కొన్ని రోజుల క్రితం రెబల్ కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత ఆయన సంస్మరణ సభ స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో నిర్వహించారు. ఇదిలా ఉండగా.. సోమవారం నాడు ఆయన కుటుంబ సభ్యులను నందమూరి బాలకృష్ణ దంపతులు పరామర్శించారు. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కృష్ణంరాజు మరణించిన సమయంలో బాలయ్య టర్కీలో ఉన్నారు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం ఆయన అక్కడకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో కృష్ణంరాజుని చివరిచూపు చూసుకోలేకపోయారు. హైదరాబాద్ కు చేరుకున్న బాలయ్య.. భార్య వసుంధరతో కలిసి కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్నో ఏళ్లుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగానని.. ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారు బాలయ్య.
అలాంటి వ్యక్తితో కలిసి నటించే అవకాశం 'సుల్తాన్', 'వంశోద్ధారకుడు' వంటి సినిమాలతో వచ్చిందని చెప్పారు. కృష్ణంరాజు గారు లేని లోటుని ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి.. ఆయన ఫొటోకి నివాళులు అర్పించారు.
కృష్ణంరాజు పేరిట స్మృతివనం:
కృష్ణం రాజు పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని మంత్రులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణం రాజు స్వగృహంలో నిన్న సంస్మరణ సభ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సభకు రాష్ట్ర మంత్రుు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజుతో పాటు కారుమూరి నాగేశ్వర రావు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభాస్ ను వారు పరామర్శించారు. తర్వాత ప్రభాస్ లో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా.. కృష్ణం రాజు సంస్మరణ సభ రోజు ప్రభాస్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన పేరు పైన స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇద్దరి మధ్య బలమైన సన్నివేశాలు రాశాడట దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించబోతున్నట్లు టాక్. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా అదే స్థాయిలో క్యారీ చేయబోతున్నారని సమాచారం.
శ్రుతి హాసన్ కాకుండా సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?
Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్