నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(Unstoppable with NBK) సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గెస్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే. వారు బాలయ్యకు బంధువులు కూడా కావడం, ఈ ఎపిసోడ్‌కు ముందు వదిలిన ప్రోమో అభిమానుల్లో అంచనాలు పెంచేయడంతో.. ఫస్ట్ ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో పది లక్షల మందికి పైగా ఈ ఎపిసోడ్‌ను చూశారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్ ప్రసారమవుతోంది. 


Balakrishna proposed Pawan Kalyan’s name for Bheemla Nayak: ఈ ఎపిసోడ్ కి ముందుగా విశ్వక్ సేన్(Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) గెస్ట్ లుగా వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించిన బాలయ్య.. ఆ తరువాత నిర్మాత నాగవంశీ(NagaVamsi)ని స్టేజ్ పైకి పిలిచారు. అతడితో మాట్లాడుతూ.. 'భీమ్లానాయక్ సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎవరు..?' అని ప్రశ్నించారు బాలయ్య. దానికి నాగవంశీ.. 'మీరే సర్.. మేం మీ చుట్టూ తిరిగి హీరోగా మిమ్మల్ని అడిగిన తరువాత సినిమా చూసి కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని మీరే కదా సజెస్ట్ చేశారు' అంటూ సమాధానమిచ్చారు. 


నిజానికి ఈ సినిమా రీమేక్ హక్కులను బాలయ్య కోసమే కొన్నారనే మాటలు అప్పట్లో వినిపించాయి. అదే నిజమని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. బాలయ్య ఇచ్చిన సలహాతోనే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పవన్ కళ్యాణ్ ని ఎప్రోచ్ అయినట్లు నిర్మాత వెల్లడించారు. ఇప్పుడు బాలయ్య స్వయంగా ఈ టాపిక్ గురించి మాట్లాడడంతో దానికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. బాలయ్య అభిమానులైతే.. 'భీమ్లానాయక్' బాలయ్య చేసి ఉంటే ఆయన క్రేజ్ మరింత పెరిగి ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. 


ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడితో మరో సినిమా ఒప్పుకున్నారు బాలయ్య. షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. 


హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. సినిమా బడ్జెట్ కి తగ్గట్లే బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బాలయ్యకు రూ.25 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారట. ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. 


Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?