బుల్లితెరపై బిగ్ బాస్(Bigg Boss Telugu) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే తెలుగులో మొత్తం ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ(Bigg Boss Telugu OTT) వెర్షన్ ను మొదలుపెట్టబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా ఓటీటీ వెర్షన్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పటికే హిందీలో ఇలా ప్లాన్ చేశారు కానీ ఆశించిన స్థాయిలో వ్యూస్ రాలేదు. కానీ తెలుగులో మాత్రం కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఈసారి 24/7 ఈ షో హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. ఇందులో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, నాగార్జున కలిసి నటించారు. ఫన్నీగా ప్రోమోను డిజైన్ చేశారు. చివర్లో నాగార్జున.. 'నో కామా, నో ఫుల్ స్టాప్, ఇప్పుడు బిగ్ బాస్ అవుతుంది నాన్ స్టాప్' అంటూ డైలాగ్ చెప్పారు. అంటే రోజు మొత్తం హాట్ స్టార్ లో బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతూనే ఉంటుందన్నమాట. మరీ అన్ని గంటలంటే జనాలు చూస్తారో లేదో..!
ఇక ఫిబ్రవరి 26 నుంచి షో మొదలుకానుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక ఈ షోలో ఒకప్పటి కంటెస్టెంట్స్ కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు టీవీలో టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్ల నుంచి కొందరు కంటెస్టెంట్స్ ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 5 నుంచి మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ ఓటీటీ వెర్షన్ లో కనిపించబోతున్నారని సమాచారం.
తేజస్వి, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలానే నటుడు తనీష్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. సింగర్స్ కేటగిరీలో హేమచంద్ర ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈసారి సోషల్ మీడియా, యూట్యూబ్ స్టార్స్ చాలా మంది కనిపిస్తారట.