బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఇప్పటి వరకు కూడా ఆట మీద ఎక్కువ ఫోకస్ పెట్టని వాళ్ళు కూడా ఈసారి తమ సత్తా ఎంతో నిరూపించుకుంటున్నారు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు తమవంతుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్సీ కి పోటీదారులు బిగ్ బాస్ వస్తా.. నీ వెనుక అనే టాస్క్ ఇచ్చారు.
కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మేరీనా నిలిచినట్టు తెలుస్తోంది. వారికి ఇచ్చిన టాస్ ప్రకారం మూడు భాగాలుగా ఉన్న సర్కిల్ లో తిరుగుతూ తమ భుజాల మీద ఉన్న పేపర్ బాల్స్ బస్తాలని పట్టుకుని కాపాడుకోవాలి. ఒకదాని తర్వాత ఒక సర్కిల్ లో తిరుగుతూ తమ బ్యాగ్స్ ని కాపాడుకోవాలి. ఇప్పటికే ఈ ఆటకు సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది. ఇప్పుడు తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు.
ఇందులో రేవంత్ చాలా డల్ గా, ఫీల్ అవుతూ కనిపించాడు. దీంతో శ్రీసత్య, శ్రీహాన్ అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. నిన్నటి ఆటలో శ్రీసత్య.. రేవంత్ పై అరిచింది. దానికేమైనా బాధ పడ్డాడేమోనని తన సైడ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి రేవంత్ 'ఎంత ఆడినా.. బూడిదలో పోసిన పన్నీరైంది' కదా అని బదులిచ్చాడు.
ఆ తరువాత రేవంత్.. గేమ్ లో తను ఎంత కష్టపడి ఆడినా.. ఉపయోగం లేకుండా పోయిందని తనలో తనే బాధపడ్డాడు. ఆదిరెడ్డి వచ్చి రేవంత్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు కానీ రేవంత్ మాత్రం బాధపడుతూనే ఉన్నాడు. శ్రీసత్య మరోసారి రేవంత్ దగ్గరకు వెళ్లి.. దయచేసి ఇలా ఉండొద్దని రిక్వెస్ట్ చేసింది. 'నాతో ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పు' అని అడిగింది. దానికి రేవంత్ 'నాతో నాకే ప్రాబ్లెమ్' అని ఎమోషనల్ గా చెప్పాడు. ఆ తరువాత బిగ్ బాస్ రేవంత్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు.
ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్:
నిన్నటి గేమ్ లో రేవంత్ ‘నేను ఫిజికల్ అవ్వకుండా అయినట్టు ఆరోపణలు వేశారు కాబట్టి ఎవరిదైనా చిన్న గోరు తగిలినా నేను ఫిజికల్ అవుతా’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘గోరు తగిలినా ఫిజికల్ అవుతా అంటున్నాడు...రెజ్లింగా?’ అని అరిచాడు. దానికి రేవంత్ ‘నామినేషన్ కారణాలు వెతుక్కో... ఆ పనిలో ఉండు’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘నామినేషన్ వేయడానికి నీ విషయంలో కారణాలు వెతుక్కోపనిలేదు, నువ్వు అరగంటకొకటి ఇస్తావ్, ఏసుకో నువ్వు నామినేషన్ వేసుకుంటావో, ఏం వేసుకుంటావో వేసుకో, ఐ డోంట్ కేర్. నేను నీట్‌గా ఆడతా, ఫిజికల్ అవ్వను’ అన్నాడు.
Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత