Actress Inaya Sulthana Sensational Comments On Big Boss: బిగ్ బాస్.. ఈ షోకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆ షోలో కంటెస్టెంట్స్ కి అంతే ఫ్యాన్స్ ఉంటారు బయట. బిగ్ బాస్ కి వెళ్లి వస్తే చాలు ఫేమస్ అయిపోతారు, సెలబ్రిటీలు అయిపోతారు. ఇట్టే మంచి మంచి ఆఫర్స్ వచ్చేస్తాయి. ఇంకేముంది లైఫ్ సెట్టు అనుకుంటారు అందరూ. కానీ, పరిస్థిలు మాత్రం అలా ఉండవు అని చెప్తున్నారు ఇనయా సుల్తానా. బిగ్ బాస్ సీజన్ - 6 లో కంటెస్ట్ చేసిన ఇనయా సుల్తానా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా బిగ్ బాస్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇనయా సుల్తానా మాత్రమే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన చాలామంది ఇలా చెప్పినవాళ్లే. మరి ఇనయా ఏమన్నారు?
బిగ్ బాస్ అంటే.. ప్రొఫైల్ కనీసం చూడరు..
బిగ్ బాస్ కి వెళ్తే లైఫ్ మారిపోతుందని, ఆఫర్స్ వస్తాయని చాలామంది అనుకుంటారని, కానీ పరిస్థితి అలా ఉండదని అంటున్నారు ఇనయా. చాలా ఆఫీసుల చుట్టు తిరిగి.. బతిమలాడితే ఛాన్సులు వచ్చాయని అంటున్నారు. "బిగ్ బాస్ వాళ్లకు మేం ఛాన్స్ ఇవ్వం అండి అనేవాళ్లు చాలామంది. సినిమా ఆఫీసుల్లో బిగ్ బాస్ అంటే ప్రొఫైల్స్ పక్కన పెట్టేసేవారు. ‘‘నేను అదే చేస్తాను. ఇదే చేస్తాను అని అంటారు తీసుకోము అంటూ నో చెప్పారు. దీంతో నేనే సొంతంగా వెళ్లి, ఎవరో తెలియనట్లు వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి, అక్కడే ఉండి డైరెక్టర్‌తో మాట్లాడి.. నేను అలాకాదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. రెమ్యునరేషన్ డిమాండ్ చేయను. ఎందుకంటే నాకు క్యారెక్టర్ కావాలి. నాకు ఇంత ఫేమ్ ఉంది నాకు ఇంత కావాలి అని అనను అని బతిమాలి, నా గురించి చెప్పుకునేదాన్ని. ఇంత జరిగినా వాళ్లు ఆలోచించి సమాధానం ఇచ్చేందుకు టైం పట్టేది. దీంతో నేను డిప్రషన్ లోకి వెళ్లిపోయాను. అలా ఆ మూడ్ నుంచి బయటపడటానికి ట్రిప్స్ వెళ్లేదాన్ని, సోలోగా, ఫ్రెండ్స్ తో ట్రిప్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు ప్రభాస్‌తో చేస్తున్నాను. నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా" అని చెప్పారు ఇనయా సుల్తాన.
జీరో నుంచి స్టార్ట్ చేశా..
"బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చాక ఆఫర్లు బాగా వస్తాయి అని అంటారు. కానీ, చాలా స్ట్రగుల్స్ తర్వాత నాకు ఆఫర్స్ వచ్చాయి. నేను ఏమైనా మూవీ ఆడిషన్ ఉందంటే ఒక తెలియని వ్యక్తిలా ప్రతి ఆఫీస్‌కు తిరిగి తిరిగి ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ అలానే సెలెక్ట్ అయినవి. బిగ్ బాస్ కి వెళ్లకముందు ఎలా తిరిగానో అలానే తిరిగాను. జీరో నుంచి స్టార్ట్ చేశాను. బిగ్ బాస్ నుంచి వచ్చాక నేను బిగ్ బాస్ ఫేమ్ అనే ఫీలింగ్ లో ఉంటారు చాలామంది. కానీ, నేను అలా లేను. నాకు ఉండాలి అనిపించలేదు. నా గోల్ సినిమాలు చేయడం అందుకే మళ్లీ కెరీర్ స్టార్ట్ చేశా. అది స్టార్ట్ చేసే ముందు నేను చాలా డిప్రషన్ లో ఉన్నాను. ఆ డిప్రషన్ నుంచి బయట పడేందుకు కూడా నేను మూవీస్ చేశాను. ఇప్పుడు అంతా హ్యాపీ" అని తన లైఫ్ గురించి చెప్పారు ఇనయా.
నిజానికి బిగ్ బాస్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు అయిపోతారు అనుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లి బయటికి వచ్చిన చాలామంది డిప్రషన్స్ లో కూడా ఉన్నారు. కొంతమంది ఆ ఫ్లాట్ ఫాం వల్ల బాగా ఎదిగితే.. కొంతమంది మాత్రం కెరీర్‌లో డౌన్ ఫాల్ చూసిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే బిగ్ బాస్‌కు వెళ్లిన వాళ్లంతా షోని నువ్వు వాడుకోవాలి. షో నిన్ను వాడుకునేలా ఆడొద్దు అంటూ హితబోధ చేస్తున్నారు.
Also Read: ‘డార్లింగ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?