తెలుగులో ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ‘బిగ్ బాస్‘, ఇప్పుడు 7వ సీజన్ లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 3న మొదలైన ఈ సీజన్‌కు మళ్లీ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. తొలి వారంలో హీరోయిన్ కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని, నాలుగో వారంలో రతిక ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం మరో కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోబోతున్నారు. ఈ వారం నామినేషన్స్‌ లో శివాజీ, ప్రియాంక, యావర్, గౌతమ్, శోభా శెట్టి, అమర్ దీప్,  తేజ ఉన్నారు.  వీరీలో శివాజీకి ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. యావర్, అమర్ దీప్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గౌతమ్,  ప్రియాంక‌, తేజ, శుభశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎక్కువ ఓట్లు రావడంతో తేజకు, గౌతమ్‌ కూడా సేఫ్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. వారిలో గౌతమ్ ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శుభశ్రీ ఎలిమినేట్ అవుతున్నట్లు టాక్.


దయ్యాల గది నుంచి బయటకు వెళ్లేది ఎవరు?


ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో ఫుల్ ట్విస్టులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తాజా సీజన్ లో 5 వారాలు గడిచిపోయాయి. హౌస్ లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇవాళ మీరు చెప్పాల్సింది 5 వారాల్లో టాప్ కంటెస్టెంట్ ఎవరు? అని నాగార్జున అడుగుతారు.  ఎవరికి వారు తమకు నచ్చిన వాళ్ల పేర్లు చెప్తారు.  ప్రతిసారి సేవింగ్ తో మొదలయ్యే గేమ్, ఇవాళ ఎలిమినేషన్ తో మొదలు పెట్టనున్నట్లు నాగార్జున ట్విస్ట్ ఇస్తారు. ఎలిమినేషన్ లిస్టులో ఉన్నవారిలో ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు బయటకు వెళ్తారు? అనే విషయాన్ని మిగతా కంటెస్టెంట్లు చెప్పాలని నాగార్జున్ అడుగుతారు.  నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు హౌస్ మేట్స్ కు గుడ్ బై చెప్పాలనుకుంటే చెప్పేసేయాలంటారు నాగార్జున. ఎవరు తిరిగి వస్తారో,  ఎవరు బయటకు వెళ్లబోతున్నారో తెలియదు అంటారు. దీంతో నామినేషన్స్ లో ఉన్నవారు మిగతా వారికి వీడ్కోలు చెప్పి వెళ్తారు. వారందరినీ ఓ దయ్యాల గదిలోకి పంపిస్తారు. యావర్ దగ్గరికి వచ్చి ఓ దెయ్యం సైగ చేస్తుంది. ఇంతకీ ఆ దయ్యం తనను సేవ్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.


‘బిగ్ బాస్ 2.0’లో ఎన్ని ట్విస్టులో?


ఇక బిగ్ బాస్ 2.0 ఇప్పుడు మొదలు కాబోతోందని చెప్తారు నాగార్జున.  ఈ ఆదివారం హీరో సిద్ధార్థ్ తన ‘చిన్నా‘ సినిమా ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోకి వస్తారు. కంటెస్టెంట్లతో ఫుల్ సందడి చేస్తారు. అటు తన ‘టైగర్ నాగేశ్వర్ రావు‘ సినిమా కోసం రవితేజ సైతం బిగ్ బాస్ వేదికపైకి అడుగు పెడతాడు. ఇక మీరు ఊహించనివి ఎన్నో జరగబోతున్నాయంటూ నాగార్జున ట్విస్ట్ ఇస్తారు. రతిక మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తు్న్నట్లు తెలుస్తోంది. అందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయకతప్పదు.






Read Also: నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ సంచలన స్టేట్మెంట్, ఆటాడుకుంటున్న నెటిజన్లు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial