‘బిగ్ బాస్’ సీజన్-6 మొదలైపోయింది. ఇంట్లోకి కంటెస్టెంట్లు కూడా వెళ్లి సెటిలైపోయారు. మరి, వీరు లోపల ఉన్నంత కాలం.. సంపాదన ఎలా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. పైగా, బోలెడంత లాభం. పాపులారిటీ మాట ఎలా ఉన్నా.. లక్కుంటే వారికి బోలెండంత మొత్తం లభిస్తుంది. ముఖ్యంగా ప్రతి వారం ప్రజాభిమానం పొందేవారికి ఎక్కువ మొత్తాన్ని పొందే అవకాశం లభిస్తుంది. 


‘బిగ్ బాస్’ హౌస్‌లో చివరి వరకు ఉండి టైటిల్ గెలిచేవారికి ఇప్పటివరకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తున్నారు. దాదాపు 100 రోజులు అన్నీ వదిలి ఇంట్లో ఉన్నందుకు ఇది కాస్త తక్కువ అమౌంటే అనిపించవచ్చు. కానీ, వారు అన్నాళ్లు ఉన్నందుకు ప్రత్యేకంగా పారితోషికం లభిస్తుంది. అయితే, అది వారికి బయట ఉన్న పాపులారిటీ మీద ఆధారపడి ఉంటుంది. మంచి పేరున్న నటుడు లేదా నటి ‘బిగ్ బాస్’లోకి వచ్చినట్లయితే.. వారికి వారానికి తగిన మొత్తాన్ని చెల్లిస్తారు. ప్రతి వారం రూ.3 లక్షల నుంచి 80 వేలుకు తగ్గకుండా వారికి చెల్లింపులు ఉంటాయని టాక్.


ఇక హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునకు ఎంత పారితోషికం ఇస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే, ఆయనకు రూ.12 కోట్లు నుంచి రూ.15 కోట్లు వరకు చెల్లిస్తున్నట్లు టాక్. కానీ, దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఇదివరకు నాగ్‌‌కు రూ.8 కోట్ల వరకు ఇచ్చేవారని సమాచారం. అయితే, ఇటీవల ఆయన సీజన్-5, ఓటీటీ ‘బిగ్ బాస్- నాన్ స్టాప్’కు రూ.12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసింది.  హిందీ బిగ్‌బాస్ షో కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.350 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. కాకపోతే అక్కడ వచ్చే రేటింగ్ కూడా అత్యధికం. 


డిస్నీ హాట్ స్టార్‌లో 24x7 గంటలు స్ట్రీమింగ్: బిగ్ బాస్ మీరు టీవీలో ‘స్టార్ మా’ చానల్‌లో ప్రతి రోజు 10 నుంచి 11 గంటల వరకు మాత్రమే కాదు, కావాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24 గంటలూ లైవ్ కూడా వీక్షించవచ్చు. వీకెండ్ ఎపిసోడ్స్‌ను కూడా ముందుగానే చూసేయొచ్చని ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాబట్టి, మీ ఫేవరెట్ స్టార్‌పై మీరు 24 గంటలూ ఒక కన్నేసి ఉంచొచ్చు. 


‘బిగ్ బాస్’లోకి ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)