదరి బార్బీ బొమ్మలా కనిపించే ప్రయత్నం చేసింది. పతాక సన్నివేశాల్లో నటించింది. బుల్లితెర కమెడియన్స్ కొందరు కనిపించారు.

'సుమతీ శతకం'లో కోర్ పాయింట్ బావుంది. కానీ రొటీన్ సీన్స్ - స్క్రీన్ ప్లే టెంప్లేట్ ఫాలో కావడం మైనస్. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆడియన్స్ నుంచి అప్రిసియేషన్ పొందుతాయి. విలేజ్ రోల్స్ చేసేందుకు అమర్‌దీప్ చౌదరికి విజిటింగ్ కార్డుగా హెల్ప్ అవుతుందీ సినిమా. ఓటీటీకి డీసెంట్ వాచ్.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?