ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. శనివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన సూర్యను స్టేజ్ పైకి పిలిచారు. అతడి జర్నీను ప్లే చేసి చూపించారు. ఆ తరువాత సూర్య హౌస్ మేట్స్ తో మాట్లాడారు. సూర్యకి ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్ మేట్స్ లో ఎవరు ఫైర్, ఎవరు ఫ్లవరో చెప్పమని అడిగారు. ఫైర్ లిస్ట్ లో ఫైమా, ఇనయా, రాజ్, కీర్తిల పేర్లు.. ఫ్లవర్ లిస్ట్ లో రేవంత్, గీతూ, శ్రీహాన్, బాలాదిత్యల పేర్లు చెప్పారు. 


తన మైక్ పై సూర్యుడి బొమ్మ వేసుకుని సూర్యకు చూపించారు ఇనయా. అలాగే సూర్యుడి ఉంగరం పెట్టుకుని చూపించారు. తరువాత ఏదో వేళ్లతో సైగ చేసుకున్నారు. అది చూసిన నాగార్జున 'లవ్ మరీ ఎక్కువైతే ఇలా అంటారా' అనేశారు. 


శ్రీసత్య, రాజ్ సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన పదమూడు మంది హౌస్ మేట్స్ కి కత్తి టాస్క్ ఇచ్చి.. అందులో శ్రీసత్య, రాజ్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


స్టేజ్ పై ఫరియా, సంతోష్:


హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, హీరో సంతోష్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. వీరిద్దరూ కలిసి 'లైక్, షేర్, సబ్ స్క్రైబ్'  అనే సినిమా చేశారు. ఇది అతి త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి బిగ్ బాస్ షోకి వచ్చారు. వారిద్దరినీ ఇంటి సభ్యులకు పరిచయం చేశారు నాగ్. ఆ తరువాత హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి కొన్ని గేమ్స్ ఆడించారు. 


వసంతి, శ్రీహాన్ సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన పదకొండు మందికి ఫిష్ టాస్క్ ఇచ్చి.. వసంతి, శ్రీహాన్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


కీర్తి, రేవంత్ సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన తొమ్మిది మందికి కలర్స్ టాస్క్ ఇచ్చి కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఆ తరువాత ఫరియా అబ్దుల్లా కోసం రేవంత్ ఒక సాంగ్ పాడారు. 


రోహిత్, గీతూ సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన ఏడుగురికి ఒక టాస్క్ ఇచ్చి రోహిత్, గీతూ సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


మనిషికో పేరు:


హౌస్ మేట్స్ తో 'మనిషికో పేరు' అనే గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో మెరీనా.. 'రచ్చ' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు. కీర్తి.. 'అపరిచితుడు' అనే ట్యాగ్ ను శ్రీహాన్ కి ఇచ్చారు. ఇనయాకు 'మహానటి' అనే ట్యాగ్ ఇచ్చారు శ్రీహాన్. 'కపటధారి' అనే ట్యాగ్ ను శ్రీహాన్ కు ఇచ్చారు ఇనయా. 'శ్వేత నాగు' అనే ట్యాగ్ ను కీర్తికి ఇచ్చారు శ్రీసత్య. 'వకీల్ సాబ్' అనే ట్యాగ్ ను బాలాదిత్యకు ఇచ్చారు రేవంత్. 'దొంగ దొంగ' అనే ట్యాగ్ ను ఆదిరెడ్డికి ఇచ్చారు గీతూ. 'శత్రువు' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు రోహిత్. 


ఫైమా, బాలాదిత్య సేఫ్:  


నామినేషన్స్ లో మిగిలిన ఐదుగురికి పడవ టాస్క్ ఒకటి ఇచ్చి.. ఫైమా, బాలాదిత్య సేఫ్ అయినట్లు ప్రకటించారు. 


'బలుపు' అనే ట్యాగ్ ను ఇనయాకు ఇచ్చారు వసంతి. 'టైం పాస్' అనే ట్యాగ్ ను రాజ్ కి ఇచ్చారు ఫైమా. 'ఆడంతే అదో టైప్' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు ఆదిరెడ్డి. 'బలుపు' అనే ట్యాగ్ ను ఫైమాకు ఇచ్చారు రాజ్. 'ఇడియట్' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు బాలాదిత్య. 


ఇనయా సేఫ్:


నామినేషన్స్ లో మిగిలిన ముగ్గురిలో ఇనయా సేఫ్ అయినట్లు ప్రకటించారు. ఫైనల్ గా మెరీనా, ఆదిరెడ్డి నామినేషన్స్ లో మిగిలారు. 


ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడేమోనని అతడిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది గీతూ. 


ఇద్దరూ సేఫ్:


ఆదిరెడ్డి, మెరీనాలకు కుండ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఆ కుండల్లో ఎవరికైతే రెడ్ కలర్ వస్తుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. అయితే ఇద్దరికీ గ్రీన్ కలర్ వచ్చింది. దీంతో ఇద్దరూ సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 


Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్