కెప్టెన్సీ టాస్క్ మంచి హీట్ మీద సాగుతోంది.  సూర్య, రేవంత్, శ్రీహాన్, ఫైమా, కీర్తి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఫైనల్ అయినట్లు ఉన్నారు. వీరి మధ్య ఒక పోటీ పెట్టగా.. ఫైనల్ గా శ్రీహాన్, కీర్తి, సూర్య మిగిలారు. వీరికి బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. అదేంటంటే.. వీరిలో ఎవరైతే కెప్టెన్ స్థానానికి అనర్హుని హౌస్ మేట్స్ ఫీల్ అవుతారో వారిని కత్తితో గుచ్చాలి. అంటే.. హౌస్ మేట్స్ సపోర్ట్ ఉంటే కెప్టెన్ అవ్వొచ్చన్నమాట. 


దీంతో శ్రీహాన్, కీర్తి, సూర్య.. ఒక్కో హౌస్ మేట్ దగ్గరకు వెళ్తూ.. తమను సపోర్ట్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ముందుగా సూర్య.. ఫైమా దగ్గరకు వెళ్లి 'ఆల్రెడీ కెప్టెన్ అయ్యాననే పాయింట్ ను పక్కన పెట్టేసి' అని ఏదో చెప్పబోతుంటే వెంటనే పక్కనున్న రాజ్ 'ఎందుకు పక్కన పెట్టాలి' అంటూ కామెడీగా అన్నారు. ఆ తరువాత శ్రీహాన్.. రోహిత్ దగ్గరకు వెళ్లి కెప్టెన్ గా హౌస్ ని ఎలా చూసుకుంటాడో చెప్పారు. 


కీర్తి.. సత్య దగ్గరకు వెళ్లి 'లాస్ట్ టైం తన కెప్టెన్సీలో ఏవైతే తప్పులు జరిగాయో అవి జరగకుండా చూసుకుంటానని' చెప్పారు. ఇక సూర్య.. ఇనయా దగ్గరకు వెళ్లి తనను సపోర్ట్ చేయమని అడుగుతుండగా.. 'ఓకేరా నేను ఫిక్స్ అయిపోయినా' అంటూ డైలాగ్ కొట్టింది. కత్తి గుచ్చే సమయంలో సూర్యకి రాజ్ కి మధ్య డిస్కషన్ జరిగింది. అలానే రేవంత్ కూడా సూర్యతో ఆర్గ్యూ చేశారు. ఆ తరువాత ఇనయా వచ్చినప్పుడు.. సూర్యతో ఫన్నీ డిస్కషన్ జరిగింది. ఫైనల్ గా ఆమె వెళ్లి శ్రీహాన్ ని కత్తితో గుచ్చింది. షాకైన శ్రీహాన్ తన ఫ్రెండ్స్ తో డిస్కషన్ పెట్టారు. 'వారానికొక రంగు ఎవరు మారుస్తున్నారు ఇక్కడ' అంటూ ఇనయాను ఉద్దేశిస్తూ అన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.  






బుధవారం నాటి ఎపిసోడ్లో గీతూ, ఆదిరెడ్డి జంట కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో మొదటిరోజే తొలగిపోయారు. దీంతో రెండో రోజు వారిద్దరినీ సంచాలక్‌గా నియమించారు బిగ్ బాస్. చేపల వర్షం కురుస్తుంటే ఇంటి సభ్యులతో పాటూ తాను ఏరుకోవడం మొదలుపెట్టింది గీతూ. ఆదిరెడ్డి దీనికి అభ్యంతరం చెప్పాడు. 'నా ఇష్టం నేను ఏరుకుంటా సామి' అని చెప్పింది గీతూ. అలా సంచాలక్ చేపలు పట్టడాన్ని రేవంత్ గట్టిగా నిలదీశాడు. తనతో వాదిస్తే డిస్ క్వాలిఫై చేస్తా అంటూ వాదించింది గీతూ. 


రేవంత్ మైక్‌తో పాటూ పూల్ లో దిగడంతో అతనికి జరిమానా విధించి పది చేపలు తీసుకుంది. అలాగే బుట్టలో చేపలు ఒకరికి ఒకరు ఆటగాళ్లు లాక్కుంటున్నప్పుడు తాను కూడా వెళ్లి లాక్కోవడం మొదలుపెట్టింది. దీంతో ఆదిరెడ్డి మళ్లీ అభ్యంతరం చెప్పాడు. బాలాదిత్య కూడా అడిగాడు. అయినా గీతూలో మార్పు లేదు. 'నేను ఆడిస్తున్నా' అంటూ సమాధానం చెప్పింది. రేవంత్ - గీతూల మధ్య మాటల యుద్ధమే ఈ ఎపిసోడ్ లో హైలైట్ అయింది.


Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?