సినిమాల్లో నాన్న క్యారెక్టర్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చిత్తూరు నాగయ్య టైం నుంచి ఇప్పుడు రావు రమేష్ వరకూ చాలా మంది సినిమా నాన్నలు.. రియల్ లైఫ్ ఈవెంట్స్‌ను గుర్తుకు తెచ్చేలా, సందర్భాన్ని, క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమాను డ్రైవ్ చేస్తూ.. సక్సెస్ ఫుల్ రీల్ ఫాదర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ, మోడ్రన్ ఏజ్ తెలుగు సినిమాలో ఓ యాక్టర్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాదర్ రోల్స్ చేసి తనకంటూ ఓ రేంజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఎన్ని సార్లు ఎన్ని సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ వేసినా ప్రతీ సారి కొత్తగా అనిపించే డిఫరెంట్ మాడ్యూలేషన్స్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో ప్రకాష్ రాజ్ మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. మరి ‘ఫాదర్స్ డే’ సందర్భంగా ప్రకాష్ రాజ్ నటించిన ఫాదర్ క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే టాప్ 10 క్యారెక్టర్లను ఓ సారి గుర్తు చేసుకుందామా!


1. సుస్వాగతం:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎర్లీ డేస్ లో వచ్చిన సుస్వాగతం సినిమాను చూసిన వాళ్లెవరూ ప్రకాష్ రాజ్ చేసిన వాసుదేవరావు క్యారెక్టర్‌ను మర్చిపోలేరు. ‘‘నేను మోనార్క్‌ను, నన్నెవరకూ మోసం చేయలేరు’’ అంటూ ఓ అనుమానపు తండ్రిగా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్‌గా చెప్పుకోవాలి. 



2. నువ్వునాకు నచ్చావ్:
‘‘ఇవే తగ్గించుకుంటే మంచిది’’ అంటూ ఫన్నీ మీమ్ కంటెంట్‌గా ఈ రోజుకీ కనిపించే శ్రీనివాస మూర్తి క్యారెక్టర్.. విక్టరీ వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు ఓ కీ అండ్ క్రూషియల్ రోల్. ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్ తండ్రిగా, వెంకటేష్‌కు కౌంటర్లు వేసే పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయారు అంతే. ‘‘అమ్మా రాసుకోవటానికి పలక ఇచ్చావ్, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావ్.. కానీ, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావ్’’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన కవితను ఎప్పుడు చూసినా పగలబడి నవ్వుకుంటారు. 



3. నువ్వే నువ్వే:
ఓ రైటర్‌గా ప్రకాష్ రాజ్ కోసం ‘నువ్వు నాకు నచ్చావ్’లో అద్భుతమైన క్యారెక్టర్ రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్టర్‌గా తాను తీసిన ఫస్ట్ మూవీ ‘నువ్వే నువ్వే’లో ఓ అద్భుతమైన తండ్రి పాత్ర రాశారు. తన కూతురుని అమితంగా ప్రేమించే ఫ్రెండ్‌గా, ఓ మంచి అబ్బాయితో తనకు పెళ్లి జరిపించాలని తపన పడే తండ్రిగా ప్రకాష్ రాజ్ యాక్షన్ హైలెట్. 



4. ఇడియట్: 
సుస్వాగతం సినిమాలో నేను మోనార్క్‌ను యూనిక్ యాక్షన్ చూపించిన ప్రకాష్ రాజ్ ‘ఇడియట్’లోనూ పోలీస్ కమిషనర్‌గా హడలెత్తిస్తాడు. రక్షితకు తండ్రిగా, రవితేజ క్యారెక్టర్ చంటిగాడిని అడ్డుకోవాలని చూసే పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన యాక్టింగ్ రేంజ్ చూపించాడు ఈ సినిమాలో. సినిమా మొత్తం నెగటివ్ షేడ్స్‌లో రవితేజ కనిపించటం, కూతురిని ఓ ఇడియట్ నుంచి రక్షించాలనే క్యారెక్టర్‌లో ప్రకాష్ రాజ్ కనిపించటం ఇలా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లో చాలా డైమన్షన్స్ ఉండేలా రాసుకున్నారు పూరీ జగన్నాథ్. ‘‘కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా’’ అనే పంచ్ డైలాగ్ చాలా ఏళ్ల పాటు వినపడింది.



5. నువ్వొస్తానంటే నేనొద్దంటానా:
చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. నార్మల్ ఫాదర్ లా, భార్యకు ఎదురు చెప్పలేని భర్తలా, కొడుకు ప్రేమ కోసం కష్టపడుతుంటే చూడలేని తండ్రిగా... చాలా లవ్లీ క్యారెక్టర్ సినిమాలో ప్రకాష్ రాజ్‌ది. బాగా మండుతున్నట్టుంది డైలాగ్ గుర్తుంది కదా. 



6. బొమ్మరిల్లు: 
బొమ్మరిల్లు అంటే ప్రకాష్ రాజ్.. ప్రకాష్ రాజ్ అంటే బొమ్మరిల్లు. ఈరోజుకు కూడా ఎవరైనా కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండే ఫాదర్ ఉంటే చాలు ‘బొమ్మరిల్లు ఫాదర్’ క్యారెక్టర్ అనటం కామనైపోయింది.  అంతలా జీవించేశారు ‘బొమ్మరిల్లు’ సినిమాలో ప్రకాష్ రాజ్. తన కొడుకు ఏం కావాలో తనకు మాత్రమే తెలుసు అనుకునే ప్రొటక్టివ్ అండ్ ఓవర్ థింకింగ్ ఫాదర్ క్యారెక్టర్‌లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ‘‘మొత్తం మీరే చేశారు నాన్న’’ సీన్ అయితే ఎవర్ గ్రీన్ కదా. 



7. ఆకాశమంత:
ఓ కూతురికి తండ్రికి మధ్య ఉండే బాండింగ్ ఎంత అందంగా ఉంటుందో తెలియాలంటే కచ్చితంగా చూడాల్సిన సినిమా ఆకాశమంత. ఈ సినిమాలో త్రిషకు తండ్రిగా ఆయన నటించారో జీవించారో చెప్పటం కష్టం. తన కూతురు పుట్టినప్పటి నుంచి తను పెద్దదై పెళ్లి చేసే వరకూ తండ్రిగా తను సాగించిన జర్నీ అంతా ఓ కథలా చెబుతారాయన. ‘ఆకాశమంత ప్రేమ’ను పంచే తండ్రిగా ప్రకాష్ రాజ్ రోల్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఈ సినిమాలో.



8. కొత్త బంగారులోకం: 
చాలా సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్‌కు ‘కొత్త బంగారు లోకం’లో ఓ డిఫరెంట్ రోల్ ఇచ్చారు.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. టీనేజ్‌లో ఉన్న  కొడుకుకి తండ్రిలా కంటే ఓ మంచి ఫ్రెండ్‌లా అనిపించే క్యారెక్టర్‌లో ఆయన కనిపించేది కొద్ది సేపే అయినా గుర్తుండిపోయే పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. పర్టిక్యులర్‌గా వరుణ్ సందేశ్ తను ప్రేమించిన అమ్మాయి కోసం తల్లితండ్రులను వదిలేసి వెళ్లిపోయే సీన్‌లో ప్రకాష్ రాజ్ చెప్పే మాటలు ఇన్ డైరెక్ట్‌గా వరుణ్ సందేశ్‌తో పాటు కథను ఫాలో అవుతున్న ప్రేక్షకులకు డీప్ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్స్ చేయటం తనకు ఎంత కొట్టిన పిండో మరోసారి చూపించారు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్. 



09. ధోని:
ప్రకాష్ రాజ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా తీసిన సినిమా ధోనిలో ఆయన ఓ అన్ ఫర్ గెటబుల్ రోల్‌ను పోషించారు. తన కొడుకు ను ఎలాగైనా ఎంబీఏ చదివించాలనే రాత్రి పగలూ కష్టపడే సుబ్రహ్మణ్యం అనే విడోవర్ గా ప్రకాష్ రాజ్ యాక్టింగ్ తన యాక్టింగ్ ఎబిలిటీస్ ను మరోసారి బయటపెట్టిన సినిమా.  చదువంటే ఏ మాత్రం ఆసక్తి లేకుండా ఎమ్మెస్ ధోనిలా మంచి క్రికెటర్ కావాలనే తన కొడుకు లైఫ్ ని సుబ్రహ్మణ్యం ఎలా డిస్టర్బ్ చేశాడు మళ్లీ తన కొడుకు కలను ఎలా నెరవేర్చాడనేది సినిమా . ధోనిలా అవ్వాలనే ట్రే చేసే కుర్రాడిలా పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ అద్భుతమైన యాక్టింగ్ చేస్తే.. సుబ్రహ్మణ్యం పాత్రలో ప్రకాష్ రాజ్ లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్‌ను అందిస్తారు ఈ సినిమాలో. 



10. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలు చేసిన మిగిలిన సినిమాలన్నీ ఓ ఎత్తు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఆయన యాక్టింగ్ మరో ఎత్తు. రేలంగి మావయ్య అంటూ అందరూ ఆప్యాయంగా పిలుచుకునే రోల్‌లో ‘‘మనుషులంటేనే మంచోళ్లురా’’ అంటూ ప్రకాష్ రాజ్ నవ్వే స్వచ్ఛమైన నవ్వు.. నిజంగా ఎన్నో బాధలకు, ఆందోళనలకు మంచి మెడిసిన్ అనిపిస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల ఏ ఇంటెన్షన్ తో తీశారో దానికి వందశాతం న్యాయం చేస్తూ వెంకటేష్ , మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్‌కి తండ్రిలా ప్రకాష్ రాజ్ చేసిన యాక్టింగ్ ఎప్పటికీ మర్చిపోలేనిది.



Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?


Also Read: మీ మమ్మీకి కోడలు వస్తుందని చెప్పు - ప‌బ్లిక్‌గా 'జబర్దస్త్' వర్ష పెళ్లి ప్రపోజల్