పవన్ కళ్యాణ్(Pawan Kalyan), రానా(Rana Daggubati) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'(Bheemla Nayak).మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

 

Also Read: 'తప్పు చేసిన వాడికంటే చూస్తూ ఊరుకున్నవాడిదే పెద్ద తప్పు'

ఇటీవల ఆయన లుక్ ని, క్యారెక్టర్ పేరుని రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సినిమాలో రానా క్యారెక్టర్ ఎలా వుండబోతుందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా ప్రెజంట్ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ లో యాటిట్యూడ్ చూపిస్తూ ఉన్న రానాను చూపించారు. 

 

ఆ తరువాత పవన్ కళ్యాణ్ వైఫ్ తో రానా మాట్లాడుతూ.. 'నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట.. స్టేషన్ లో టాక్ నడుస్తోంది. నేనెవరో తెలుసా..? ధర్మేంద్ర హీరో.. హీరో..' అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. వీడియో చివర్లో.. చుట్టూ జనం ఉండగా.. కారు మీదకెక్కి 'డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెం.1' అంటూ అరుస్తూ డైలాగ్ చెప్పాడు రానా. ఈ మొత్తం వీడియోకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది.