దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ బ్యూటీ తన అందంతో యూత్ ని ఆకట్టుకుంది. హౌస్ లో కొద్దిరోజులు ఉన్నప్పటికీ తన గేమ్ తీరుతో అందరినీ ఆకట్టుకుంది. కొన్ని కారణాల వలన ఆమె కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తరువాత దివికి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వచ్చాయి. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది. 


ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు ఒప్పుకుంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


'నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే' ప్రశ్నకు 'మరికొద్దిరోజుల్లోనే' అంటూ సమాధానమొస్తుంది. ఈ వీడియోలో దివి చాలా ఎగ్జైటెడ్ గా కనిపించింది. దీంతో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'గ్రీకువీరుడు నా రాకుమారుడు కొన్నిరోజుల్లో నా ముందుంటాడు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 


దివి ఫన్నీగా ఈ వీడియోను షేర్ చేసినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి అభిమానులను ఆటపట్టించడానికే ఆమె ఈ వీడియో షేర్ చేసిందనుకోవాలి!