కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆదిరెడ్డి. కానీ ఆయన కామన్ మ్యానా? అనే ప్రశ్న కూడా చాలా సార్లు తలెత్తింది. యూట్యూబ్ వ్లాగ్ ద్వారా వేల మంది సబ్ స్రైబర్లను సంపాదించారు. అంతేకాదు భార్య కవిత, చెల్లి నాగలక్ష్మి పేరుతో మరో యూట్యూబ్ ఛానెల్ తెరిచి దాని ద్వారా కూడా ఎంతో మంది ప్రజలకు దగ్గరయ్యారు. అంతేకాదు భార్య, చెల్లి ఎన్నో పేపర్లకు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్య్వూలు ఇచ్చారు. మరి ఇలాంటి వ్యక్తి కామన్ మ్యాన్ ఎలా అయ్యాడో? బిగ్ బాస్ నిర్వాహకులే చెప్పాలి. 


ఇక ఆదిరెడ్డి సంపాదన విషయానికి వస్తే ఈ సీజన్లో అధికంగా రెమ్యునరేషన్ అధికంగా తీసుకున్న వ్యక్తే ఆదిరెడ్డేనని తెలుస్తోంది. ఈయనకు వారానికి రెండు లక్షల రూపాయల దాకా బిగ్ బాస్ నిర్వాహకులు ముట్టజెప్పినట్టు సమాచారం. ఇలా చూసుకుంటే 15 వారాలకు గాను ఆదిరెడ్డికి దాదాపు 30 లక్షల దాకా అందినట్టు తెలుస్తుంది. అంటే మనీ పరంగా ఈయన కూడా విన్నర్ అనే చెప్పుకోవాలి. ఆయన ఒక బిగ్ బాస్ రివ్యూవర్‌గా యూట్యూబ్‌లో తన జర్నీని మొదలు పెట్టారు. దాదాపు అన్ని సీజన్లలో ఆయన రివ్యూలు ఇచ్చారు. చివరికి తానే బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మారాడు. 


ఇతనికి నెల్లూరు జిల్లా కావలిలోని వరి కుంటపాడులో నివసిస్తున్నాడు. ఇతని భార్య కవిత, చెల్లి నాగలక్ష్మి ఇద్దరూ కూడా యూట్యూబర్లే. వీరిద్దరి గురించి చాలా న్యూస్ పేపర్లలో రాశారు. బీబీసీ వాళ్లు కూడా ఇంటర్య్వూ చేశారు. ఈయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే ఆయన తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండేళ్ల పాటూ ఇంట్లోనే ఉండిపోయారు. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేశారు. ఆ సమయంలో బిగ్ బాస్ సీజన్ 2 గురించి రివ్యూలు ఇచ్చారు. అది హిట్ కావడంతో అదే పనిగా పెట్టుకున్నారు. లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం, ఆదాయం పెరగడంతో ఉద్యోగం వదిలి పూర్తిగా దీని మీదే ఆధారపడ్డారు. సొంత గ్రామం వచ్చి యూట్యూబ్ వీడియోలు చేస్తూ బతుకుతున్నారు.   






Also read: విన్నర్ రేవంత్ బిగ్‌బాస్ నుంచి మొత్తం ఎంత సంపాదించాడంటే