Boyapati Balayya New Movie: నందమూరి నట సింహం బాలకృష్ణ, ఊరమాస్ సినిమాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేయగా, అన్నీ అద్భుత విజయం సాధించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి. వీరిద్దరు కలిసి చివరగా ‘అఖండ’ సినిమా చేశారు. 2021లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు.
‘అఖండ’ సీక్వెల్ టైటిల్ రివీల్ చేసిన మేకర్స్
‘అఖండ’ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమాకు ‘అఖండ 2: తాండవం’ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో బాలయ్య నుదుటికి విభూతి రాసుకుంటూ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక తమన్ బీజీఎం టైటిల్ రివీల్ వీడియోకు హైలెట్ గా నిలిచింది. ఈ వీడియో చూసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సినిమా రంగంలోకి బాలయ్య కూతురు ఎంట్రీ
బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రంతో నటసింహం చిన్న కూతురు ఎం. తేజస్వి నందమూరి సినిమా రంగంలోకి అడుగు పెడుతోంది. ‘అఖండ 2: తాండవం’ సినిమాను సమర్పిస్తోంది. అటు ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట , గోపీ అచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య, బోయపాటి కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి సినిమాలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించాయి. నాలుగో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు బాలయ్య అభిమానులు.
‘అఖండ’కు మించిన యాక్షన్
‘అఖండ’ సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్ ప్రేక్షకులను కట్టిపడేసింది. హిందుత్వ ఎజెండా సినిమా కథకు మరింత బలాన్ని చేకూర్చింది. దేవాలయాలు పరిరక్షణతో పాటు ఆలయాల విశిష్టతను బేస్ చేసుకుని ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. రెండో భాగంలో బోయపాటి ఏ పాయింట్ ను హైలెట్ చేస్తాడోనని అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య, బాబీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 109వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!
Read Also: మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని, ఈ సంక్రాంతి క్లాష్ తో బాక్స్ ఆఫీసు మోత మోగాల్సిందే